skid
-
1,968 అడుగుల ఎత్తు నుంచి పడ్డా ఏమీ కాలేదు
వెల్లింగ్టన్: భూమి మీద నూకలు ఉండాలేగానీ ఆకాశం నుంచి పడ్డా నిక్షేపంగా ఉంటారనడానికి ప్రబల నిదర్శనమీ ఘటన. ఆశ్చర్యపరిచే ఈ ఘటన న్యూజిలాండ్‌లోని పర్వతసానువుల్లో శనివారం జరిగింది. నార్త్ ఐలాండ్‌లోని టరనకీ పర్వతంపైకి అధిరోహించేందుకు శనివారం పర్వతారోహకుల బృందం బయలుదేరింది. మధ్యాహ్నం సమయంలో 1,968 అడుగుల మేర ఎక్కాక ఓ పర్వతా రోహకుడు అనూహ్యంగా జారి పడిపోయాడు. అయితే, అతడికి స్వల్పంగానే గాయాలయ్యాయి. అక్కడి వాతావరణ పరిస్థితుల ప్రభావంతో అతడు పడిన చోట మంచు మెత్తగా మారడమే ఇందుకు కారణమని అధికారులు తెలిపారు. అతడు ప్రాణా లతో ఉండటం అద్భుతమైన విషయమని, అతడు చాలా అదృష్టవంతుడని పోలీసులు అంటున్నారు. న్యూజిలాండ్‌లోని అత్యంత ప్రమాదకరమైన పర్వతాల్లో టరనాకీ ఒకటిగా పేర్కొంటారు. ఇదే ప్రాంతం నుంచి 2021లో ఇద్దరు పర్వతారోహకులు జారిపడి మృతి చెందారు. నార్త్ ఐలాండ్‌లోనే నిద్రాణ అగ్నిపర్వతం కూడా ఉంది. ఇతర పర్వతాల నుంచి వేరుపడినట్లుగా దూరంగా ఉండటం, తీరానికి సమీపంలో ఉండటం, వేగంగా వాతావరణ పరిస్థితుల్లో మార్పులు సంభవించడం వంటి పరిస్థితులు న్యూజిలాండ్‌లో టరనాకీ వద్దతప్ప మరెక్కడా లేవని మౌంటెన్ సేఫ్టీ కౌన్సిల్ పేర్కొంది. -
క్రిప్టో ఇన్వెస్టర్లకు టోకరా ఇచ్చిన స్కిడ్ టోకెన్ డెవలపర్లు
-
మహిళను కాపాడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్
సికింద్రాబాద్: కదులుతున్న రైలు నుంచి కిందపడబోయిన మహిళను ఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ సైఫుద్దీన్ అప్రమత్తతకు మెచ్చిన ఉన్నతాధికారులు శనివారం అభినందించారు. ఈ నెల 18న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి దానాపూర్ ఎక్స్‌ప్రెస్ రైలు కదులుతుండగా అందులోంచి ఒక మహిళ దిగేందుకు ప్రయత్నించింది. రైలులో తమ బంధువులను ఎక్కించి తిరిగి సదరు మహిళ దిగే క్రమంలో రైలు వేగం పుంజుకుంది. ఫుట్‌పాత్ మీద కాలువేయబోయిన మహిళ బోగీ నుంచి జారి బోగీ, ప్లాట్‌ఫామ్ మధ్యన పడబోయింది. అదే ప్లాట్‌ఫామ్‌పై విధులు నిర్వహిస్తున్న ఆర్పీఎఫ్ హెడ్‌కానిస్టేబుల్ మహిళ జారిపడుతున్న బోగీ వద్దకు పరుగున వెళ్లి ఆమెను పట్టుకుని ప్లాట్‌ఫామ్ మీదకు లాక్కొచ్చాడు. దీంతో రైలుబోగీ, ప్లాట్‌ఫామ్ అంచున నలిగిపోవాల్సిన మహిళ సురక్షితంగా బయటపడింది. సీసీ పుటేజీల ద్వారా సైఫుద్దీన్ అప్రమత్తతను గుర్తించిన అధికా రులు అతన్ని అభినందించారు. -
బోరుబావిలోనే బాలుడు
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో బోరు బావిలో పడ్డ మూడేళ్ల బాలుడు సుజిత్‌ను రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 72 గంటలుగా బోరుబావిలోనే ఉన్న బాలుడు.. ప్రస్తుతం 100 అడుగుల లోతులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. బోరుబావికి సమాంతరంగా మరో గుంత తవ్వేందుకు ఆదివారం నుంచి ప్రయత్నిస్తుండగా.. తాజాగా ఇందుకోసం జర్మన్ నుంచి తెచ్చిన అత్యాధునిక హెవీ డ్రిల్లింగ్ మెషీన్‌ను ఉపయోగిస్తున్నట్లు రెవెన్యూ విభాగంకమిషనర్ రాధాకృష్ణన్ తెలిపారు. కెమెరాల ద్వారా పరిశీలించినప్పుడు బాలుడిపై కొంత మట్టి పడినట్లు ఉందని మరో ఉన్నతాధికారి తెలిపారు. తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లా మనప్పారై సమీపం నాడుకాట్టుపట్టికి చెందిన ప్రిట్లో ఆరోగ్యరాజ్ (40), కళామేరీ (35) దంపతుల కుమారుడు సుజిత్ శుక్రవారం సాయంత్రం ఆడుకుంటూ చిన్నారి బోరుబావిలో పడిన విషయం తెలిసిందే. ‘సుజిత్‌ను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. బాలుడు క్షేమంగా బయటకు రావాలని ప్రార్థిస్తున్నాను. సహాయక చర్యలపై సీఎంతో మాట్లాడాను’అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు. -
బైక్‌పై నుంచి కిందపడ్డ స్పీకర్ మధుసూదనాచారి
-
కల్వర్టులో జారిపడ్డ మంత్రి హరీశ్
ఖమ్మం(వేముసూరు): తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వచ్చిన భారీనీటిపారుదుల శాఖా మంత్రి హరీశ్ రావు ప్రమాదవశాత్తూ కాలుజారి కల్వర్టులో పడ్డారు. ఈ సంఘటన వేముసూరు మండలం కల్లూరుగూడెం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో హరీశ్ రావుకు చిన్నపాటి గాయాలయ్యాయి. వెంటనే తేరుకున్న అధికారులు హరీశ్ రావుకు ప్రాథమిక చికిత్స చేయించారు. -
లారీ కింద పడి వ్యక్తి మృతి
నల్లగొండ టౌన్: బైక్‌పై వెళ్తుండగా అదుపుతప్పి లారీ కిందపడి వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం నల్లగొండ పట్టణంలోని రామగిరిలో జరిగింది. వివరాలు.. రామగిరిలో వ్యాపారం చేసే చంద్రయ్య బైక్‌పై వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ముందుటైర్ స్కిడ్ అవ్వడంతో కిందపడ్డాడు. అయితే, అదే సమయంలో అటు నుంచి వస్తున్న లారీ వెనుక టైర్ల కింద పడటంతో నుజ్జునుజ్జయ్యాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.