సాక్షి, అమరావతి: మున్సిపల్ ఎన్నికల్లో వలంటీర్లు జోక్యం చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్ జారీ చేసిన ఆదేశాలను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ పూర్తయింది. తీర్పును హైకోర్టు ధర్మాసనం రిజర్వులో ఉంచింది.
కాగా, వలంటీర్ల సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకోవాలన్న ఎస్‌ఈసీ ఆదేశాలు ఏకపక్షంగా, రాజ్యాంగ విరుద్ధంగా, పంచాయతీరాజ్ చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని.. అందుకు వాటిని రద్దు చేయాలని సవాలు చేస్తూ గ్రామ వలంటీర్, వార్డు వలంటీర్, గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం శాఖ ముఖ్య కార్యదర్శి ఎం. అజయ్‌జైన్ సోమవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment