చంద్రయాన్‌ 3 ల్యాండింగ్‌ కోసం..ప్రజల్లో వెల్లువెత్తుతున్న ఉత్కంఠ! | Chandrayaan 3 Landing Amid Prayers Across India, World And Social Media Reactions Goes Viral - Sakshi
Sakshi News home page

చంద్రయాన్‌ 3 ల్యాండింగ్‌ కోసం..ప్రజల్లో వెల్లువెత్తుతున్న ఉత్కంఠ! వీడియో వైరల్‌

Published Wed, Aug 23 2023 1:52 PM | Last Updated on Wed, Aug 23 2023 4:20 PM

Chandrayaan 3 Landing Amid Prayers Across India And Social Media - Sakshi

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఈ నెల 17న చంద్రయాన్‌ -3 ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ ల్యాండర్‌ మాడ్యూల్‌ను చంద్రుడికి దగ్గరగా విజయవంతంగా వదిలిపెట్టింది. చంద్రయాన్‌ 3లో ఇప్పటి వరకు ప్రతి ఆపరేషన్‌ విజయవంతమయ్యింది. ఇక ప్రతిష్టాత్మక చంద్రయాన్‌–3 మిషన్‌లో భాగమైన ల్యాండర్‌ మాడ్యూల్‌ తన తుది గమ్యాన్నినేడు చేరుకోనుంది. ఈ ప్రయోగంలో అత్యంత కీలకమైన తుదిఘట్టం బుధవారం జరగనుంది. చంద్రుడి దక్షిణధ్రువ ఉపరితలంపై ల్యాండర్‌ మాడ్యూల్‌ అడుగు పెట్టనుంది. బుధవారం సాయంత్రం 5.27 గంటలకు ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

సరిగ్గా 6.04 గంటలకు జాబిల్లి ఉపరితలంపై ల్యాండర్‌ను సురక్షితంగా ల్యాండ్‌ చేయడానికి ఇస్రో సైంటిస్టులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ అపూర్య ఘట్టాన్ని సాయంత్రం 5.20 నుంచే ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించొచ్చు. ల్యాండర్‌ మాడ్యుల్‌ చంద్రుని వీక్షించే క్షణం కోసం దేశంలోని ప్రజలు తోపాటు ప్రపంచ దేశాలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి. దాయాది దేశం పాక్‌తో సహా ప్రపంచ దేశాలు భారత్‌ ఉక్కు సంకల్పానికి నివ్వెరపోయాయి.  ప్రపంచ అగ్ర దేశాలకు కూడా సాధ్యం కాని అరుదైన ఘనతను భారత్‌ సాధిస్తుండటంతో అందరీ దృష్టి ఇండియాలోని ఈ మిషన్‌ ఘట్టంపైనే  ఉండటం విశేషం.

సర్వత్రా ఈ విషయం ఓ హాట్‌టాపిక్‌గా మారింది. ప్రజలైతే చంద్రయాన్‌-3 మిషన్‌ విజయవంతం కావాలంటూ పూజలు చేస్తున్నారు. ఈ మిషన్‌ విజయవంతమైతే చారిత్రాత్మక విజయాన్ని అందుకున్న దేశంగా చంద్రుడిపై అడుగుపెట్టిన దేశాలైన యునైటెడ్‌ స్టేట్స్‌, రష్యా, చైనా వంటి దేశాల సరసన ఇండియా నిలుస్తుంది. భారత్‌ వెలుపల ఉన్న  ప్రజలే గాక సోషల్‌ మీడియా వేదికగా నెటిజన్లు సైతం "జయహో భారత్‌ జయహో ఇస్రో" అంటూ ఈ చంద్రయాన్‌-3 మిషన్‌ విజయవంతం కావాలంటూ పూజలు, హోమాలు చేస్తున్నారు. పెద్ద చిన్న తేడా లేకుండా భారత ఇస్రోకి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కుల మత పర భేదాలు పక్కన పెట్టి అందరూ ఒకేతాటిపై భారత ఇస్రో దిగ్విజయంగా విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ రకరకాలుగా వీడియోలు ట్వీట్‌ చేశారు. మీరు కూడా ఓ లుక్కేయండి. 

(చదవండి: ఇవాళే 'నేషనల్‌ హ్యాండ్‌ సర్జరీ డే'!వర్క్‌ప్లేస్‌లో చేతులకు వచ్చే సమస్యలు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement