bantwaram police
-
ఫోన్ మాట్లాడడం తగ్గించమని తండ్రి మందలించడంతో యువకుడి ఆత్మహత్య
సాక్షి,బంట్వారం(వికారాబాద్): ఫోన్ మాట్లాడడం తగ్గించమని తండ్రి మందలిచడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడే. ఈ సంఘటన బుధవారం కోట్‌పల్లి మండల కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. ధారూరు సీఐ తిరుపతిరాజు తెలిపిన ప్రకారం.. కోట్‌పల్లి గ్రామానికి చెందిన చాకలి అఖిలేష్ (20) జహీరాబాద్ మహీంద్రా కంపెనీలో అప్రెంటీస్ చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. ఫోన్ మాట్లాడే విషయంలో కుమారుడిని తండ్రి మందలించాడు. చదవండి: జేపీ నేతల పెట్రోల్ దాడి.. ఇద్దరు వైఎస్సార్సీపీ కార్యకర్తల మృతి దీంతో మనస్తాపం చెందిన అఖిలేష్ మంగళవారం ఇంట్లో నుంచి బైక్ పై వెళ్లిపోయి తిరిగి రాలేదు. ఆందోళన చెందిన కుటుంబీకులు బుధవారం కోట్‌పల్లి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టారు. ఈ క్రమంలో పోలీసులు అఖిలేష్ బైక్‌ను నాగసమందర్ సమీపంలో కోట్‌పల్లి ప్రాజెక్టు తూము కాల్వ దగ్గర గుర్తించారు. బోటింగ్ నిర్వాహకుల సాయంతో అఖిలేష్ మృతదేహన్ని చెరువులో నుంచి బయటికి తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి అశోక్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తిరుపతిరాజు చెప్పారు. చదవండి: ఎంపీటీసీ కూతురుతో మూడేళ్లుగా ప్రేమ, రహస్య పెళ్లి.. ఇంట్లో తెలియడంతో -
అనుమానం; ఎలాగైన భార్యను చంపేయాలని పక్కా ప్లాన్‌తో!
సాక్షి, వికారాబాద్ : ఓ వ్యక్తి అనుమానంతో భార్యను కత్తితో కిరాతకంగా పొడిచి చంపేశాడు. ఈ సంఘటన శనివారం అర్ధరాత్రి బంట్వారం మండల పరిధిలోని మద్వాపూర్‌లో చోటుచేసుకుంది. ఎస్ఐ ప్రవీణ్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కె.ఆంజనేయులు, లక్ష్మి(40) దంపతులు. వీరు తమ ముగ్గురు పిల్లలతో కలిసి తాండూరులో ఉంటున్నారు. ఆంజనేయులు స్థానికంగా మున్సిపాలిటీలో కూలీగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. లక్ష్మి తరచూ పుట్టింటికి వెళ్తుండేది. ఈనేపథ్యంలో ఆమెకు వివాహేతర సంబంధం ఉందని అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఎలాగైనా భార్యను చంపేయాలని ఆంజనేయులు నిర్ణయించుకున్నాడు. ఈక్రమంలో లక్ష్మి కుటుంబ కలహాలతో వారంరోజుల క్రితం స్వగ్రామం మద్వాపూర్‌కు వెళ్లింది. ఆంజనేయులు పిల్లలను తాండూరులోనే వదిలేసి శనివారం సొంతూరుకు వెళ్లిపోయాడు. ఇంట్లో అర్ధరాత్రి సమయంలో లక్ష్మి నిద్రిస్తుండగా కమ్మ కత్తితో దారుణంగా పొడిచాడు. ఆమె కేకలు వేయడంతో స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. కొద్దిసేపటి తర్వాత లక్ష్మి చనిపోయింది. నిందితుడు ఆంజనేయులు ఆదివారం తెల్లవారుజామున బంట్వారం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. తన భార్యను కత్తితో పొడిచి హత్య చేసినట్లు పోలీసులకు తెలిపాడు. ధారూరు సీఐ తిరుపతిరాజు, ఎస్ఐ ప్రవీణ్‌రెడ్డి సిబ్బందితో కలిసి ఆదివారం ఉదయం మద్వాపూర్‌కు చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహానికి మర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. తల్లి హత్యకు గురవడం, తండ్రి జైలుకు వెళ్లడంతో లక్ష్మి పిల్లలు రేణుక, రాజు, నాగరాజు అనాథలయ్యారు. ఈమేరకు నిందితుడు ఆంజనేయులుపై హత్య కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్లు సీఐ తిరుపతిరాజు తెలిపారు. -
గొడ్డలితో నరికి.. పొలంలో పూడ్చి
బంట్వారం: వివాహేతర సంబంధంపై భార్యను పలుమార్లు మందలించినా మార్పులేకపోవడంతో భర్త ఆమెను గొడ్డలితో నరికి మృతదేహాన్ని పొలంలో పూడ్చిపెట్టాడు. కొన్ని రోజులు తప్పించుకుని తిరిగి శుక్రవారం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం బార్వాద్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బార్వాద్‌కు చెందిన ఆనందం అలియాస్ నందు బంట్వారం లక్ష్మి (30)ని పన్నెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం. లక్ష్మి కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తితో వివాహేతర సంబంధం నెరుపుతోంది. ఈ విషయమై ఆమెను భర్త మందలించినా మార్పు రాలేదు. ఈనెల 24న భార్యాభర్తలు కలిసి పొలం పనులకు వెళ్లారు. అక్కడ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆగ్రహానికి గురైన ఆనందం భార్య లక్ష్మిని గొడ్డలితో నరికి చంపాడు. రాత్రి పొలంలోనే గుంత తీసి మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. ఇంటికి వెళ్లిన అతడు పిల్లలను తీసుకుని బంధువుల వద్దకు వెళ్లాడు. అను మానంతో అతడిని బంధువులు ప్రశ్నించగా విషయం చెప్పాడు. వారి సూచన మేరకు ఆనందం ధారూరు సీఐ రాజశేఖర్ ఎదుట లొంగిపోయాడు. నిందితుడు చెప్పిన వివరాల మేరకు పొలంలో పాతి పెట్టిన మృతదేహాన్ని పోలీసులు వెలికితీసి డాక్టర్‌తో పోస్టుమార్టం చేయించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఏడుకొండలు తెలిపారు. -
12 మందిపై బైండోవర్
బంట్వారం: పాత నేరస్తులు 12 మందిని గురువారం తహశీల్దార్ మారుతీ ఎదుట బైండోవర్ చేసినట్లు ఎస్ఐ హన్మానాయక్ తెలిపారు. జిన్నారం, తొర్మామిడి గ్రామాలకు చెందిన వీరు గతంలో పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారని తెలిపారు. గ్రామాల్లో అల్లర్లు సృష్టించడం, బహిరంగ ప్రదేశాల్లో పేకాట ఆడటంవంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వీరందరిని హెచ్చరించి వదిలేశామని చెప్పారు. మండల పరిధిలోని పాత నేరస్తులందరిపై నిఘా పెట్టినట్లు ఎస్ఐ హన్మానాయక్ తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించేది లేదన్నారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని సూచించారు.