
సాక్షి, హైదరాబాద్: గాల్లోకి ఎగిరే పక్షిని చూసే రైట్ బ్రదర్స్‌కి మనం కూడా గాల్లో ఎగరాలనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన కదా అనంత దూరాలకు సైతం క్షణాల్లో రెక్కలు కట్టుకుని ఎగిరిపోయేలా చేసింది. ఓర్విల్లే రైట్, విల్బర్ రైట్ సోదరులు అభివృద్ధి చేసిన విమానం ప్రపంచ విమానయాన రంగానికి పునాదులు వేసింది. రైట్ బ్రదర్స్ కృషికి గుర్తింపుగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 17న రైట్ బ్రదర్స్ డేను నిర్వహించుకుంటాం.
తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లుకొడుతోంది. ఈ నెలలోనే రానున్న రైట్‌బ్రదర్స్ డే తరుణంలో యాదృచ్చికంగా ఎరిక్ సోలేం అనే యూజర్ షేర్ చేసిన వీడియో అద్భుతంగా నిలుస్తోంది. విమాన ప్రయాణానికి బాటలు వేసిన పక్షి అత్యంత సురక్షితంగా, అద్భుతంగా నీటిలోకి ల్యాండ్ అయిన తీరు విశేషం. దీంతో అద్భుతమంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. మరింకెందుకు ఆలస్యం మీరు కూడా ఒక లుక్కేసుకోండి. విమానం నుంచి ల్యాండ్ అయిన గొప్ప అనుభూతిని సొంతం చేసుకోండి.
Awesome!
— Erik Solheim (@ErikSolheim) December 4, 2021
Look at this elegance and flight control! 🥰
pic.twitter.com/X9WsrrulUZ