గగనతలంలో పల్టీలు కొడుతూ, ఆకాశంలో అద్భుతాలను ఆవిష్కరించే లోహ విహంగాల విన్యాసాలను వీక్షించేందుకు జనసాగరమే తరలివచ్చింది. బెంగళూరులోని యలహంక ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో జరుగుతున్న ‘ఏరో ఇండియా-2015’ ప్రదర్శనలో విమానాల విన్యాసాల చూసేందుకు గురువారం పెద్ద ఎత్తున్న ప్రజలు తరలివచ్చారు. ఉదయం 10 గంటల నుంచి లోహ విహంగాల విన్యాసాలు ప్రారంభమయ్యాయి.
ప్రదర్శనను తిలకించేందుకు వేలాదిగా సందర్శకులు తరలిరావడంతో యలహంక ప్రాంతంలో గురువారం ఉదయం నుంచే ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. కాగా భద్రతా కారణాల దృష్ట్యా ముందుగానే టికెట్‌లను బుక్ చేసుకున్న వారిని అన్ని విధాలైన ధ్రువీకరణ పత్రాలు పరిశీలించిన తర్వాత మాత్రమే అధికారులు ప్రదర్శనకు అనుమతిస్తున్నారు. ఏరో ఇండియా-2015 ప్రదర్శన ఈ నెల 22వరకు కొనసాగనున్న విషయం తెలిసిందే.
సాక్షి, బెంగళూరు
తరలివచ్చిన జనం
Published Fri, Feb 20 2015 1:52 AM | Last Updated on Tue, Oct 2 2018 8:04 PM
Advertisement
Advertisement