
ఎయిర్‌ఫోర్స్ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో గందరగోళం
మెదక్ జిల్లా సంగారెడ్డిలో ఎయిర్‌ఫోర్స్ రిక్రూట్‌మెంట్ ర్యాలీని గురువారం ఉన్నతాధికారులు ప్రారంభించారు.
మెదక్: మెదక్ జిల్లా సంగారెడ్డిలో ఎయిర్‌ఫోర్స్ రిక్రూట్‌మెంట్ ర్యాలీని గురువారం ఉన్నతాధికారులు ప్రారంభించారు. ఈ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో పాల్గొనేందుకు 5 జిల్లాల నుంచి సుమారు 15 వేల మంది నిరుద్యోగులు హాజరయ్యారు. తొలిరోజు సర్టిఫికెట్లను అధికారులు పరిశీలిస్తున్నారు. అయితే ఇంటర్మీడియట్ లాంగ్ మెమో తప్పని సరి అని ఎయిర్ఫోర్స్ అధికారులు అని స్పష్టం చేశారు. దాంతో నిరుద్యోగుల్లో గందరగోళం నెలకొంది.
ఈ ఏడాది తమకు లాంగ్ మెమోను ప్రభుత్వం ఇవ్వలేదని ఈ ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్మెన్ పోస్టులకు ప్రస్తుతం నిర్వహిస్తున్న రిక్రూట్మెంట్ ర్యాలీలో భాగంగా గురువారం శరీరదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.