మంత్రి శ్రీధర్‌బాబు నివాసంలో సెల్‌ఫోన్‌ చోరీ | Cell phone theft Minister Sridhar Babu home | Sakshi
Sakshi News home page

మంత్రి శ్రీధర్‌బాబు నివాసంలో సెల్‌ఫోన్‌ చోరీ

Published Sat, Nov 9 2024 9:45 AM | Last Updated on Sat, Nov 9 2024 10:23 AM

Cell phone theft Minister Sridhar Babu home

బంజారాహిల్స్‌: బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్‌.12లోని మినిస్టర్‌ క్వార్టర్స్‌లో ఉంటున్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు నివాసంలో సెల్‌ఫోన్‌ చోరీకి గురైంది. బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్న ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస సముదాయంలో క్వార్టర్‌ నెంబర్‌–7లో మంత్రి శ్రీధర్‌బాబు ఉంటున్నారు.

 గత నెల 31వ తేదీ రాత్రి 9 గంటల ప్రాంతంలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని మంత్రి ఇంట్లో ఎండోమెంట్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ పీఏ సతీ‹Ùకుమార్‌ లక్ష్మీపూజ నిర్వహించాడు. పూజ అనంతరం రాత్రి 9.30 గంటలకు ఆయన ఫోన్‌ కోసం చూడగా కనిపించలేదు. అన్ని ప్రాంతాలు వెతికినా ఉపయోగం లేకుండా పోయింది. 

మంత్రి ఇంట్లో పూజలకు ఎంతోమంది అతిథులు వచ్చారని, ఎలా చోరీకి గురైందో తెలియదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పూజల్లో నిమగ్నమై ఉండగా గుర్తుతెలియని వ్యక్తులు సెల్‌ఫోన్‌ చోరీ చేసి ఉంటారని పేర్కొన్నారు. దీపావళి తర్వాత వారం రోజులుగా తాను విధి నిర్వహణలో బీజీగా ఉన్నానని, దీంతో శనివారం ఫిర్యాదు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బంజారాహిల్స్‌ పోలీసులు ఘటనా స్థలంలో వివరాలు సేకరించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement