హైదరాబాద్‌లో ఐటీ దాడులు | Income Tax Department Raids Two Garment Shops And Mobile Phone Sales Companies | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ఐటీ దాడులు

Published Sat, Oct 15 2022 2:06 AM | Last Updated on Sat, Oct 15 2022 2:06 AM

Income Tax Department Raids Two Garment Shops And Mobile Phone Sales Companies - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/సనత్‌నగర్‌: రాష్ట్రంలో కేంద్ర దర్యాప్తు సంస్థల సోదాల పరంపర కొనసాగుతోంది. ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థలు వరుసగా రియల్‌ ఎస్టేట్‌ సంస్థలపైనా, ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులోనూ దాడులు జరుపు తూనే ఉన్నాయి. శుక్రవారం ఉదయం నుంచి రెండు వస్త్ర దుకాణాలతోపాటు సెల్‌ఫోన్‌ విక్రయ సంస్థలపైనా ఆదాయపు పన్ను శాఖ సోదాలు జరిపింది. ఐటీ అధికారులు డజ నుకు పైగా బృందాలుగా విడిపోయి ఏక కాలంలో సోదాలు చేశారు.

ఈసారి కేంద్ర బలగాల బలగాల పహారాలో దాడులు నిర్వ హించడం గమనార్హం. అమీర్‌పేట, కూకట్‌ పల్లి, దిల్‌సుక్‌నగర్‌తోపాటు పలు ప్రాంతాల్లో ఆర్‌ఎస్‌ బ్రదర్స్, సౌత్‌ఇండియా షాపింగ్‌మాల్స్‌పైనా.. ఈ సంస్థలకు అనుబంధంగా ఉన్న లాట్‌ మొబైల్స్, బిగ్‌ సీ దుకాణాలపైనా దాడులు చేశారు. ఈ సందర్భంగా పెద్దఎత్తున డాక్యుమెంట్స్, కంప్యూటర్‌ హార్డ్‌డిస్క్‌లు, బ్యాంకు లావాదేవీలకు సంబంధించి కీలక సమాచారాన్ని అధికారులు స్వాధీనం చేసు కున్నట్లు సమాచారం. ఉదయం నుంచి ఈ మాల్స్‌లోకి వినియోగదారులను రానీయకుండా సోదాలు నిర్వహించారు. 

హానర్‌లో పెట్టుబడులు పెట్టినందుకేనా...
ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ ఈమధ్య పెద్దఎత్తున రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టినట్లు ఐటీ శాఖ దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే దాడులకు దిగినట్లు తెలిసింది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో హానర్‌ రిచ్‌మండ్‌ పేరుతో చేపట్టిన భారీ ప్రాజెక్టులో ఈ వస్త్ర దుకా ణాలు, మొబైల్‌ విక్రయాల సంస్థల యజ మానులు పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. హానర్‌ గ్రూపు 28.4 ఎకరాల్లో 142 ప్లాట్లలో విల్లాల నిర్మాణం చేపట్టినట్లు తెలిసింది. ఓ ఎమ్మెల్సీకి కూడా భాగస్వామ్యం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. హానర్‌ గ్రూపు జూబ్లీహిల్స్, గచ్చి బౌలి, హైటెక్‌సిటీ ప్రాంతాల్లో భారీ ప్రాజెక్టులు చేపట్టింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement