కూలిన విమానం, పైలట్ మృతి
కూలిన విమానం, పైలట్ మృతి
Published Wed, Sep 21 2016 9:58 AM | Last Updated on Mon, Sep 4 2017 2:24 PM
కాలిఫోర్నియా: అమెరికా వైమానిక దళానికి చెందిన విమానం కూలిపోయిన ఘటనలో ఓ పైలట్ మృతి చెందగా.. మరో పైలట్ తీవ్రంగా గాయపడ్డాడు. 'యూ-2 డ్రాగన్ లేడి' నిఘా విమానం బీల్ ఎయిర్ఫోర్స్ బేస్ నుంచి బయలుదేరిన కొద్ది సమయంలోనే ఉత్తర కాలిఫోర్నియాలో కూలిపోయింది. పైలట్ల వివారలను వెల్లడించనప్పటికీ.. ఈ ప్రమాదాన్ని యూఎస్ ఎయిర్పోర్స్ ధృవీకరించింది.
యూ-2 విమానాలు ఎక్కువ ఎత్తులో ఎగరడంలో ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. 21,336 మీటర్ల ఎత్తులో సైతం ప్రయాణించే ఈ విమానాలు.. తక్కువ ఎత్తులో ఎగరడంలో మాత్రం కొంత ప్రతికూలతను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. పైలట్ మృతి పట్ల ఎయిర్ఫోర్స్ చీఫ్ డేవ్ గోల్డ్ఫిన్ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణ జరుపుతన్నామని ప్రకటించారు.
Advertisement
Advertisement