
అఖిలేష్ (ఫైల్)
సాక్షి,బంట్వారం(వికారాబాద్): ఫోన్ మాట్లాడడం తగ్గించమని తండ్రి మందలిచడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడే. ఈ సంఘటన బుధవారం కోట్‌పల్లి మండల కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. ధారూరు సీఐ తిరుపతిరాజు తెలిపిన ప్రకారం.. కోట్‌పల్లి గ్రామానికి చెందిన చాకలి అఖిలేష్ (20) జహీరాబాద్ మహీంద్రా కంపెనీలో అప్రెంటీస్ చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. ఫోన్ మాట్లాడే విషయంలో కుమారుడిని తండ్రి మందలించాడు.
చదవండి: జేపీ నేతల పెట్రోల్ దాడి.. ఇద్దరు వైఎస్సార్‌సీపీ కార్యకర్తల మృతి
దీంతో మనస్తాపం చెందిన అఖిలేష్ మంగళవారం ఇంట్లో నుంచి బైక్ పై వెళ్లిపోయి తిరిగి రాలేదు. ఆందోళన చెందిన కుటుంబీకులు బుధవారం కోట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు పెట్టారు. ఈ క్రమంలో పోలీసులు అఖిలేష్ బైక్‌ను నాగసమందర్ సమీపంలో కోట్‌పల్లి ప్రాజెక్టు తూము కాల్వ దగ్గర గుర్తించారు. బోటింగ్ నిర్వాహకుల సాయంతో అఖిలేష్ మృతదేహన్ని చెరువులో నుంచి బయటికి తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి అశోక్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తిరుపతిరాజు చెప్పారు.
చదవండి: ఎంపీటీసీ కూతురుతో మూడేళ్లుగా ప్రేమ, రహస్య పెళ్లి.. ఇంట్లో తెలియడంతో
Comments
Please login to add a commentAdd a comment