'కన్హయ్యను కాలేజీలో అడుగుపెట్టనివ్వం'
విజయవాడ: సిద్ధార్థ అకాడమీ ఎదుట విద్యార్థులు ఆందోళనకు దిగారు. జేఎన్యూ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ కు వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేస్తున్నారు. కన్హయ్య సభకు మొదట పర్మిషన్ ఎందుకు ఇచ్చారని సిద్ధార్థ అకాడమీ ఇంఛార్జ్ రమేష్ పై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి చర్యలను కాలేజీ ప్రతిష్టను మంటగలుపుతున్నారని విద్యార్థులు మండిపడుతున్నారు.
జాతి వ్యతిరేక శక్తును కాలేజీలో అడుగుపెట్టనివ్వమని ఆ కాలేజీ విద్యార్థులు చెబుతున్నారు. ఐవీ ప్యాలెస్ లో జరగనున్న సదస్సుకు కన్హయ్య హాజరుకానున్న నేపథ్యంలో అక్కడ విద్యార్థులు తమ అందోళనను ఉధృతం చేశారు.