సెల్‌ఫోన్ల దొంగ అరెస్ట్‌ | cell phones thief arrest | Sakshi
Sakshi News home page

సెల్‌ఫోన్ల దొంగ అరెస్ట్‌

Published Wed, Feb 28 2018 11:48 AM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

cell phones thief arrest - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

చేర్యాల(సిద్దిపేట): సెల్‌ఫోన్ల  దొంగను మంగళవారం చేర్యాల పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ జలగం లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ మంగళవారం బస్టాండ్‌ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కర్నూల్‌ జిల్లా డోన్‌ మండలం శ్రీరాంనగర్‌ కాలనీకి చెందిన పూసల చిన్న అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు.

అతడిని విచారించగా ఈ నెల 20న చేర్యాల మార్కెట్‌లో  రెండు సెల్‌ఫోన్లు, 26న ఆకునూరు సంతలో రూ.60 వేల విలువైన 8 సెల్‌ఫోన్లు చోరీ చేసినట్లు అంగీకరించాడని తెలిపారు. అతడి వద్ద 10సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement