Wright Brothers
-
వావ్! అద్భుతహ! ఇది కదా ల్యాండింగ్ అంటే
సాక్షి, హైదరాబాద్: గాల్లోకి ఎగిరే పక్షిని చూసే రైట్ బ్రదర్స్‌కి మనం కూడా గాల్లో ఎగరాలనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన కదా అనంత దూరాలకు సైతం క్షణాల్లో రెక్కలు కట్టుకుని ఎగిరిపోయేలా చేసింది. ఓర్విల్లే రైట్, విల్బర్ రైట్ సోదరులు అభివృద్ధి చేసిన విమానం ప్రపంచ విమానయాన రంగానికి పునాదులు వేసింది. రైట్ బ్రదర్స్ కృషికి గుర్తింపుగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 17న రైట్ బ్రదర్స్ డేను నిర్వహించుకుంటాం. తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లుకొడుతోంది. ఈ నెలలోనే రానున్న రైట్‌బ్రదర్స్ డే తరుణంలో యాదృచ్చికంగా ఎరిక్ సోలేం అనే యూజర్ షేర్ చేసిన వీడియో అద్భుతంగా నిలుస్తోంది. విమాన ప్రయాణానికి బాటలు వేసిన పక్షి అత్యంత సురక్షితంగా, అద్భుతంగా నీటిలోకి ల్యాండ్ అయిన తీరు విశేషం. దీంతో అద్భుతమంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. మరింకెందుకు ఆలస్యం మీరు కూడా ఒక లుక్కేసుకోండి. విమానం నుంచి ల్యాండ్ అయిన గొప్ప అనుభూతిని సొంతం చేసుకోండి. Awesome! Look at this elegance and flight control! 🥰 pic.twitter.com/X9WsrrulUZ — Erik Solheim (@ErikSolheim) December 4, 2021 -
‘పాస్వర్డ్’ కోసమే కురుక్షేత్ర యుద్ధం
సాక్షి, న్యూఢిల్లీ : తెలుగునాట అత్యంత ప్రజాదరణ పొందిన ‘మాయాబజార్’ సినిమాలోని ‘ప్రియదర్శిని’ సన్నివేశం మనందరికి గుర్తుండే ఉంటుంది. అందులో శ్రీకష్ణుడు పెట్టెలాంటి ఓ ప్రియదర్శినిని తీసుకొచ్చి శశిరేఖకు కానుకగా ఇస్తాడు. ఆ పెట్టె తెరచి మూతను చూస్తే దానికో అద్దం ఉంటుంది. దానిముందు నిలబడి ఆ అద్దంలోకి ఎవరు చూస్తే వారికి తమకు ప్రియమైన వస్తువులు లేదా వ్యక్తులు కనిపిస్తారు. అందుకే దాన్ని ప్రియదర్శిని అన్నారు. లేకపోతే మాయాదర్పనం అనేవారు. ఆ ప్రియదర్శిని అద్దంలాంటి స్క్రీన్‌ను చూస్తే శశిరేఖ పాత్రధారి సావిత్రికి, తాను ప్రేమించిన అభిమన్యుడు, అంటే నాగేశ్వరరావు కనిపిస్తారు. బాలరాముడి భార్య రేవతి పాత్రధారి ఛాయాదేవీ ఆ ప్రియదర్శినిలోకి చూస్తే నగలు కనిపిస్తాయి. మరొకరు చూస్తే జరగబోయే కీడు కనిపిస్తుంది. వారు ఇంకా అలాగే చూస్తున్నట్లయితే త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేవ్ మంగళవారం అగర్తలో ప్రాచీన మహాభారతానికి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ముడిపెడుతూ చేసిన ప్రసంగం కనిపించేది. పాండవులు, కౌరవుల మధ్య జరిగిన యుద్ధం విశేషాలను ఎప్పటికప్పుడు కళ్లు కనిపించని ధృతరాష్ట్రుడికి ఆయన సలహాదారు సంజయ ఈ ప్రియదర్శిని లాంటి వీడియోలోకి చూస్తూ చెప్పారని బిప్లబ్ కుమార్ తెలిపారు. ‘అంటే, ఈ సాంకేతిక పరిజ్ఞానం అప్పటికే ఉంది. ఇంటర్నెట్ ఉంది. శాటిలైట్ ఉంది’ అని ఆయన వివరించారు. 950 సంవత్సరాల క్రీస్తు పూర్వం నుంచి 3,102 సంవత్సరాల క్రీస్తుపూర్వం మధ్యకాలంలో సంభవించిన ట్లు భావిస్తున్న మహాభారత కాలంలోనే ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న ఇంటర్నెట్, వైఫై టెక్నాలజీ ఉందన్నమాట. మహాభారతానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి ముడిపెట్టడం కొత్త విషయమేమీ కాదు. ఎప్పటి నుంచో జరుగుతున్నదే. విమానాన్ని రైట్స్ సోదరులు కనిపెట్టడానికి వేల సంవత్సరాల క్రితమే మహాభారత కాలంలో పుష్పక విమానం ఉందని, ఆ విమానాన్ని కాపీ కొట్టే రైట్ సోదరులు ఆధునిక విమానాన్ని కనిపెట్టారని పిడి వాదులు వాదించారు. పుష్పక విమానం ఊహకుగానీ, నిజమైన విమానం ఊహకుగానీ మూలం ఒక్కటే పక్షులని ఎవరైనా ఊహించగలరు. ఇంక రైట్ సోదరులు కనిపెట్టిన విమానం లోహ రెక్కలు పక్షి రెక్కలకు కాస్త భిన్నంగా ఉంటాయి. మహాభారతంలో పేర్కొన్న పుష్పక విమానం రెక్కలు, పక్షి రెక్కలు కత్తిరించి అతికించినట్లు ఉంటాయి. పుష్పక విమానానికి దివ్య శక్తులు మినహా ఇంజన్ ఉన్నట్లు ఏ పుస్తకంలోనూ లేదు. అలాంటప్పుడు పుష్పక విమానానికి మన లోహ విమానానికి పోలిక ఎక్కడ? మన సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీయే 2014లో ఓ ఎన్నికల సభలో మాట్లాడుతూ ప్రాచీన భారత దేశంలోనే ప్లాస్టిక్ సర్జరీ టెక్నాలజీ ఉందని, అందుకు ఉదాహరణే గణేశుడని చెప్పారు. అప్పుడు ఆయన మాటలకు సోషల్ మీడియా ఎలా స్పందించిందోగానీ, ఇప్పుడు బిప్లబ్ కుమార్ వ్యాఖ్యలకు సోషల్ మీడియా, ముఖ్యంగా ట్విట్టర్లో ట్వీట్లు టపాసుల్లా పేలుతున్నాయి. ‘సింహాసనం ఎక్కిన బాబర్ విద్యుత్ చార్జీలు చెల్లించడానికి నిరాకరించడంతో దేశంలో ఇంటర్నెట్ను కట్ చేశారు... పాండవులు తమ వైఫై పాస్‌వర్డ్‌ను కౌరవులతో షేర్ చేసుకొని ఉంటే కురుక్షేత్ర యుద్ధమే జరిగేది కాదు.... వాస్తవానికి కౌరవులు తమ వైఫై పాస్‌వర్డ్‌ను పాండవులతో షేరు చేసుకోక పోవడం వల్లనే మహాభారత యుద్ధం వచ్చింది. మొదట పాండవులు జియో కనెక్షన్ అడిగారు. అందుకు కౌరవులు తిరస్కరించారు. ఆ తర్వాత బీఎస్ఎన్ఎల్ 3జీ కనెక్షన్ గురించి అడిగారు. దానికి కౌరవులు తిరస్కరించారు.... మహాభారత్ సమయంలో ఫేస్బుక్ కూడా ఉంది. మన మార్క్ జుకర్‌బర్గ్ పూర్వికుడైన మార్కాండేయ చక్రవర్తి ‘ముఖ్ పుస్తక్’ను నడిపారు. అదే కాలక్రమంలో ఫేస్‌బుక్‌గా మారింది.... ద్రోణాచార్యుడు, ఏకలవ్యుడిని తన శిశ్యుడిగా చేసుకునేందుకు ఆయన ఆధార్ కార్డు అడిగాడు. ఇంటర్నెట్ స్లోగా ఉండడంతో అది ఆయన బొటన వేలు ముద్రను రిసీవ్ చేసుకోలేదు. దాంతో ఏకలవ్యుడు తన బొటన వేలును గురువుకు కోసిచ్చి తీరక ఉన్నప్పుడు చూసుకోమని చెప్పి వచ్చాడు.... రామాయణం సమయంలో కూడా ఇంటర్నెట్ ఉండి ఉంటే ఎంత బాగుండును! సంజీవిని కోసం హన్మంతుడికి పర్వతాన్ని పెకిలించుకొని తెచ్చే పని తప్పేది. ఎంచక్కా, గూగుల్ మ్యాప్‌లో సంజీవిని గుర్తించి తెచ్చేవాడు..... ఇలా ఎవరికి వారు తమదైన శైలిలో నవ్యులు పూయించారు. రాజకీయ నేతల్లో కూడా బిప్లబ్ కుమార్ లాంటి హాస్యప్రియులు ఉండబట్టి దేశంలో ఇంకా హాస్యం బతికి ఉన్నట్లుంది. -
విమానాలు విశేషాలు
పురాణాల్లోని పుష్పక విమానం గురించిన కథలు చాలా శతాబ్దాలుగానే ప్రచారంలో ఉన్నాయి. శతాబ్దం కిందటి వరకు ఆ కథలు విన్న వాళ్లెవరూ ఆకాశంలో నిజంగా ఎగిరే విమానాన్ని చూసి ఎరుగరు. అమెరికాకు చెందిన రైట్ సోదరులు 1905 నాటికి పూర్తిస్థాయిలో మనుషుల రవాణాకు పనికొచ్చే తొలి విమానానికి రూపకల్పన చేసి, విజయవంతంగా దాన్ని ఆకాశంలో నడిపించగలిగారు. అప్పట్లో వారు తయారు చేసిన విమానం చాలా నెమ్మదిగా ఎగిరేది. ఇప్పుడైతే విమానాలు ధ్వని వేగాన్ని మించిన వేగంతో ప్రయాణించగలుగుతున్నాయి గానీ, రైట్ బ్రదర్స్ రూపొందించిన విమానం గరిష్ట వేగం గంటకు 48 కిలోమీటర్లు మాత్రమే. రైట్ బ్రదర్స్ విమానం కనుగొన్న పదేళ్లకు గానీ విమానయానం ప్రయాణికులకు అందుబాటులోకి రాలేదు. అమెరికాకు చెందిన ఎలియట్ ఎయిర్ సర్వీస్ 1915లో మొట్టమొదటిసారిగా పౌర విమానయానాన్ని అందుబాటులోకి తెచ్చింది. విమానయానం దేశ దేశాలకు పాకడంతో 1944లో అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఐసీఏఓ) ఏర్పడింది. ఐసీఏఓకు 1994లో యాభయ్యేళ్లు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 7వ తేదీని అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవంగా (ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ డే) ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం సందర్భంగా విమానయానం గురించి కొన్ని ఆసక్తికరమైన సంగతులు... మన దేశంలో జేఆర్డీ టాటా ఆద్యుడు మనదేశంలో పౌర విమానయానానికి జేఆర్డీ టాటా ఆద్యుడు. పారిశ్రామికవేత్త అయినప్పటికీ స్వయంగా పైలట్ అయిన టాటా దృష్టి విమానయానంపైనే ఉండేది. ఆయన 1932లో ప్రారంభించిన టాటా ఎయిర్‌లైన్స్ ప్రయాణికుల రవాణాతో పాటు తపాలా బట్వాడా సేవలనూ అందించేది. ప్రారంభమైన తొలి ఏడాదిలోనే టాటా ఎయిర్‌లైన్స్ విమానాలు 1.60 లక్షల మైళ్లు ప్రయాణించాయి. 155 మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యానికి చేర్చాయి. 10 టన్నుల తపాలాను బట్వాడా చేశాయి. టాటా ఎయిర్‌లైన్స్ తొలినాళ్లలో తన విమానాలను భారత భూభాగం పరిధిలోనే నడిపేది. విమానయాన సేవలను అంతర్జాతీయ స్థాయికి విస్తరించేందుకు 1946లో టాటా ఎయిర్‌లైన్స్‌ను ‘ఎయిర్ ఇండియా’గా మార్చారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం ఎయిర్ ఇండియాలోని 49 శాతం పెట్టుబడులను స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత జేఆర్డీ టాటా సలహాపై భారత ప్రభుత్వం డొమెస్టిక్ విమానాలు నడిపేందుకు ‘ఇండియన్ ఎయిర్‌లైన్స్’ ప్రారంభించింది. అప్పటి నుంచి ‘ఎయిర్ ఇండియా’ పూర్తిగా అంతర్జాతీయ విమానయాన సేవలు ప్రారంభించింది. విమానయానంలో వేగమే వేదం విమానయానానికి వేగమే వేదంగా మారింది మాత్రం జెట్ విమానాలు అందుబాటులోకి వచ్చిన తర్వాతే. తొలిసారిగా 1964లో ‘లియర్‌జెట్’ విమానాలు ప్రయాణాలు అందుబాటులోకి వచ్చాయి. వీటి గరిష్ట వేగం గంటకు 900 కిలోమీటర్లకు పైనే. ‘లియర్‌జెట్’ విమానాలు అందుబాటులోకి వచ్చిన దశాబ్దం గడవక ముందే బోయింగ్ విమానాలు మరింత వేగంతో రంగంలోకి దిగాయి. వీటి గరిష్ట వేగం గంటకు దాదాపు 990 కిలోమీటర్లు. ఇవి అందుబాటులోకి వచ్చిన తర్వాత దూరాల భారం గణనీయంగా తగ్గి ప్రయాణాలు సులభతరమయ్యాయి.