
సాక్షి, హైదరాబాద్: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, 11వ ఆర్మీ సర్వీస్ కార్ప్స్ రీయూనియన్ వేడుకల్లో భాగంగా నవంబర్ 30న గయలో ప్రారంభమైన ఆర్మీ మైక్రోలైట్ ఎక్స్‌పెడిషన్ బృందం ఆదివారం హకీంపేట్‌లోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు చేరింది. ఈ బృందం 17 రోజుల్లో 5000 కి.మీ ప్రయాణించనుంది. సాహసయాత్రలను చేపట్టే ‘ఫ్లయింగ్ రాబిట్స్’బృందంతో గయలోని నోడల్ సెంటర్ (మైక్రోలైట్) ఆర్మీ స్టాఫ్ డిప్యూటీ చీఫ్ ఆధ్వర్యంలో ఈ యాత్రను ప్రారంభించారు.
ఇందులోభాగంగా తక్కువ బరువున్న నాలుగు విమానాలు బిహార్, ఉత్తరప్రదేశ్‌లోని కొండ ప్రాంతాలు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని మైదాన ప్రాంతాల మీదుగా ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటూ పయనిస్తాయి. హైదరాబాద్‌కు చేరిన ఫ్లయింగ్ రాబిట్స్ బృందానికి ఆర్మీ ఆధ్యర్యంలో ఘనస్వాగతం పలికారు.
Comments
Please login to add a commentAdd a comment