ఇద్దరి మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
ముంబై: సహోద్యోగుల వేధింపుల వల్ల తీవ్రంగా విసిగిపోయిన ముంబైలోని డిఫెన్స్ సెక్యూరిటీ కోర్‌కు చెందిన ఓ కానిస్టేబుల్ మంగళవారం సహచరులపై కాల్పులు జరిపాడు. దీంతో ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే మరణించగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ముంబై శివార్లలోని శాంతాక్రజ్ వద్ద గల ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో తెల్లవారుజామున 1:30 గంటలకు ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కాల్పులకు పాల్పడిన అనంతరం ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి బయటపడి గోరెగావ్ ప్రాంతంలో ఆటో ఎక్కి పారిపోవడానికి ప్రయత్ని నిందితుడు ఆర్‌హెచ్ యాదవ్(49)ను అరెస్టు చేసినట్లు తెలిపారు. కాల్పుల్లో హెచ్‌కే సింగ్(52), సోమ్‌దత్(53) అనే ఇద్దరు చనిపోగా, సీబీ థాపా, భీంసింగ్ అనే మరో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. యాదవ్‌ను హేళన చేస్తూ సహ చర ఉద్యోగులు తరచూ వేధింపులకు గురి చేసేవారని, అతడికి పగటిపూట విధులు కేటాయించాల్సి ఉన్నా రాత్రి విధులు అప్పగించారని పోలీసులు తెలిపారు.
సహచరులపై రక్షణ శాఖ కానిస్టేబుల్ కాల్పులు
Published Wed, May 28 2014 3:18 AM | Last Updated on Sat, Sep 2 2017 7:56 AM
Advertisement
Advertisement