Air Force station
-
హైదరాబాద్ చేరుకున్న ‘ఫ్లయింగ్ రాబిట్స్’
సాక్షి, హైదరాబాద్: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, 11వ ఆర్మీ సర్వీస్ కార్ప్స్ రీయూనియన్ వేడుకల్లో భాగంగా నవంబర్ 30న గయలో ప్రారంభమైన ఆర్మీ మైక్రోలైట్ ఎక్స్‌పెడిషన్ బృందం ఆదివారం హకీంపేట్‌లోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు చేరింది. ఈ బృందం 17 రోజుల్లో 5000 కి.మీ ప్రయాణించనుంది. సాహసయాత్రలను చేపట్టే ‘ఫ్లయింగ్ రాబిట్స్’బృందంతో గయలోని నోడల్ సెంటర్ (మైక్రోలైట్) ఆర్మీ స్టాఫ్ డిప్యూటీ చీఫ్ ఆధ్వర్యంలో ఈ యాత్రను ప్రారంభించారు. ఇందులోభాగంగా తక్కువ బరువున్న నాలుగు విమానాలు బిహార్, ఉత్తరప్రదేశ్‌లోని కొండ ప్రాంతాలు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని మైదాన ప్రాంతాల మీదుగా ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటూ పయనిస్తాయి. హైదరాబాద్‌కు చేరిన ఫ్లయింగ్ రాబిట్స్ బృందానికి ఆర్మీ ఆధ్యర్యంలో ఘనస్వాగతం పలికారు. -
ఆందోళన కలిగిస్తున్న ‘ముతక’ దాడులు
జమ్మూలోని భారత వైమానిక దళ స్థావరం మీద ముతక డ్రోన్లను ఉపయోగించి చేసినట్టుగా చెబుతున్న దాడి కొత్త సవాళ్లను ఎత్తిచూపుతోంది. కల్లోలిత ప్రాంత మైన జమ్మూకశ్మీర్‌లోకి విషమ యుద్ధం ప్రవేశించడం చెడుకు సంకేతం. 2018లో అధికంగా రష్యా కార్య నిర్వహణలో ఉన్న సిరియాలోని హుమాయ్‌మిమ్ వైమానిక స్థావరం ఈ డ్రోన్ల దాడికి గురైంది. ఇందులో స్థావరంలో ఉంచిన రష్యా విమానాలు, ఇతర పరికరా లకు తీవ్ర నష్టం జరిగింది. స్వల్ప శ్రేణి ప్రతి–వైమానిక క్షిపణులు, రేడియో జామర్ల సాయంతో కొన్ని డ్రోన్లను కూల్చినట్టుగా రష్యా ప్రకటించింది. జమ్మూలో జరిగిన దాడి హుమాయ్‌మిమ్ దాడిని దాదాపుగా పోలివుంది. ఏమైనా వ్యర్థాలు, డక్ట్ టేపు ఉపయోగిస్తూ ‘ఐఈడీ’ (మెరుగుపరిచిన పేలుడు పదార్థాలు)లను మోసుకు పోయేలా తయారుచేసిన డ్రోన్లు కోట్లాది రూపాయల విలువైన నేలమీది సంప్రదాయ విమానాలకు నష్టం కలిగించగలవు. వైమానిక విధాన నిర్ణేతలకు ఇది కొత్త సవాళ్లను విసురుతోంది. తీవ్రవాద గ్రూపుల చేతుల్లోకి డ్రోన్లు రావడం 2013–15 మధ్యకాలంలో సిరియా గ్రామాల్లో మొద లైంది. కొత్తగా రూపుదిద్దుకుంటున్న ఇస్లామిక్ స్టేట్ లోకి సాంకేతిక పరిజ్ఞానం కలిగిన యువత యూరప్, ఇంకా ఇతర ప్రాంతాల నుంచి చేరడం, తమకూ ఒక వైమానిక శాఖ ఉండాలన్న ఆలోచన రావడంతో ఏమీ లేనిచోట సిరియా, ఇరాక్ యుద్ధ క్షేత్రాల్లోని తుక్కును ఉపయోగించి డ్రోన్లు తయారు చేశారు. క్రమంగా వాణిజ్యంగా అందుబాటులో ఉన్న క్వాడ్కాప్టర్లను నవీ కరిస్తూ ఐఈడీలు, ఇతర పేలుడు పదార్థాలు మోయ డానికి ఉపయోగించారు. ఇస్లామిక్ స్టేట్ ఉధృతి కొనసాగుతున్న కాలంలో, రోజువారీ ఎలక్ట్రానిక్స్ దుకాణాల్లో కొనుగోలుకు అందుబాటులో ఉండి సినిమాలు, క్రీడలను షూట్ చేయడానికి ఉపయోగించే క్వాడ్కాప్టర్లు స్మగ్లర్ల ద్వారా సిరియా, ఇరాక్‌లోకి ప్రవేశించాయి. కాన్ఫ్లిక్ట్ ఆర్మ మెంట్ రీసెర్చ్ ప్రకారం, 2016 ఆగస్ట్‌లో ఇండియాలో కొనుగోలు చేసిన ఒక డ్రోన్ అదే సంవత్సరం అక్టో బర్లో యునైటెడ్ కింగ్డమ్లో యాక్టివేట్ అయింది. అనంతరం అది ఉత్తర ఇరాక్‌లోని తాల్ అఫార్ చేరింది. తమ డ్రోన్ల దళం ఒకే వారంలో 39 మంది ఇరాకీ సైనికులను చంపడమో, గాయపరచడమో చేశా యని అదే ఏడాది కొద్ది రోజుల తర్వాత ఇస్లామిక్ స్టేట్ చెప్పుకుంది. ఈ ప్రతి దాడినీ అందులో ఉంచిన కెమె రాల సాయంతో రికార్డ్ చేశారు. దీనివల్ల వారి ప్రచార వ్యాప్తికి ప్రచండమైన మేత దొరికినట్టయింది. అయితే, ఈ తరహా దాడుల నుంచి ఎదురయ్యే భయాలను అవగతం చేసుకోవడంలో ఆటంకాలు న్నాయి. టర్కీ తయారీ బేరక్తార్ టీబీ2 డ్రోన్లను అర్మేని యాకు వ్యతిరేకంగా నగోర్నో–కరబాఖ్ యుద్ధంలో అజర్బైజాన్ విజయవంతంగా ఉపయోగించింది. ఇది ఈ తరహా డ్రోన్ల నాణ్యత విశేషంగా పెరగడానికి కార ణమైంది. అంతమాత్రాన ఆ డ్రోన్ల వాడకాన్ని జమ్మూ ఘటనతో పోల్చరాదు. అజర్బైజాన్– అర్మేనియా యుద్ధం సంప్రదాయబద్ధమైనది, రెండు దేశాల మధ్య జరిగినది, పైగా బేరక్తార్ డ్రోన్లు పూర్తిగా సైనికావస రాల కోసం ఉద్దేశించినవి. ఇవి ముతక డ్రోన్లు కావు. ఎందుకు నొక్కిచెప్పాలంటే, దేశంలో జరుగుతున్న చర్చల్లో ఈ సామ్యాన్ని తేవడంలో సవరణ అవసరం కాబట్టి. గత కొన్నేళ్లుగా ముతక డ్రోన్ల వాడకం పెరిగింది. కొన్ని నివేదికలు సూచిస్తున్నట్టుగా 2019లో మావోయి స్టులు కూడా ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో ఒక పారామిలి టరీ క్యాంపు మీద నిఘా వేయడానికి డ్రోన్ ఉపయో గించారు. సౌదీ అరేబియాలోని చమురు శుద్ధి క్షేత్రాల మీద దాడుల నుంచి, 2018లో వెనిజులా నాయకుడు నికోలస్ మదురో మీద హత్యాయత్నం దాకా, ఈ సాంకేతిక పరిజ్ఞాన వాడకం పెరిగింది. ఈ డ్రోన్ల లాంటి విషమ యుద్ధవాతావరణం భారతీయ కోణం నుంచి చూస్తే కొత్తేమీ కాదు. ఈ మోసపు డ్రోన్లను ఒక ప్రమాదంగా 2020 డిసెంబర్లోనే ఎయిర్‌ఫోర్స్ ప్రధానాధికారి నొక్కి చెప్పారు. కాబట్టి ఈ అంశం ఇప్పటికే స్థావరాల సంరక్షణ, ప్రతిక్రియలోకి వచ్చి చేరవలసింది. మొత్తంగా సాంకేతిక పరిజ్ఞానం గురించే ఒక ప్రతిక్రియ అవసరం ఉండగా, జమ్మూ సంఘటన ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానం కేవలం సైన్యానికో, దేశానికో పరిమితం కాదని ఎత్తిచూపింది. కబీర్ తనేజా, ఫెలో, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ (హిందుస్తాన్ టైమ్స్ సౌజన్యంతో) -
డ్రోన్ దాడి పాక్ పనే: జమ్ము కశ్మీర్ డీజిపీ
జమ్మూ: జమ్మూలోని భారత వైమానిక దళం స్థావరంపై సంచలనాత్మక డ్రోన్ దాడి వెనుక నిషేధిత లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ ఈ దాడికి కారణమని అనుమానిస్తున్నట్లు జమ్ము కాశ్మీర్ డిజిపి దిల్బాగ్ సింగ్ తెలిపారు. పాక్ సరిహద్దు ఆవల నుంచే ఆ డ్రోన్లు వచ్చాయని భావిస్తున్నట్లు వెల్లడించారు. వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు ఆదివారం డ్రోన్లతో దాడులు జరపగా ఇద్దరు జవాన్లు గాయపడిన సంగతి తెలిసిందే. డ్రోన్ కాక్టైల్ భాగంలో ఆర్డీఎక్స్ను పేలుడుకు ఉపయోగించినట్లు అధికారులు అంచనాకొచ్చారు. భారత వైమానిక దళం స్థావరం వద్ద ప్రస్తుత పరిస్థితిని ఐపిఎస్ అధికారి సింగ్ పర్యవేక్షిస్తున్నాడని ఆయన అన్నారు. జమ్మూలో అనుమానాస్పద ప్రాంతాల్లో పోలీసులు వరుసగా సోదాలు జరుపుతున్నారు. జమ్మూ కాశ్మీర్లో అనధికారికంగా డ్రోన్లను ఉపయోగించవద్దని ప్రజలకు హెచ్చరిక కూడా జారీ చేసినట్లు ఆయన తెలిపారు. ఇక ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కు అప్పగిస్తూ కేంద్ర హోం శాఖ మంగళవారం నిర్ణయం తీసుకుంది. మరో ఉగ్రకుట్ర భగ్నం జమ్మూకశ్మీర్‌లో డ్రోన్ల సాయంతో ప్రయత్నించిన మరో ఉగ్రకుట్రను భద్రతా సిబ్బంది భగ్నం చేశారు. భారత వైమానిక దళం(ఐఏఎఫ్) స్థావరంపై డ్రోన్ల దాడి జరిగిన కొన్ని గంటల్లోనే అదే తరహా ఘటన పునరావృతమవడం సంచలనం రేపింది. ఈసారి సైనిక స్థావరాన్ని ముష్కరులు లక్ష్యంగా చేసుకున్నారు. డ్రోన్లతో దాడికి ప్రయత్నించారు. ఆర్మీ జవాన్లు అప్రమత్తమై ఎదురుదాడికి దిగడంతో డ్రోన్లు తోకముడిచాయి. జమ్మూకశ్మీర్‌లోని రత్నుచక్–కలుచక్ సైనిక స్థావరం వద్ద ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు సోమవారం ప్రకటించారు. ఆదివారం అర్ధరాత్రి 11.45 గంటలకు ఒక డ్రోన్, సోమవారం తెల్లవారుజామున 2.40 గంటలకు మరో డ్రోన్ సైనిక స్థావరం వైపు దూసుకొచ్చాయని తెలిపారు. వాటిని నేలకూల్చడానికి విధుల్లో ఉన్న సెంట్రీలు దాదాపు రెండు డజన్ల రౌండ్లు కాల్పులు జరపడంతో డ్రోన్లు వెనక్కి వెళ్లిపోయాయని పేర్కొన్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు ఆర్మీ పీఆర్ఓ లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్ వివరించారు. చదవండి: మొబైల్ సిగ్నల్ కోసం చెట్టెక్కిన పిల్లలు.. అంతలోనే ఒక్కసారిగా -
నేటి నుంచి సూర్యలంక తీరంలో మిస్సైల్ ఫైరింగ్
బాపట్ల టౌన్: గుంటూరు జిల్లా బాపట్ల సమీపంలోని సూర్యలంక తీరంలో మంగళవారం నుంచి మిస్సైల్ ఫైరింగ్ ప్రారంభం కానుంది. డిసెంబర్ 2వ తేదీ వరకు ఇది కొనసాగుతుంది. భారతదేశంలో ఉన్న ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లలో తీరప్రాంతానికి దగ్గరగా దట్టమైన అడవుల మధ్య ఫైరింగ్ చేసేందుకు అనుకూలంగా ఉండటంతో మిస్సైల్ ఫైరింగ్‌కు ఈ తీరాన్ని ఎన్నుకున్నారు. ఆకాశమార్గం గుండా దేశంలోకి చొరబడే శత్రు విమానాలను నింగిలోనే గుర్తించి ఆ విమానాలను వందల కిలోమీటర్ల దూరంలో ఉండగానే మట్టికరిపించడం ఈ మిస్సైల్ ఫైరింగ్ ముఖ్య ఉద్దేశం. ఫైరింగ్‌కు కేరాఫ్ రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాల్లో సహజసిద్ధమైన తీరంగా ఖ్యాతిని సొంతం చేసుకుంది సూర్యలంక తీరం. వైమానిక దళానికి శిక్షణ ఇవ్వడంలోనూ ప్రత్యేకత చాటుతోంది. త్రివేండ్రం కమాండ్ పరిధిలో ఉన్న వాటిలో ఫైరింగ్‌కు అనుకూలమైన స్టేషన్ సూర్యలంక ఒక్కటే. ఫైరింగ్ చేసే ప్రతిసారీ మిస్సైల్ తయారీకి ఉపయోగించే శకలాలు భూమ్మీద పడితే వాటి నుంచి వెలువడే రసాయనాలు, ఇనుప వస్తువులు, ఉక్కుసామగ్రి వల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంటుంది. అయితే, సూర్యలంక ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ సముద్రానికి ఆనుకుని ఉండటంతో మిస్సైల్ ఫైరింగ్ అనంతరం శకలాలు సముద్రంలో పడిపోతుంటాయి. దీంతో ఎవరికీ ఎలాంటి హాని వాటిల్లే అవకాశం లేదు. అందుకే దేశంలో ఉన్న అన్ని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లకంటే సూర్యలంక స్టేషన్ శిక్షణ రంగంలో ముందంజలో ఉంది. తీరప్రాంత గ్రామాల్లో హెచ్చరికలు జారీ సూర్యలంక సముద్ర తీరంలో మంగళవారం నుంచి డిసెంబర్ 2 వరకు జరిగే మిస్సైల్ ఫైరింగ్‌కు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, రాష్ట్ర రెవెన్యూ, పోలీస్, మత్స్యశాఖాధికారులు తీరప్రాంతాల్లోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అప్రమత్తం చేశారు. ఫైరింగ్ జరిగే ప్రాంతం నుంచి తీరం వెంబడి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ప్రజలు ఉండకూడదని, ముఖ్యంగా మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లో దండోరా వేయించి ప్రజలకు ఫైరింగ్‌పై అవగాహన కల్పించారు. సూర్యలంకకు ప్రత్యేక స్థానం భారతదేశంలో మొత్తం 7 కమాండ్లు ఉన్నాయి. వాటిలో డబ్ల్యూఏసీ (వెస్ట్రన్ ఎయిర్ కమాండ్– ఢిల్లీ), సౌత్ ఎయిర్ కమాండ్ (త్రివేండ్రం), సౌత్ వెస్ట్ ఎయిర్ కమాండ్ (గుజరాత్), మెయింటెనెన్స్ కమాండ్ (నాగపూర్), సెంట్రల్ కమాండ్ (అలహాబాద్–యూపీ), ట్రైనింగ్ కమాండ్ (బెంగళూరు), అండమాన్ నికోబార్ కమాండ్ (పోర్ట్‌బ్లెయిర్)లో ప్రధానమైన కమాండ్లు ఉన్నాయి. ఒక్కో కమాండ్ పరిధిలో పదుల సంఖ్యలో ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లు ఉంటాయి. త్రివేండ్రంలో ఉన్న సౌత్ ఎయిర్ కమాండ్ (సదరన్ కమాండ్) పరిధిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు సంబంధించిన 15 ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లు ఉన్నాయి. వీటిలో బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న ఏకైక ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ సూర్యలంక మాత్రమే. -
చైనా సరిహద్దులో సుఖోయ్ గల్లంతు
-
పఠాన్‌కోట్‌లో ఆపరేషన్ కొనసాగుతూనే..!
పఠాన్‌కోట్/న్యూఢిల్లీ: పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌లో భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన ఈ వైమానిక స్థావరం ఆదివారం ఉదయం కూడా కాల్పులతో దద్దరిల్లింది. ఈ నేపథ్యంలో ఎయిర్‌బేస్‌లో నక్కిన ఒక ఉగ్రవాదిని భద్రతా దళాలు హతమార్చాయి. మరో ఉగ్రవాదిని కూడా హతమార్చినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఎయిర్‌బేస్‌లో భద్రతా దళాల ఆపరేషన్ కొనసాగుతున్నదని, ఇప్పటికే సైనిక దుస్తుల్లో ఉన్న ఉగ్రవాదులను జవాన్ల నుంచి వేరుచేసిన బలగాలు.. వారిని ఏరివేసేందుకు ప్రయత్నిస్తున్నాయని కేంద్రంలోని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. అయితే ఇప్పటివరకు ఎయిర్‌బేస్‌లో ఎంతమంది ఉగ్రవాదులను ఏరివేశారు, ఇంకా ఎంతమంది నక్కి ఉన్నారన్నది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఎయిర్‌బేస్‌లో నక్కిన మరో ఇద్దరు ఉగ్రవాదులతో కమాండోల ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని, ఈ ఆపరేషన్ త్వరగా ముగుస్తుందని భావిస్తున్నామని కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షి ఢిల్లీలో ఆదివారం సాయంత్రం తెలిపారు. ఈ ఉగ్రవాద దాడి విషయంలో కేంద్రం వ్యవహరించిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారంటూ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నారు. దీంతో ఇప్పటివరకు ఈ ఘటనలో ఎంతమంది ఉగ్రవాదులు హతమయ్యారన్నది అధికారికంగా సరైన సమాచారం అందకపోవడం సందిగ్ధతకు దారితీస్తోంది. ఎయిర్‌బేస్‌పై దాడిచేసిన మొత్తం ఆరుగురు ఉగ్రవాదుల్లో ఐదుగురు చనిపోయినట్టు ఇప్పటివరకు అందిన సమాచారం. అయితే, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎయిర్‌బేస్‌పై దాడి చేసిన ఉగ్రవాదుల్లో నలుగురు శనివారం హతమయ్యారని ప్రకటించింది. ఎయిర్‌బేస్‌లో నక్కిన మరో ఇద్దరు ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఆపరేషన్ కొనసాగుతున్నదని తెలిపింది. ఎయిర్‌బేస్‌లో నక్కిన ఇద్దరు ఉగ్రవాదులు ఆదివారం ఉదయం కాల్పులకు తెగబడటంతో మళ్లీ కలకలం రేగింది. శనివారం ఉదయం పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఏడుగురు జవాన్లు మృతి చెందారు. 20 మంది గాయపడ్డారు. ఉగ్రవాదుల దాడిని దీటుగా తిప్పికొట్టిన బలగాలు నలుగురిని హతమార్చాయి. అయినా ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ శనివారంతో ముగియలేదు. మరో ఇద్దరు ఉగ్రవాదులు ఎయిర్‌బేస్‌లో దాగి ఉన్నట్టు తేలడం.. ఆదివారం ఉదయం కాల్పులు చోటుచేసుకోవడంతో బలగాలు మరో ఆపరేషన్ చేపట్టాయి. ఎదురుకాల్పుల్లో ఇప్పటికే ఐదో ఉగ్రవాది మధాహ్నం హతమవ్వగా.. మరికొంత ప్రతిఘటన అనంతరం ఆరో ఉగ్రవాది కూడా మృతిచెందినట్టు సమాచారం అందుతోంది. దీనిని అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. కాగా, ఎయిర్ బేస్ లో ఆదివారం ఉదయం గ్రనేడ్ పేలిన ఘటనలో ఆర్మీ ఆఫీసర్ నిరంజన్ సింగ్ మృతిచెందగా, మరో ఐదుగురు సిబ్బంది గాయపడినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులు తీసుకొచ్చిన గ్రనేడ్ నిర్వీర్యం చేస్తుండగా ఈ ఘటన సంభవించింది. -
తరలివచ్చిన జనం
గగనతలంలో పల్టీలు కొడుతూ, ఆకాశంలో అద్భుతాలను ఆవిష్కరించే లోహ విహంగాల విన్యాసాలను వీక్షించేందుకు జనసాగరమే తరలివచ్చింది. బెంగళూరులోని యలహంక ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో జరుగుతున్న ‘ఏరో ఇండియా-2015’ ప్రదర్శనలో విమానాల విన్యాసాల చూసేందుకు గురువారం పెద్ద ఎత్తున్న ప్రజలు తరలివచ్చారు. ఉదయం 10 గంటల నుంచి లోహ విహంగాల విన్యాసాలు ప్రారంభమయ్యాయి. ప్రదర్శనను తిలకించేందుకు వేలాదిగా సందర్శకులు తరలిరావడంతో యలహంక ప్రాంతంలో గురువారం ఉదయం నుంచే ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. కాగా భద్రతా కారణాల దృష్ట్యా ముందుగానే టికెట్లను బుక్ చేసుకున్న వారిని అన్ని విధాలైన ధ్రువీకరణ పత్రాలు పరిశీలించిన తర్వాత మాత్రమే అధికారులు ప్రదర్శనకు అనుమతిస్తున్నారు. ఏరో ఇండియా-2015 ప్రదర్శన ఈ నెల 22వరకు కొనసాగనున్న విషయం తెలిసిందే. సాక్షి, బెంగళూరు -
వాయుసేన కేంద్రం ఏర్పాటుపై సందిగ్ధం
ఆదిలాబాద్ అర్బన్ : భారత వాయుసేన కార్యకలాపాల విస్తరణ కేంద్రం (ఎయిర్ స్ట్రిఫ్) ఏర్పాటుపై సందిగ్ధత నెలకొంది. ఈ కేంద్రా న్ని ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదిలాబాద్‌తోపాటు, పక్కనే ఉన్న నిజామాబాద్ జిల్లాలో స్థలాలను పరిశీలించడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. మంగళవారం భారత వాయుసేన ఉన్నతాధికారుల బృందం హైదరాబాద్ సీఎం కేసీఆర్‌ను కలిసింది. సానుకూలంగా స్పందించిన సీఎం రెండు జిల్లాల్లో భూముల లభ్యతకు సంబంధించిన మ్యాపులను పరిశీలించారు. దీంతో అం దరూ అనుకుంటున్నట్లు ఈ కేంద్రం ఆదిలాబాద్ శివారులో ఏర్పాటవుతుందా? లేదా పక్క జిల్లాకు తరలిపోనుందా? అనే అయోమయం నెలకొంది. నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలంలో కూడా ఎయిర్ స్ట్రిఫ్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన చాలా ఏళ్లుగా ఉంది. అక్కడ కూడా రెవెన్యూ అధికారులు పలుమార్లు స్థలాలను పరిశీలించారు. వాయుసేన కార్యకలాపాల విస్తరణ కేంద్రానికి కావాల్సిన స్థలాన్ని గుర్తించి ప్రభుత్వానికి నివేదిక అందజేసిన జిల్లా యంత్రాంగం ఆ స్థలంలో నీటి సరఫరా, విద్యుత్, తదితర సౌకర్యాల కల్పనకు రూ.15 కోట్లతో ప్రతిపాదనలు కూడా పంపింది. 1,591 ఎకరాల భూమి గుర్తింపు జిల్లా కేంద్రంలో ఎయిర్ స్ట్రిఫ్ నిర్మాణానికి 1591.45 ఎకరాల భూమిని అధికారులు గుర్తించారు. ఇందులో ప్రభుత్వ భూమితోపాటు వ్యవసాయ భూమి ఉంది. ఖానాపూర్, అనుకుంట, కచ్కంటి, తంతోలి గ్రామాల శివార్లలో ఈ భూమి ఉంది. ఎయిర్ స్ట్రిఫ్ నిర్మాణంలో కోల్పోయే భూముల్లో ప్రభుత్వ భూమి కంటే వ్యవసాయ భూమే అధికంగా ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఖానాపూర్ శివారులోని 50.20 ఎకరాల ప్రభుత్వ భూమి, అనుకుంట గ్రామ శివారులో 34.04 ఎకరాలు, తంతోలి గ్రామ శివారులో 5.20 ఎకరాలు, ఖానాపూర్ గ్రామ శివారులో 431.36 ఎకరాల వ్యవసాయ భూమి, అనుకుంట గ్రామ శివారులో 501.34 ఎకరాలు, కచ్కంటి గ్రామ శివారులో 313.24 ఎకరాల భూమిని అధికారులు అవసరమని గుర్తించారు. దీంతోపాటు తంతోలి గ్రామ శివారులో 256.07 ఎకరాల భూమిని గుర్తించారు. ఆందోళనలో శివారు ప్రజలు ఆదిలాబాద్ పట్టణ శివారు ప్రాంతంలో ఎయిర్ స్ట్రిఫ్ నిర్మాణం విషయమై ప్రజల్లో ఆనందం కన్పిస్తున్నా.. నిర్మాణంలో వ్యవసాయ భూములు కోల్పోవడంతో శివారు గ్రామాల ప్రజలు ఆందోళనలో పడుతున్నారు. నిర్మాణానికి 1,600 ఎకరాలు అవసరం కావడంతో పంట భూములు కోల్పోవాల్సి వస్తుంది. తంతోలి, అనుకుంట, కచ్కంటి గ్రామాల శివారుల్లో సుమారు 1200 ఎకరాల భూమి సాగులో ఉంది. అయితే ఏర్పాటుకు గుర్తించినంత మాత్రం భూమి కోల్పోయినట్లు కాదని, ఏర్పాటుకు ఏ భూమి అవసరమో అదే ఇవ్వ డం జరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. అధికారులను కలిసిన కచ్కంటి గ్రామస్తులు ఈ కేంద్రం నిర్మాణంతో ఏఏ భూములను సేకరిస్తారో స్పష్టత ఇవ్వాలని ఆదిలాబాద్ మండలంలోని కచ్కంటి గ్రామస్తులు బుధవారం ఆదిలాబాద్ ఆర్డీవో సుధాకర్‌రెడ్డిని కలిశారు. ఇంత వరకు ఏ రెవెన్యూ అధికారి కూ డా సంప్రదించ లేదని, తక్షణమే అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి గ్రామస్తులలో ఉన్న అపోహలను తొలగించాలని ఆర్డీవోను కోరారు. గురువారం కలెక్టర్ ను కలువడానికి రాగా, ఆయన లేకపోవడంతో డీఆర్వో ప్రసాదరావుకు కలిసి వినతిపత్రం అందించారు. ఇదిలాఉండగా, హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్ ఫోర్స్‌కు చెందిన అధికారులు ఈ వారంలో వచ్చి విమానాశ్రయ స్థల పరిశీలన చేయనున్నారు. స్థల పరిశీలన, బెక్ మార్కింగ్, రూట్ మ్యాప్, సదుపాయాల కల్పన, తదితర విషయాలను తెలుసుకోనున్నారని 22న మన జిల్లా అధికారులకు సమాచారం అందింది. -
సహచరులపై రక్షణ శాఖ కానిస్టేబుల్ కాల్పులు
ఇద్దరి మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు ముంబై: సహోద్యోగుల వేధింపుల వల్ల తీవ్రంగా విసిగిపోయిన ముంబైలోని డిఫెన్స్ సెక్యూరిటీ కోర్కు చెందిన ఓ కానిస్టేబుల్ మంగళవారం సహచరులపై కాల్పులు జరిపాడు. దీంతో ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే మరణించగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ముంబై శివార్లలోని శాంతాక్రజ్ వద్ద గల ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో తెల్లవారుజామున 1:30 గంటలకు ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కాల్పులకు పాల్పడిన అనంతరం ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి బయటపడి గోరెగావ్ ప్రాంతంలో ఆటో ఎక్కి పారిపోవడానికి ప్రయత్ని నిందితుడు ఆర్‌హెచ్ యాదవ్(49)ను అరెస్టు చేసినట్లు తెలిపారు. కాల్పుల్లో హెచ్‌కే సింగ్(52), సోమ్‌దత్(53) అనే ఇద్దరు చనిపోగా, సీబీ థాపా, భీంసింగ్ అనే మరో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. యాదవ్‌ను హేళన చేస్తూ సహ చర ఉద్యోగులు తరచూ వేధింపులకు గురి చేసేవారని, అతడికి పగటిపూట విధులు కేటాయించాల్సి ఉన్నా రాత్రి విధులు అప్పగించారని పోలీసులు తెలిపారు.