
సెల్‌ఫోన్ కొనివ్వలేదని అదృశ్యం
హైదరాబాద్: సెల్‌ఫోన్ కొనివ్వలేదని విద్యార్థి అదృశ్యమైన ఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేష న్ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ సైదులు కథనం ప్రకారం...ఓల్డ్ మల్కాజిగిరికి చెందిన రాజేందర్ సింగ్ సెక్యూరిటీ గార్డు.
అతని కొడుకు అమన్‌సింగ్ (12) 7వ తరగతి చదువుతున్నాడు. తండ్రిని పలుమార్లు సెల్‌ఫోన్ కొనివ్వమని అడిగినప్పటికీ ఆర్థిక ఇబ్బందులతో కొనివ్వలేదు. దీంతో ఈనెల 27న తండ్రితో గొడవపడిన అమన్‌సింగ్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కుమారుడి కోసం వెతికినా ఆచూకీ దొరక్కపోవడంతో తండ్రి శుక్రవారం మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది.