'నాతో సెల్ ఫోన్ లేదు' | I don not even have a cell phone, says Kanhaiah kumar | Sakshi
Sakshi News home page

'నాతో సెల్ ఫోన్ లేదు'

Published Sun, May 1 2016 7:44 PM | Last Updated on Sun, Sep 3 2017 11:12 PM

'నాతో సెల్ ఫోన్ లేదు'

'నాతో సెల్ ఫోన్ లేదు'

పట్నా: తనతో  సెల్ ఫోన్ లేదని, ఆ స్థోమత కూడా లేదని జేఎన్యూ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ తెలిపాడు. కన్హయ్యతో ఐఫోన్ ఉందని, పీఆర్వో కూడా ఉన్నాడని అతడి వ్యవహారాలు ఆయన చూసుకుంటాడని వార్తలు ప్రచారం అవుతున్న నేపథ్యంలో కన్హయ్య స్పందించాడు. తనకు సెల్ ఫోన్ ఉందని, పీఆర్వోతో వ్యవహారాలు డీలింగ్ చేస్తుంటాడని కొందరు వ్యక్తులు తనమీద కావాలనే ఆరోపణలు చేస్తున్నారని చెప్పాడు.

రాజద్రోహం కేసులో ఆరోపణలతో అరెస్టయిన తర్వాత ఇంటికి రావడం ఇదే మొదటిసారని కన్హయ్య చెప్పాడు. తనకు గతేడాది జూలై నుంచి స్కాలర్ ఫిప్ రావడం లేదని, విమానంలో ప్రయాణించడానికి కొనే టిక్కెట్ డబ్బులు కూడా లేవన్నాడు. అందుకే జరిమానా కట్టలేనని చెప్పానని వివరించాడు. తన బ్యాంకు ఖాతాలో కేవలం రూ.200 మాత్రమే ఉన్నాయని వెల్లడించాడు. కొందరు నిర్వాహకులు తనకు మనీ ఇస్తే ఈ విధంగా ఇంటికి రాగలిగాలని చెప్పుకొచ్చాడు. వారి నిరసనకు మద్ధతు తెలిపేందుకు తనను ఇక్కడికి ఆహ్వానింవచారని తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement