Siddhartha Academy
-
‘సిద్ధార్థ’కు వెయ్యి కోట్ల సంతర్పణ
-
‘సిద్ధార్థ’కు వెయ్యి కోట్ల సంతర్పణ
రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం సాక్షి, అమరావతి: విజయవాడ నగరం నడిబొడ్డున కనకదుర్గ అమ్మవారి దేవస్థానానికి చెందిన రూ.1,000 కోట్ల విలువైన భూములను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధార్థ అకాడమీకి కారుచౌకగా కట్టబెట్టింది. గజం రూ.లక్షన్నర దాకా పలికే అత్యంత విలువైన భూమిని ఎకరా రూ.లక్షన్నర చొప్పున 33 ఏళ్లపాటు లీజుకివ్వాలని రాష్ట్ర మంత్రివర్గం మంగళవారం నిర్ణరుుంచింది. ఈ వ్యవహారం వెనుక రూ.కోట్లలో సొమ్ము చేతులు మారినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నారుు. దుర్గ గుడి భూముల లీజు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ జోక్యం చేసుకున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నారుు. గుట్టుచప్పుడు కాకుండా అప్పగింత శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వారి భూములను ప్రైవేట్ విద్యా సంస్థకు అప్పగించేందుకు లోపారుుకారీగా జరుగుతున్న ప్రయత్నాలను 15 రోజుల క్రితం ‘సాక్షి’ సవివరంగా ప్రజల ముందుంచింది. ఆలయం భూములను తమకు శాశ్వతంగా అప్పగిస్తే అందుకు బదులుగా నగరం వెలుపల అంతే విస్తీర్ణంలో భూములను ప్రభుత్వానికి ఇస్తామంటూ సిద్ధార్థ అకాడమీ చేసుకున్న దరఖాస్తు శరవేగంగా కదిలింది. ఈ భూముల అప్పగింత వ్యవహారంపై అక్టోబరు 31న మంత్రివర్గ సమావేశంలోనే చర్చించి, తుది నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ విషయాన్ని అదే నెల 30వ తేదీన ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చింది. దీంతో ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని తాత్కాలికంగా వారుుదా వేసింది. పెద్ద నోట్ల రద్దుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. రూ.వెరుు్య కోట్ల విలువైన దుర్గ గుడి భూములను ప్రైవేట్ విద్యాసంస్థకు కారుచౌకగా కట్టబెడుతూ గుట్టుచప్పుడు కాకుండా మంగళవారం కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంది. ఈవో నివేదిక బుట్టదాఖలు సిద్ధార్థ అకాడమీకి ప్రయోజనం చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు దుర్గ గుడి కార్యనిర్వహణాధికారి(ఈవో), ఐఏఎస్ అధికారి సూర్యకుమారి అందజేసిన నివేదికను కూడా పక్కనపెట్టేశారు. గతంలో దేవాదాయ భూములను విద్యా సంస్థలకు 50 ఏళ్ల పాటు లీజుకివ్వడాన్ని విజిలెన్స శాఖ తప్పుపట్టింది. దీంతో 2006లో అప్పటి ప్రభుత్వం దుర్గ గుడి భూముల లీజులను రద్దు చేసింది. అ నిర్ణయాన్ని హైకోర్టు కూడా సమర్థించింది. సిద్దార్థ అకాడమీ పదేళ్లగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయపోరాటం చేస్తోంది. ఆ భూములకు బదులుగా నగరం వెలుపల అంతే భూమిని గుడి పేరిట రాసిస్తామని, లేదంటే ఎకరాకు ఏడాదికి రూ.1.25 లక్షల చొప్పున లీజు చెల్లిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. ఈ రెండు ప్రతిపాదలను తోసిపుచ్చుతూ ఆలయ ఈవో సూర్యకుమారి ప్రభుత్వానికి ఒక నివేదిక అందజేశారు. నగరం నడిబొడ్డున బెంజిసర్కిల్‌కు దగ్గరగా వాణిజ్య సముదాయాలు, ఇళ్ల మధ్య ఉన్న 14.20 ఎకరాల దుర్గ గుడి భూముల విలువ రిజిస్ట్రేషన్ శాఖ నిర్ణరుుంచిన ధరల ప్రకారం రూ.716 కోట్లు ఉంటుందని నివేదికలో పేర్కొన్నారు. దేవాదాయ భూముల లీజు వ్యవహారంపై ప్రభుత్వం 2013లో జారీ చేసిన జీవో ఎంఎస్ నంబరు 571 ప్రకారం... ఈ భూములను వ్యవసాయేతర అవసరాలకు లీజుకిచ్చేటప్పుడు భూమి మార్కెట్ ధరలో పది శాతాన్ని లీజు మొత్తంగా నిర్ణరుుంచాలన్న నిబంధనను ఈవో తన నివేదికలో ప్రస్తావించారు. అక్కడ ఎకరం విలువ రూ.70 కోట్లు దుర్గ గుడికి చెందిన 14.20 ఎకరాలకు ని బంధనల ప్రకారం రూ.71.66 కోట్లు లీజు మొత్తంగా నిర్ణరుుంచాల్సి ఉంటుందని, 2010లో రూ.కోటి లీజును డిమాండ్ చేస్తూ సుప్రీంకోర్టులో అఫడవిట్ దాఖలు చేసిన ట్లు ఈవో ప్రభుత్వానికి పంపిన నివేదికలో పేర్కొన్నారు. సిద్దార్ధ అకాడమీ ప్రభుత్వా నికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటీషన్‌ను ఉపసంహరించుకుంటేనే తిరిగి ఆ సంస్థతో చర్చలకు జరపడానికి ఈవో సుముఖత తెలిపారు. ఈ నివేదికలో ఈవో పేర్కొన్న అన్ని అంశాలను ప్రభు త్వం లెక్కచేయలేదు. సిద్ధార్థ అకాడమీ యజమాన్యం కోరినట్లే నామ మాత్రపు లీజుకు ఆ భూములను కట్టబెట్టేందుకు ఆమోదం తెలిపింది. ఎకరాకు రూ.1.25 లక్షల చొప్పున లీజు చెల్లిస్తామని సిద్ధార్థ అకాడమీ ప్రతిపాదించగా... ఎకరానికి రూ.1.50 లక్షల చొప్పున లీజు ధర నిర్ణరుు స్తూ 33 ఏళ్ల పాటు ఆ భూములను అప్ప గించడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఈ భూములకు మార్కెట్లో ఎకరా రూ.70 కోట్లు ధర పలుకుతోంది. -
దుర్గమ్మ భూములకు ‘సిద్ధార్థ’ ఎసరు!
-
దుర్గమ్మ భూములకు ‘సిద్ధార్థ’ ఎసరు!
రూ.వెయ్యి కోట్ల భూముల కైంకర్యం.. నేడు కేబినెట్ తీర్మానం ► ప్రైవేట్ యాజమాన్యానికి 14.20 ఎకరాల అప్పగింత యత్నం ► రేపు మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై చర్చ ► ప్రస్తుతం అక్కడ సిద్ధార్థ విద్యా సంస్థల నిర్వహణ ► పదేళ్లుగా దేవాదాయ శాఖ, సిద్ధార్థ మధ్య వివాదం ► హైకోర్టులో దేవాదాయశాఖకు అనుకూల నిర్ణయం ► ప్రైవేట్‌కు అనుకూలంగా సర్కారు నిర్ణయం? ► రూ.కోట్లలో చేతులు మారిన సొమ్ము సాక్షి, అమరావతి: విజయవాడ నడిబొడ్డున కనకదుర్గ అమ్మవారి దేవస్థానానికి చెందిన రూ.1,000 కోట్ల విలువైన భూమికి రాష్ట్ర ప్రభుత్వం ఎసరు పెట్టబోతోంది. బెంజి సర్కిల్ సమీపంలో ఉన్న 14.20 ఎకరాల దుర్గ గుడి భూములను ప్రైవేట్‌పరం చేయడంపై కసరత్తు జరుగుతోంది. రెండు చోట్ల ఉన్న ఆ భూముల్లో ప్రస్తుతం సిద్ధార్థ అకాడమీ ఆధ్వర్యంలో విద్యా సంస్థలు కొనసాగుతున్నాయి. ఇక్కడ మార్కెట్ ధర ప్రకారం ఎకరం విలువ రూ.70 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ భూముల వ్యవహారంలో దేవాదాయ శాఖ, సిద్ధార్థ అకాడమీ యాజమాన్యాల మధ్య కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. తాము విద్యా సంస్థలు నిర్వహిస్తున్న భూములకు బదులుగా నగరం వెలుపల అంతే విస్తీర్ణంలో భూములు కొని, దుర్గగుడి పేరిట రాసిస్తామని సిద్ధార్థ యాజమాన్యం తాజాగా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. సోమవారం జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించి, తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. అసలేం జరిగిందంటే... విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయం పేరిట గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 225.74 ఎకరాల భూములున్నాయి. విజయవాడలోని పటమటలో సర్వే నంబరు 17లో ఉన్న 5.98 ఎకరాలను 50 ఏళ్లపాటు సిద్ధార్థ అకాడమీకి లీజుకిస్తూ 1973 డిసెంబర్ 6న అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ భూమిలో శ్రీదుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా జూనియర్ కళాశాలను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1980లో అదే సిద్ధార్థ అకాడమీకి మొగల్రాజపురంలో సర్వే నంబరు 76లో 8.22 ఎకరాల దుర్గ గుడి భూమిని కూడా 50 ఏళ్లపాటు లీజుకిస్తూ అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందులో పీబీ సిద్ధార్థ జూనియర్ కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అకాడమీని నెలకొల్పారు. ఎకరాకు రూ.5 వేల చొప్పున ఆయా భూములను అప్పటి ప్రభుత్వం సిద్ధార్థ అకాడమీకి లీజుకిచ్చింది. పదేళ్లకోసారి లీజు పెంచాలని నిబంధన విధించారు. ప్రభుత్వం వద్దకు రెండు ప్రతిపాదనలు భూముల లీజును రద్దు చేస్తూ 2006లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సమయానికి సిద్ధార్థ అకాడమీ ఎకరాకు రూ.9 వేల చొప్పున దుర్గ గుడికి చెల్లిస్తూ ఉండేది. ప్రభుత్వం అధికారికంగా భూముల లీజును రద్దు చేయడంతో గత పదేళ్లుగా సిద్ధార్థ అకాడమీ నుంచి లీజు మొతాన్ని జమ చేసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో సిద్ధార్థ అకాడమీ ఈ ఏడాది జూలై 4న రెండు రకాల ప్రతిపాదనలు చేస్తూ ప్రభుత్వానికి ఒక దరఖాస్తు సమర్పించింది. తమ అధీనంలో ఉన్న భూములకు ఎకరాకు ఏడాదికి రూ.1.25 లక్షల చొప్పున లీజు చెల్లింపునకు అనుమతించాలని, లేదంటే ఆ భూమికి బదులుగా నగరం వెలుపల వేరే ప్రాంతంలో దుర్గగుడికి అంతే విస్తీర్ణంలో భూములు కొనుగోలు చేసి, ఇచ్చేందుకు అనుమతించాలని కోరింది. ఇదే సమయంలో దేవాదాయ శాఖ, సిద్ధార్థ అకాడమీ మధ్య ఉన్న వివాదాన్ని 8 వారాల్లో సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునే లా సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు వెలువరించినట్లు అధికార వర్గాలు చెప్పాయి. నవంబర్ 16వ తేదీ నాటికి 8 వారాల గడువు ముగియనున్న నేపథ్యంలో కోర్టు మధ్యంతర ఉత్తర్వులను అడ్డం పెట్టుకొని ప్రభుత్వం సిద్ధార్థ అకాడమీకి భూములను అప్పగించడానికి సన్నద్ధమవుతున్నట్లు తెలిసింది. లీజు పెంపునకైతే మంత్రివర్గానికి అక్కరలేదు లీజు పెంపు ప్రతిపాదనలకైతే నిబంధనల ప్రకారం అధికారుల స్థాయిలోనే నిర్ణయం తీసుకోవచ్చు. సంబంధిత శాఖ మంత్రి అనుమతితో లీజు పెంపు నిర్ణయం వెలువరించవచ్చు. కానీ, మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించి, నిర్ణయం తీసుకోవాలన్న ప్రభుత్వ యోచనపై దేవాదాయ శాఖలో కొత్త చర్చ మొదలైంది. భూమికి బదులు భూమి ఇస్తామంటూ సిద్ధార్థ అకాడమీ చేసిన ప్రతిపాదనకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వ పెద్దలు ఈ అంశాన్ని మంత్రివర్గ సమావేశంలో చర్చకు పెడుతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో సిద్ధార్థ అకాడమీకి అనుకూలంగా నిర్ణయం వెలువడడానికి ఇప్పటికే రూ.కోట్లు చేతులు మారాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దుర్గగుడి భూములపై ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ జోక్యం చేసుకుంటున్నట్లు దేవాదాయ శాఖలో చర్చ సాగుతోంది. 50 ఏళ్ల లీజును తప్పుపట్టిన విజిలెన్స్ దుర్గ గుడి భూములను 50 ఏళ్లపాటు లీజుకివ్వడాన్ని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ విభాగం 2000లో తీవ్రంగా తప్పుపట్టింది. దీనివల్ల దుర్గ గుడికి అప్పటి అంచనాల ప్రకారం రూ.7.42 కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొంది. లీజు నియమ నిబంధనలను పున:పరిశీలించాలంటూ డెరైక్టర్ జనరల్ ఆఫ్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ విభాగాధిపతి 2001లో రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ ప్రక్రియలో భాగంగా 2006లో అప్పటి ప్రభుత్వం పాత లీజులను రద్దు చే సి, కొత్త లీజుపై నిర్ణయానికి సిద్ధార్థ అకాడమీని చర్చలకు ఆహ్వానించిందని దేవాదాయ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే, ప్రభుత్వం తమ లీజును రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై సిద్ధార్థ అకాడమీ న్యాయ పోరాటానికి సిద్ధమైంది. దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ కోర్టులోనూ ప్రభుత్వం లీజును రద్దు చేయడాన్ని సమర్థించగా, ఆ తర్వాత హైకోర్టు సైతం డిప్యూటీ కమిషనర్ కోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తూ తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పుపై 2010లో సిద్ధార్థ అకాడమీ సుప్రీంకోర్టును అశ్రయించింది. 2010లో హైకోర్టు తీర్పు వెలువరించిన తర్వాత అప్పటి దేవాదాయ శాఖ మంత్రి గాదె వెంకటరెడ్డి దుర్గగుడి భూములకు లీజు పెంపుపై సిద్ధార్థ అకాడమీ యాజమాన్యంతో చర్చలు జరిపినా, అవి సఫలం కాలేదని దేవాదాయ శాఖ వర్గాలు తెలిపాయి. -
'కన్హయ్యను కాలేజీలో అడుగుపెట్టనివ్వం'
విజయవాడ: సిద్ధార్థ అకాడమీ ఎదుట విద్యార్థులు ఆందోళనకు దిగారు. జేఎన్‌యూ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ కు వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేస్తున్నారు. కన్హయ్య సభకు మొదట పర్మిషన్ ఎందుకు ఇచ్చారని సిద్ధార్థ అకాడమీ ఇంఛార్జ్ రమేష్ పై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి చర్యలను కాలేజీ ప్రతిష్టను మంటగలుపుతున్నారని విద్యార్థులు మండిపడుతున్నారు. జాతి వ్యతిరేక శక్తును కాలేజీలో అడుగుపెట్టనివ్వమని ఆ కాలేజీ విద్యార్థులు చెబుతున్నారు. ఐవీ ప్యాలెస్ లో జరగనున్న సదస్సుకు కన్హయ్య హాజరుకానున్న నేపథ్యంలో అక్కడ విద్యార్థులు తమ అందోళనను ఉధృతం చేశారు. -
సిద్ధార్థ యాజమాన్యం దిగివచ్చేనా!
సుప్రీంకోర్టులో దుర్గగుడి ఈవో పిటిషన్ దాఖలు పిటిషన్ దాఖలులో ప్రభుత్వం తాత్సారం కాగితాలకే పరిమితమైన లీజుల పెంపు ప్రతిపాదన విజయవాడ : సిద్ధార్థ అకాడమీ ఆధీనంలో ఉన్న దుర్గగుడి దేవస్థానం భూములను తిరిగి స్వాధీనం చేసుకునే విషయం మూడు అడుగులు ముందుకు... ఆరు అడుగులు వెనక్కు అన్న చందంగా సాగుతోంది. ఎండోమెంట్ డెప్యూటీ కమిషనర్ కోర్టు నుంచి హైకోర్టు వరకు దేవస్థానమే గెలిచినప్పటికీ సిద్ధార్థ యాజమాన్యం ఆ భూములను వదల కుండా సుప్రీం కోర్టుకు వెళ్లింది. ప్రస్తుతం సుప్రీం కోర్టులో ఉన్న ఈ కేసును ఒక కొలిక్కి తీసుకువచ్చి దుర్గగుడికి చెందిన భూములను దేవస్థానానికి ఇప్పించడంతో ఉన్నతాధికారులు, ప్రభుత్వం చిత్తశుద్ధి చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలా జరిగింది.... శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానానికి చెందిన 8.22 ఎకరాల స్థలంలో సిద్ధార్థ మహిళా కళాశాల, 5.98 ఎకరాల స్థలంలో సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఉన్నాయి. ఈ రెండుస్థలాలను సిద్ధార్థ సంస్థలకు 50 ఏళ్లకు లీజుకు ఇస్తూ గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను 2006లో ప్రభుత్వమే రద్దు చేసింది. అయినప్పటికీ ఆ స్థలాలను ఖాళీ చేయకపోవడంతో దేవస్థానం అధికారులు ఎండోమెంట్ డెప్యూటీ కమిషనర్ కోర్టుకెళ్లారు. అక్కడ దేవస్థానానికి అనుకూలంగా రావడంతో సిద్ధార్థ విద్యాసంస్థల యాజమాన్యం హైకోర్టుకు వెళ్లింది. అక్కడా చుక్కెదురు కావడంతో 2013 ఆగస్టులో సుప్రీంకోర్టుకు వెళ్లగా ‘యథాతథ స్థితి’ కొనసాగించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. కమిషనర్, ప్రభుత్వం తాత్సారం.... దుర్గగుడి దేవస్థానంతోపాటు దేవాదాయశాఖ కమిషనర్, రాష్ట్ర ప్రభుత్వం కూడా దుర్గగుడి భూములపై స్టే ఎత్తివేయాలని, దేవస్థానానికి భూములు ఇప్పించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంది. అయితే పిటిషన్ దాఖల చేసేందకు ఈవోకు అనుమతి మంజూరులోనే దేవాదాశాఖ కమిషనర్ కార్యాలయం తీవ్ర తాత్సారం చేసింది. ఈ కేసులో ప్రభుత్వం, దేవాదాయశాఖ కమిషనర్లు ఎప్పుడు పిటిషన్లు దాఖలుచేస్తారో ఆ కనకదుర్గమ్మకే తెలియాలి. వేగవంతంగా ఫైల్స్ కదిపి సుప్రీం కోర్టులో తమ వాదన వినిపిస్తే సాధ్యమైన త్వరగా భూములు స్వాధీనం చేసుకునే అవకాశ ఉంటుంది. అయితే ప్రభుత్వం ఈ విషయంలో కావాలనే తాత్సారం చేస్తోందని భక్తులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. అద్దెలు పెంచడం పై భేదాభిప్రాయాలు సిద్ధార్థ సంస్థల ఆధీనంలో ఉన్న భూముల అద్దె ధరలు చాలా తక్కువగా ఉన్నాయని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుత ఇక్కడ ఉన్న అద్దెల ధరలకు యాజమాన్యం చెల్లిస్తున్న అద్దెల రేట్లకు ఎంతో వ్యత్యాసం ఉంది. సిద్ధార్థ యాజమాన్యం అద్దెలకు తీసుకునేడప్పుడు ఎకరాకి రూ.5 వేల చొప్పున అద్దె చెల్లించేలా, ఆ తరువాత ప్రతి ఏడాది రూ.500 పెంచాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న మార్కెట్ రేటు ప్రకారం తమ భూములకు అద్దె చెల్లించాలని దేవస్థానం డిమాండ్ చేస్తోంది. అయితే ఆ స్థాయిలో అద్దెలు పెంచితే తమకు భారం అవుతుందని సిద్ధార్థ యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం. సిద్ధార్థ యాజమాన్యం ఆధ్వర్యంలోని భూముల లీజు పెంచేందుకు ప్రభుత్వం గతంలో ఒక కమిటీని వేయాలని భావించింది. రెండు వర్గాలతో సంప్రదించి లీజు ఖరారు చేసి విభేదాలు లేకుండా చేయాలనే ప్రతిపాదన కేవలం ఆలోచనలకే పరిమితమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దేవస్థానం వాదన ఇదీ... సుప్రీంకోర్టులో ఇచ్చిన స్టే ఉత్తర్వులను తొల గించి, గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం తమకు భూమి అప్పగించాలని కోరుతూ తాజాగా దుర్గగుడి ఈవో సీహెచ్ నర్సింగరావు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. దుర్గగుడికి చెందిన ఆస్తిపై పూర్తి హక్కులు దేవస్థానానికే ఉంటాయని, సెక్షన్ 15 ప్రకారం దేవస్థానం భూములను లీజుకు ఇచ్చే అధికారం ప్రభుత్వానికి లేదని దేవస్థానం న్యాయవాదులు గతంలో హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆ వాదనను హైకోర్టు అంగీకరించింది. ఆ వాదన ప్రకారం భూములను సిద్ధార్థ యాజమాన్యం నుంచి ఇప్పిం చాలని ఈవో పిటిషన్ దాఖలుచేశారు. -
కథ మారింది..!
దుర్గగుడి భూములకు అద్దె పెంచేందుకు సిద్ధార్థ యాజమాన్యం అంగీకారం లీజు పొడిగించేందుకు ప్రభుత్వం సుముఖం త్వరలోనే సమస్య పరిష్కారం.. విజయవాడ : సిద్ధార్థ అకాడమీ ఆధీనంలో ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం భూముల వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ వ్యవహారం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉండటంతో ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు అకాడమీ యాజమాన్యం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ప్రభుత్వం కూడా ఇటు దేవస్థానానికి, అటు సిద్ధార్థ యాజమాన్యానికి ఇబ్బంది లేని విధంగా సమస్యను పరిష్కరించాలని భావిస్తున్నట్లు సమాచారం. శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానానికి చెందిన 8.22 ఎకరాల స్థలంలో సిద్ధార్థ మహిళా కళాశాల, 5.98 ఎకరాల స్థలంలో సిద్ధార్థ అర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో కొంత భాగం ఉన్నాయి. ఈ రెండు స్థలాలను సిద్ధార్థ సంస్థలకు 50 ఏళ్లు లీజుకు ఇచ్చిన ఉత్తర్వులను 2006లో అప్పటి ప్రభుత్వం రద్దు చేసింది. అయినప్పటికీ ఆ స్థలాలను ఖాళీ చేయకపోవడంతో దేవస్థానం అధికారులు ఎండోమెంట్ డెప్యూటీ కమిషనర్ కోర్టును ఆశ్రయించారు. అక్కడ దేవస్థానానికి అనుకూలంగా తీర్పు రావడంతో సిద్ధార్థ విద్యాసంస్థల యాజమాన్యం హైకోర్టుకు వెళ్లింది. అక్కడ కూడా వారికి చుక్కెదురు కావడంతో 2013 ఆగస్టులో సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీంతో సుప్రీంకోర్టు ‘యథాతథ స్థితి’ని కొనసాగించాలని ఉత్తర్వులు జారీచేసింది. దీనిపై దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం పిటీషన్ దాఖలు చేయగా, ప్రభుత్వం తన వాదనలను వినిపిస్తూ పిటీషన్ దాఖలు చేయాల్సి ఉంది. కేసుల పరిష్కారం కోసం కమిటీ సిద్ధార్థ సంస్థల ఆధీనంలో ఉన్న భూములకు చెల్లిస్తున్న అద్దెలు చాలా తక్కువగా ఉన్నాయని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుత ఇక్కడ ఉన్న అద్దెలకు, సిద్ధార్థ యాజ మాన్యం చెల్లిస్తున్న మొత్తానికి చాలా వ్యత్యాసం ఉంది. సిద్ధార్థ యాజమాన్యం స్థలాన్ని అద్దెకు తీసుకునే సమయంలో ఏడాదికి ఎకరాకు రూ.5వేలు చొప్పున చెల్లిస్తామని, ఆ తర్వాత ప్రతి ఏడాది రూ.500 చొప్పున పెంచేలా ఒప్పందం చేసుకున్నారు. అయితే, లీజును రద్దు చేయడం, కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉండటంతో అద్దె వసూలు చేయడం లేదని దేవస్థాన అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో సిద్ధార్థ యాజమాన్యం భూముల అద్దెలను పెంచేందుకు ముందుకువచ్చినట్లు తెలిసింది. దీంతో అద్దెలను పెంచి తిరిగి ఆ విద్యాసంస్థల లీజును కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాలరావు ‘సాక్షి’కి తెలిపారు. ఇటీవల ఆయన నగరానికి వచ్చినప్పుడు ఆక్రమణల చెరలో ఉన్న దేవాలయాల భూముల గురించి ప్రస్తావించగా.. న్యాయస్థానాల్లో కేసులు నడుస్తున్న భూముల సమస్యలను పరిష్కరించేందుకు హైకోర్టు రిటైర్డ్ జడ్జిలు, లీగల్ సెక్రటరీలతో కమిటీలను ఏర్పాటుచేస్తామని చెప్పారు. ఈ కమిటీ దేవాలయాల ఆస్తుల కేసులను త్వరగా పరిష్కరించి స్వాధీనం చేసుకునేలా సూచనలు చేస్తుందని తెలిపారు. సిద్ధార్థ అకాడమీ ఆధీనంలో ఉన్న భూముల విషయంపై ప్రభుత్వం దృష్టి సారించిందని, అద్దె పెంచాలని భావిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. అయితే, ఎంత శాతం పెంచాలనే విషయంపై ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. దీనిపై కూడా ఒక కమిటీ వేస్తామని, ప్రస్తుతం అక్కడ ఉన్న భూముల అద్దెలను పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. త్వరలోనే ఈ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందన్నారు.