
చెన్నై, టీ.నగర్: సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ ఆదివారం ఓ యువతి మూడో అంతస్తు నుంచి కిందపడి మృతిచెందింది. చెన్నై ట్రిప్లికేన్ కెనాల్ రోడ్డుకు చెందిన 17 ఏళ్ల యువతి ప్రైవేటు ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేస్తోంది. ఈ నెల 25న రాత్రి ఇంటి మూడో అంతస్తులో తన స్నేహితురాలితో సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ కింద పడిపోయింది. తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అన్నాస్క్వేర్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇలావుండగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి ఆమె మృతిచెందింది.