హైదరాబాద్: చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండింగ్ విజయవంతమైంది. శాస్త్రవేత్తల అంచనా మేరకే చంద్రుడి ఉపరితలం వైపు ల్యాండర్ ప్రయాణించింది. చంద్రుడిపైకి విక్రమ్ ల్యాండర్ చేరుకుంది. ఒకవైపు ఇస్రో సైంటిస్టులతో పాటు యావత్ భారత్ క్షణక్షణం ఉత్కంఠంగా ఎదురు చూసి.. ల్యాండింగ్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోంది.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గత నెల 14న ప్రయోగించిన చంద్రయా న్–3 మిషన్ ప్లానింగ్ షెడ్యూల్ ప్రకారం దశలవారీగా చంద్రుడి కక్ష్యలోకి తీసుకెళ్లే ఆపరేషన్‌ను విజయవంతంగా చేపట్టారు. చంద్రయాన్–3 మిషన్ భూమధ్యంతర కక్ష్యలో ఉన్నప్పుడు ఐసారు, లూనార్ ఆర్బిట్లోకి చేరుకున్న తర్వాత మరో ఐసా ర్లు ఆర్బిట్ రైజింగ్ కార్యక్రమాన్ని బెంగళూరులోని మిషన్ ఆపరేటర్ కాంఫ్లెక్స్ (ఎంఓఎక్స్), ఇస్రో టెలీమేట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్(ఇస్ట్రాక్), బైలాలులో ఉన్న ఇండియన్ డీప్ స్పేస్ నెట్‌వర్క్ (ఐడీఎస్‌ఎన్) భూనియంత్రతి కేంద్రాల నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా నిర్వహించారు.
ల్యాండర్, రోవర్ మాడ్యూల్‌ను తీసుకెళుతున్న ప్రపొల్షన్ మాడ్యూల్ మొత్తం బరువు 2,145 కిలోలు. ప్రపొల్షన్ మాడ్యూల్‌ను భూ మధ్యంతర కక్ష్య నుంచి చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి 1,696 కేజీల ఇంధనాన్ని నింపారు. మిగిలిన 449 కేజీలు పేలోడ్ ఇనుస్ట్రుమెంట్స్ ఉన్నాయి.
ఈ ప్రపొల్షన్ మాడ్యూల్‌కు అనుసంధానం చేసిన ల్యాండర్, అందులో ఉన్న రోవర్‌ను చంద్రుడి మీదకు విజయవంతంగా తీసుకెళ్లి వదిలిపెట్టింది. అప్పటికి రెండు ఘట్టాలను పూర్తిచేశారు. ప్రస్తుతం మిగిలిన మూడో ఘట్టం కూడా పూర్తి అయింది. బుధవారం సాయంత్రం 5.44 గంటలకు ప్రారంభించి 6.04 గంటలకు ల్యాండర్ మాడ్యూల్‌ను చంద్రుడి ఉపరితలంపైన దించారు.
దశలవారీగా చూస్తే..
► జులై 14 మధ్యాహ్నం 2.35 గంటలకు చంద్రయాన్–3 ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించారు.
► మొదటిగా చంద్రయాన్–3 మిషన్ భూమికి దగ్గరగా అంటే పెరిజీ 175 కిలోమీటర్లు, భూమికి దూరంగా అపోజి 36,500 కిలోమీటర్లు దూరంలోని భూ మధ్యంతర కక్ష్య (జియో ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్)లోకి ప్రవేశపెట్టారు.
► చంద్రయాన్–3 మిషన్ కక్ష్యలోకి ప్రవేశించగానే బెంగళూరులోని ఇస్ట్రాక్ కేంద్రం (ఉపగ్రహాల నియంత్రిత భూకేంద్రం) శాస్త్రవేత్తలు స్వాధీనం చేసుకున్నారు.
► గత నెల 15న మొదటి ఆర్బిట్ రైజింగ్ (కక్ష్య దూరం పెంపుదల) మొదటి విడతలో భూమికి దగ్గరగా 173 కిలోమీటర్లు ఎత్తుకు, భూమికి దూ రంగా 41,762 కిలోమీటర్లు ఎత్తుకు పెంచారు.
► 17న రెండోసారి భూమికి దగ్గరగా 173 కిలోమీ టర్ల ఎత్తును 223 కిలోమీటర్లుకు, భూమికి దూరంగా 41,762 కిలోమీటర్లు ఎత్తును 42,000 కిలోమీటర్ల దూరానికి పెంచారు.
► 18న మూడో విడతలో 224 కిలోమీటర్లు, దూ రంగా 51,568 కిలోమీటర్లు ఎత్తుకు పెంచారు.
► 22న నాలుగో విడతలో భూమికి దగ్గరగా 233, దూరంగా 71,351 కిలోమీటర్ల ఎత్తుకు పెంచారు.
► 25న ఐదోసారి భూమికి దగ్గరగా 236, భూమికి దూరంగా 1,27,609 కిలోమీటర్లు ఎత్తుకు పెంచారు. 25 నుంచి ఆగస్టు 1 అర్ధరాత్రి దాకా చంద్రయాన్–3 మిషన్ భూమధ్యంతర కక్ష్యలో పరిభ్రమించింది.
► ఈనెల 1న అర్ధరాత్రి చంద్రయాన్–3 మిషన్‌నుపెరిజీలోకి అంటే భూమికి దగ్గరగా వచ్చిన సమయంలో లూనార్ ట్రాన్స్ ఇంజెక్షన్ అనే అపరేషన్‌తో భూమధ్యంతర కక్ష్య నుంచి చంద్రుడి కక్ష్య వైపునకు మళ్లించారు.
►5న భూ మధ్యంతర కక్ష్య నుంచి 3,69,328 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించి లూనార్ ఆర్బిట్ (చంద్రుని కక్ష్య)లో 18074 ఎత్తుకు చేరింది.
► 6న ప్రపొల్షన్ మాడ్యూల్ లూనార్ ఆర్బిట్‌లో మొదటి సారిగా కక్ష్య దూరాన్ని తగించే ప్రక్రియను ప్రారంభించి 4,313 కిలోమీటర్లకు తగ్గించారు.
►9న రెండో సారి కక్ష్య దూరాన్ని తగ్గించి 1437 కిలోమీటర్లు చంద్రుడికి దగ్గరగా తీసుకొచ్చారు.
► 14ప మూడోసారి 179 కిలోమీటర్లకు తగ్గించారు.
► 16న నాలుగోసారి 163 కిలోమీటర్లకు తగ్గించారు.
► 17న చంద్రయాన్–3ని 127 కిలోమీటర్ల ఎత్తులో ప్రపొల్షన్ మాడ్యూల్ ల్యాండర్ మాడ్యూల్‌ను విజయవంతంగా విడిచిపెట్టింది.
► 18న ల్యాండర్ మాడ్యూల్‌లో ఉన్న కొద్దిపాటి ఇంధనాన్ని మండించి చంద్రుడికి చేరువగా అంటే 157 కిలోమీటర్లు దగ్గరగా వెళ్లింది.
► 20న అంటే ఆదివారం ల్యాండర్ మాడ్యూల్ చంద్రుడికి మరింత చేరువగా 134 కిలోమీటర్లకు చేరుకుంది.
► 23 బుధవారం సాయంత్రం 5.27 గంటలకు ల్యాండర్ మాడ్యూల్‌లో ఇంధనాన్ని 37 నిమిషాలపాటు మండించారు.
► షెడ్యూల్ ప్రకారం కంటే ముందే 5.44 నిమిషాలకు ల్యాండింగ్ ప్రక్రియను ప్రారంభించారు.
► ఉత్కంఠభరితమై 17 నిమిషాల టెర్రర్ టైంలో ఇస్రో శాస్త్రవేత్తలు జాగ్రత్తగా ల్యాండర్‌ని కిందికి దించారు.
► 6.04 నిమిషాలకు విక్రమ్ ల్యాండర్.. విజయవంతగా చంద్రుని దక్షిణ ధృవంపై కిందికి దిగింది. అంతరిక్ష రంగంలో భారత్ చరిత్రను సృష్టించింది.
ఇదీ చదవండి: శెభాష్ విక్రమ్.. చంద్రయాన్-3 ల్యాండింగ్ సక్సెస్.. చరిత్ర సృష్టించిన భారత్
Comments
Please login to add a commentAdd a comment