minister sridhar babu
-
తెలంగాణలో బ్లాక్ చెయిన్ సిటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ(Telangan) లో బ్లాక్ చైన్ సిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు(Sridhar Babu) వెల్లడించారు. ఈ సిటీని ఎక్కడ.. ఎంత విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలనే అంశంపై ఇప్పటికే సంబంధిత పరిశ్రమలు, నిపుణులతో సంప్రదింపులు ప్రారంభించామని చెప్పారు. డ్రోన్ టెక్నాలజీ, రొబోటిక్స్ రంగంలో సుమారు 1,800 మందికి ఉపాధి కల్పిస్తున్న ‘సెంటిలియన్ నెట్వర్క్స్ అండ్ హెచ్‌సీ రొబోటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్’నూతన క్యాంపస్‌ను మంత్రి శుక్రవారం మాదాపూర్‌లో ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన సాంకేతికత ఆవిష్కరణలో తెలంగాణను నంబర్ వన్‌గా నిలిపేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామని చెప్పారు. ఫ్యూచర్ సిటీలో నిర్మించ తలపెట్టిన ఏఐ యూనివర్సిటీకి త్వరలో శంకుస్థాపన చేస్తామని తెలిపారు. ప్రత్యేకంగా క్వాంటం కంప్యూటింగ్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ప్రారంభించబోతున్నామని వెల్లడించారు. దేశంలో ఫ్రాంటియర్ టెక్నాలజీ హబ్‌ను ఏర్పాటు చేసే యోచనలో కేంద్రం ఉందని, దానిని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. డ్రోన్ టెక్నాలజీపై తెలంగాణ యువతకు ప్రత్యేకంగా శిక్షణనిచి్చ.. ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కసరత్తు చేస్తున్నామని చెప్పారు.బ్యాడ్మింటన్ అధ్యక్షుడిగా శ్రీధర్బాబుతెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం కొత్త అధ్యక్షుడిగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Sridhar Babu) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో శ్రీధర్‌బాబును భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఘనంగా సన్మానించారు. గోపీచంద్ అకాడమీలో జరుగుతున్న ఆలిండియా జూనియర్ ర్యాంకింగ్ (అండర్–19) టోర్నమెంట్ పోస్టర్‌ను కూడా మంత్రి విడుదల చేశారు. -
మంత్రి శ్రీధర్‌బాబు నివాసంలో సెల్‌ఫోన్ చోరీ
బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్డు నెంబర్.12లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో ఉంటున్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు నివాసంలో సెల్‌ఫోన్ చోరీకి గురైంది. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస సముదాయంలో క్వార్టర్ నెంబర్–7లో మంత్రి శ్రీధర్‌బాబు ఉంటున్నారు. గత నెల 31వ తేదీ రాత్రి 9 గంటల ప్రాంతంలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని మంత్రి ఇంట్లో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ పీఏ సతీ‹Ùకుమార్ లక్ష్మీపూజ నిర్వహించాడు. పూజ అనంతరం రాత్రి 9.30 గంటలకు ఆయన ఫోన్ కోసం చూడగా కనిపించలేదు. అన్ని ప్రాంతాలు వెతికినా ఉపయోగం లేకుండా పోయింది. మంత్రి ఇంట్లో పూజలకు ఎంతోమంది అతిథులు వచ్చారని, ఎలా చోరీకి గురైందో తెలియదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పూజల్లో నిమగ్నమై ఉండగా గుర్తుతెలియని వ్యక్తులు సెల్‌ఫోన్ చోరీ చేసి ఉంటారని పేర్కొన్నారు. దీపావళి తర్వాత వారం రోజులుగా తాను విధి నిర్వహణలో బీజీగా ఉన్నానని, దీంతో శనివారం ఫిర్యాదు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బంజారాహిల్స్ పోలీసులు ఘటనా స్థలంలో వివరాలు సేకరించారు. -
తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు ఇవే
సాక్షి, హైదరాబాద్: ఆరు గ్యారంటీలపై కేబినెట్లో సుదీర్ఘంగా చర్చించామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. మీడియా సమావేశంలో ఆయన కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. ఆరు గ్యారంటీలను అమలు ప్రక్రియలో భాగంగా అన్ని అంశాలపై చర్చించామని పేర్కొన్నారు. రాబోయే ఐదేళ్లలో మార్పు చూపిస్తాం. రేపు 2 గ్యారంటీలకు సంబంధించి ఆయా శాఖలతో సీఎం చర్చిస్తారు. 2014 నుంచి 2023 వరకు ప్రభుత్వ శాఖల ఖర్చుపై చర్చించాం. అన్ని శాఖల ఆదాయ వ్యయాలపై శ్వేత పత్రం విడుదల చేయాలని నిర్ణయించాం. ఈ నెల 9న రెండు గ్యారెంటీలు అమల్లోకి తెస్తాం’’ అని మంత్రి వెల్లడించారు. ►మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఎల్లుండి నుంచి అమలు ►ఆరోగ్యశ్రీ పరిమితి పది లక్షలకు పెంపు ►ఎల్లుండి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ►రైతులకు, పరిశ్రమలకు 24 గంటల విద్యుత్ -
శ్రీదర్ బాబు శవాల మీద ప్రమాణం చేసి మాట తప్పారు
-
శ్రీధర్‌బాబుపై భూదందాల ఆరోపణలు
-
తాయిలాల రచ్చబండ
సాక్షి, కరీంనగర్: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రచ్చబండ కార్యక్రమాన్ని తలపెట్టింది. గత రచ్చబండలో వచ్చిన అర్జీలను పరిష్కరించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశం కనిపిస్తోంది. జిల్లాలో మూడో విడత రచ్చబండ సభలు సోమవారం నుంచి ఈ నెల 26 వరకు నిర్వహించనున్నారు. మూడవ విడత రచ్చబండ కార్యక్రమాన్ని మంత్రి శ్రీధర్‌బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న మంథని నియోజకవర్గ పరిధిలోని మహాముత్తారంలో ప్రారంభిస్తారని మొదట ప్రకటించిన అధికారులు ఆదివా రం సాయంత్రం షెడ్యూలు మార్చారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఎల్కతుర్తిలో సోమవారం శ్రీధర్‌బాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మంత్రి తన సొంత నియోజకవర్గం నుంచి రచ్చబండను ప్రారంభించకపోవడం వెనుక ఉన్న కారణాలేమిటన్న చర్చ జరుగుతోంది. ఆది వారం రాత్రి వరకు కూడా మంథని నియోజకవర్గపరిధిలోని ఇతర మండలాల షెడ్యూలు ఖరారు కాలేదు. జిల్లాలో అన్ని పార్టీల ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో రచ్చబండ నిర్వహించేందుకు తేదీలు ఇచ్చా రు. రెండేళ్లుగా వ్యక్తిగత లబ్ధికోసం ఎదురుచూస్తున్న పేదలకు సత్వరమే సా యమందాలన్న ఉద్దేశంతో వారు షె డ్యూలు ఖరారు చేశారు. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో ఈ కార్యక్రమంలో పాల్గొనే మంత్రి తన మండలాలను పెండింగ్‌లో పెట్టడం ఎందుకో అంతుబట్టడంలేదు. మంత్రి నియోజకవర్గం లో రచ్చబండ కార్యక్రమం జరుగుతుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండేళ్ల తర్వాత.. 2011 ఫిబ్రవరి 10న మల్హర్ మం డలం వల్లెంకుంటలో జరిగిన రచ్చబండ సభకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హాజరయ్యారు. ఆ తర్వాత జరుగుతున్న రచ్చబండ ఇదే. రెండేళ్ల తర్వాత ప్రజల్లోకి వెళ్లేందుకు అవకాశం రావడంతో అధికార పార్టీ ప్రజాప్రతినిధు లు, నాయకులు రచ్చబండపై భారీ ఆశలు పెట్టుకున్నారు. కాంగ్రెస్ నాయ కులే ముందుండి నడిపించేలా ప్రభుత్వం రూపకల్పన చేసింది. గతంలో నిర్వహించిన రెండు విడతల్లో అధికారులే కీలకపాత్ర పోషిం చారు. ఈసా రి రచ్చబండ నిర్వహణ కో సమంటూ వేస్తున్న కమిటీలలో కాంగ్రెస్ పార్టీ నేతలను నియమించడం విమర్శలకు తావిస్తోంది. మండలస్థాయిలో ప్ర జాప్రతినిధులు లేని నేపథ్యంలో రాజకీయలబ్ధి పొందేందుకే అధికారపార్టీ వారి కి చోటు కల్పిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రెండో విడత రచ్చబండలో దరఖాస్తు చేసుకున్న వారిని, ప్రజావాణిలో రేషన్‌కార్డు, ఇందిరమ్మ ఇల్లు, పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిని ప్రస్తుత రచ్చబండకు తీసుకొచ్చి వారి సమస్య అక్కడికక్కడే పరిష్కారమయ్యేలా చూడాలని కాంగ్రెస్ నాయకులకు ప్రభుత్వం సూచించింది. మొక్కుబడిగా.. రచ్చబండ కార్యక్రమం మొక్కుబడి వ్యవహారంగా మారనుంది. జనం ముంగిట్లోకి వెళ్లి వారి సమస్యలు, అ వసరాలను అక్కడికక్కడే పరిష్కరిం చాలన్న ఉద్దేశంతో ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని మండల కేంద్రాలకే ప రిమితం చేయడం ద్వారా గ్రామీణ ప్ర జలు తమ అవసరాలను అధికారుల దృష్టికి తేలేని పరిస్థితి కల్పిస్తోంది. వ్యక్తిగత అవసరాల కోసం మండల కేంద్రానికి రావడం పల్లెజనానికి తల కు మించిన భారంగా మారనుంది. -
పల్లెల అభివృద్ధికి పాటుపడాలి
టవర్‌సర్కిల్, న్యూస్‌లైన్ : సర్పంచ్ పదవి పెద్ద బాధ్యత అని సర్పం చులంతా పల్లెల అభివృద్ధికి పాటుపడాలని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. కాంగ్రెస్ పా ర్టీ ఆధ్వర్యంలో కొత్తగా ఎన్నికైన సర్పంచులు, సహకార సంఘాల చైర్మన్లను సోమవారం ఇంది రాభవన్‌లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రకటన చేసినందుకు సోని యాగాంధీకి కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ స ర్పంచులకే స్వతహాగా చెక్ పవర్ వచ్చేలా సం బంధిత మంత్రి, ప్రభుత్వంతో మాట్లాడతానన్నారు. నిధులు లేనప్పుడు బీఆర్జీఎఫ్, జెడ్పీ నిధులు మళ్లించుకునేలా ప్రయత్నిస్తామన్నారు. చిన్నచిన్న పనులకు డబ్బులు పెట్టి తర్వాత తీ ర్మానం చేసి తీసుకోవాలని సూచించారు. జిల్లా కేంద్రంలో సర్పంచుల భవన నిర్మాణానికి ఎంపీ ల నిధుల నుంచి రూ. 10 లక్షల చొప్పున, ఇన్చార్జి మంత్రి నిధుల నుంచి రూ. 5 లక్షల చొప్పు న కేటాయించేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఈ నెల 19నుంచి ప్రభుత్వపరంగా సర్పంచులకు శిక్షణ ఇస్తారని, అనంతరం కాంగ్రెస్ నుంచి కూ డా శిక్షణ ఇప్పించేందుకు కృషిచేస్తామన్నారు. ఎంపీ పొన్నం మాట్లాడుతూ.. ఈ నెల 15 నుంచి 22వ వరకు ఊరూరా కాంగ్రెస్ జెండా సోనియాకు అండ నినాదంతో కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. గ్రామ కమిటీలు ఏర్పాటు చేసుకుని పార్టీ కార్యక్రమాలు విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. మాజీ మంత్రి జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏ సంక్షే మ కార్యక్రమం చేపట్టినా ప్రచార బాధ్యతలు సర్పంచులే చూసుకోవాలన్నారు. సర్పంచులు సరిగ్గా పనిచేస్తేనే రానున్న ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశముంటుందన్నారు. డీసీసీ అధ్యక్షుడు కొండూరి రవీందర్రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రవీ ణ్‌రెడ్డి, ఎమ్మెల్సీలు సంతోష్‌కుమార్, భానుప్రసాద్‌రావు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు వుచ్చిడి మోహన్‌రెడ్డి, కోడూరి సత్యనారాయణగౌడ్, నా యకులు హర్కర వేణుగోపాల్‌రావు, పనకంటి చంద్రశేఖర్, సురేందర్‌రెడ్డి, చేతి ధర్మ య్య, డి.శంకర్, ఆకారపు భాస్కర్‌రెడ్డి, సునీల్‌రావు, బొమ్మ శ్రీరాం, కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, చల్మె డ లక్ష్మీనరసింహరావు, కర్ర రాజశేఖర్, కృష్ణారావు, అన్నయ్యగౌడ్, నేరెళ్ల శారద, కన్నక ృ ష్ణ, సరోజన, రమ, జయశ్రీ, గణేష్, అంజనీప్రసా ద్, మంజుల పాల్గొన్నారు. -
అభివృద్ధిని అడ్డుకుంటున్న మంత్రి శ్రీధర్: ఎంపి వివేక్
కరీంనగర్: మంత్రి శ్రీధర్ బాబుపై ఎంపీ వివేక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి అభివృద్దిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రామగుండం కార్పోరేషన్‌ను అవినీతి మయం చేశారన్నారు. దానిని అక్రమాలకు అడ్డాగా మార్చారని వివేక్ మండిపడ్డారు. -
అన్నదాతల మత్యుఘోష
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ప్రకృతి వైపరీత్యాలతో పంటలు కోల్పో యి నిండా మునిగిన రైతులకు సర్కారు సా యం అందుతున్న భరోసా లేకుండా పోయిం ది. అధికారులు, ప్రజాప్రతినిధులతోపాటు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నీటిమీద రాతలే అవుతున్నాయి. దీంతో రైతన్నలు పాత అప్పులు తీర్చలేక, కొత్త నష్టాలను భరించలేక దిక్కుతోచని స్థితిలో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. పెట్టుబడుల కోసం బ్యాంకులతోపాటు వడ్డీలకు తెచ్చిన అప్పులు మీదపడడంతో అన్నదాతల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. గత రెండు రోజుల్లోనే జిల్లాలో ఐదుగురు రైతులు ఆత్మహత్య చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నెలలో దాదాపు పది మంది రైతులు పంటలు కోల్పోయి ప్రాణాలు తీసుకున్నారంటే పరిస్థితి ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది జూన్, జూలైలో కురిసిన కుండపోత వర్షాలతో జిల్లావ్యాప్తంగా వేలాది ఎకరాల్లో పంటలు దె బ్బతిన్నాయి. చేన్లు, పొలాల్లో ఇసుకమేటలు వేసి సాగుకు పనికిరాకుండా పోయాయి. పంట చేన్లలో నీరు నిలిచి పత్తి, మొక్కజొన్నతోపాటు ఇతర ఆరుతడి పంటలు ఎర్రబారాయి. భారీ వర్షాలతో రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూశారు. ఈ నేపథ్యంలో కీలకంగా వ్యవహరించాల్సిన వ్యవసాయ శాఖ అధికారులు మొక్కుబడిగా నివేదికలు తయారు చేశారు. జిల్లావ్యాప్తంగా 31 మండలాల్లోని 359 గ్రామాల్లో 14వేల హెక్టార్లలో పంటలు నీట మునిగాయని ప్రాథమికంగా అంచనా వేసి చేతులు దులుపుకున్నారు. ఇంతవరకు పూర్తిస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేయలేపోయారు. 477 హెక్టార్లలో వరి, 3,515.80 హెక్టార్లలో పత్తి దెబ్బతినగా, 340.80 హెక్టార్లలో ఇసుకమేటలతో నష్టం జరిగిందని నిర్ధారించారు. ఈ మాత్రం నష్టం కూడా మంథని, సిరిసిల్ల డివిజన్లతోపాటు హుస్నాబాద్ ప్రాంతంలో జరిగిందని పేర్కొన్నారు. జగిత్యాల, కరీంనగర్ డివిజన్లలో పంట నష్టమే లేదంటున్నారు. పూర్తిస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేసి, పరిహారం అందిస్తారనే నమ్మకం లేకపోవడం తో అన్నదాతలు ఆత్మస్థైర్యం కోల్పోతున్నారు. మాటలకేనా..? మూడేళ్లుగా వరుస విపత్తులతో పంటలు కోల్పోయి రైతులు కుదేలవుతున్నారు. 2013 ఫిబ్రవరి 19న, ఏప్రిల్ 27న జిల్లాలో రెండుసార్లు పర్యటించిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్వయంగా నష్టపోయిన పంటలను పరిశీలించారు. రైతులకు త్వరలోనే పంట నష్టపరిహారం అందించి ఆదుకుంటామని హామీ ఇచ్చినా ఇంతవరకు నెరవేరలేదు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మంథని నియోజకవర్గంలోనే అత్యధికంగా పంట నష్టపోయినట్లు తెలుస్తున్నప్పటికీ అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి శ్రీధర్‌బాబు రైతుల గోడును పట్టించుకోవడం లేదు. భారీ వర్షాల సమయంలో పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎలాంటి హామీ ఇవ్వలేమని, తర్వాత రైతులను అన్నివిధాలా ఆదుకుంటామని ప్రకటించినా ఇంతవరకు దిక్కులేదు. ‘నీలం’తో సరి.. మార్చి 2011 నుంచి ఏప్రిల్ 2013 వరకు వడగండ్లు, నీలం తుఫాన్ వల్ల జిల్లాలో పెద్ద ఎత్తున పంటలు దెబ్బతిన్నాయి. సీజన్ల వారీగా జరిగిన పంట నష్టం అంచనాలను వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఈ మధ్యకాలంలో 40,555 హెక్టార్లలో ఆహార పంటలను 75,311 మంది రైతులు నష్టపోయారు. ఇందుకోసం రూ.31.13 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ మంజూరు చేయాలని ప్రతిపాదించారు. ఉద్యానపంటలలో 26,300 హెక్టార్లలో మామిడితోటలు దెబ్బతినగా, 52,400 మంది రైతులు నష్టపోయారు. వీరికోసం రూ.34.72 కోట్ల ఇన్పుట్ సబ్సిడీకి ప్రతిపాదించినా ఇంతవరకు మోక్షం లేదు. గతేడాది నవంబరులో నీలం తుఫాన్ జిల్లాను అతలాకుతలం చేసింది. 16 వేల హెక్టార్లలో పంటలు భారీగా దెబ్బతిన్నాయి. 34 వేల మంది రైతులకు సంబంధించి రూ.16 కోట్ల ఇన్పుట్ సబ్సిడీకి ప్రతిపాదించగా.. ప్రభుత్వం ఇటీవలే రైతుల ఖాతాల్లో జమ చేసి సరిపెట్టింది. మిగతా రూ.15.13 కోట్లు మంజూరు చేయడంలో జాప్యం చేస్తోంది. నష్టపోయిన పంటలలో 50 శాతానికిపైగా పంట దెబ్బతింటేనే రైతులు పరిహారానికి అర్హులని నిబంధన పెట్టారు. దీంతో చాలా మంది రైతులు పంట నష్ట పరిహారానికి నోచుకోవడం లేదు. రెండు రోజుల్లో ప్రాథమిక అంచనా వేసిన తర్వాత తిరిగి నెలల పాటు రీ సర్వే పేరిట పరిశీలించడంతో నష్టం అంచనా తప్పుతోంది. -
ఎఫ్‌సీఐ పునరుద్ధరణలో సీఎం పాత్ర శూన్యం
కరీంనగర్, న్యూస్‌లైన్ : రామగుండలం ఎఫ్‌సీఐ పునరుద్ధరణలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిందేమీ లేదని పెద్దపల్లి ఎంపీ జి.వివేక్ అన్నారు. ఆర్అండ్బీ అతిథి గృహంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ఎఫ్‌సీఐ పునరుద్ధరణ విషయంలో మంత్రి శ్రీధర్‌బాబు ముఖ్యమంత్రి ని పొగడడం సరికాదన్నారు. తనతోపాటు తన తండ్రి, మాజీ మంత్రి జి.వెంకటస్వామి అనేకసార్లు చేసిన విజ్ఞప్తుల మేరకే కేంద్రం ఎఫ్‌సీఐని పునరుద్ధరిస్తోందని తెలిపారు. నేదునూరు గ్యాస్ ఆధారిత ప్లాంట్‌కు గ్యాస్ కేటాయింపుల పై సీఎం కేంద్రానికి కనీసం లేఖ కూడా రాయలేదని, సీమాంధ్రలోని జెన్కో, జీఎంఆర్ ప్లాంట్లకు మాత్రం గ్యాస్ కేటాయింపులు చేయించుకున్నారని విమర్శించా రు. నదీ జలాల పంపిణీపై బచావత్ ట్రిబ్యునల్ అవార్డు సూచనలు ఉన్నాయని, కుట్రలు, కుతంత్రాల కు తెరదించి అన్నదమ్ముల్లా విడిపోయి కలిసుందామని అన్నారు. కేసీఆర్ పోరాటంతోనే కేంద్రం తెలంగాణ ప్రకటించిందని, తాను టీఆర్ఎస్ను వీడే ప్రసక్తే లేదని, కేసీఆర్ నిర్ణయమే శిరోధార్యమని స్పష్టం చేశారు. సీఎం, డీజీపీని బర్తరఫ్ చేయాలి రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి సీమాంధ్ర పక్షపాతులుగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, డీజీపీ దినేశ్‌రెడ్డిని తక్షణమే బర్తరఫ్ చేయాలని వివేక్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ప్రజల మధ్య చిచ్చుపెట్టి భావోద్వేగాలను రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్న సీఎంకు పాలించే నైతిక అర్హత లేదన్నారు. సమావేశంలో ఎమ్మె ల్యే గంగుల, కట్ల సతీశ్, రఘువీర్‌సింగ్, అక్బర్‌హుస్సేన్, లక్కాకుల మోహన్‌రావు, నందెల్లి మహిపాల్, మొగిలోజు వెంకట్, మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. -
సుపరిపాలనే లక్ష్యం
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సుపరిపాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ఇందుకోసం అనేక కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తున్నట్లు చె ప్పారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరిం చుకుని మంత్రి గురువారం జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయజెండా ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అధికారులు, పోలీసులకు ఉత్తమ సేవలకు ప్రశంసపత్రాలు అందజేశారు. స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. సమస్యలు తెలుసుకునేందుకే ‘గ్రామసందర్శన’ సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా జిల్లాలో ఈ నెల 9న గ్రామ సందర్శన కార్యక్రమం ప్రారంభించామని మంత్రి చెప్పా రు. ప్రత్యేకాధికారి ఆధ్వర్యంలో ఏర్పడిన మం డల, గ్రామస్థాయి బృందాలు ప్రతీ గురువారం ఓ గ్రామంలో పర్యటించి పరిశీలిస్తాయని తెలిపారు. ప్రభుత్వ పథకాల అమలులో క్షేత్రస్థాయిలో లోటుపాట్లు సమీక్షించి చర్యలు తీసుకుంటారన్నారు. ఈ కార్యక్రమం ద్వారా మార్చిలోగా జిల్లాలో 5 లక్షల వయోజన నిరక్షరాస్యులను అక్షరాస్యులను చేసి జాతీయ అక్షరాస్యత పరీక్షకు హాజరయ్యేందుకు లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. 2లక్షల వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, ఉపాధిహామీ పథకం కింద రెండు లక్షల కుటుంబాలకు వంద రోజుల పని కల్పన లక్ష్యంగా నిర్ణయించామన్నారు. జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో కనీసం 50వేల మందిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా ప్రణాళిక రూపొందించామని తెలిపారు. వ్యవసాయూభివృద్ధి... మరింత ప్రగతి జిల్లాలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేసి వ్యవసాయాభివృద్ధిలో మరింత ప్రగతి సాధిస్తామని మంత్రి అన్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నిర్మాణం తుది దశ కు చేరుకుందని, ముంపునకు గురవుతున్న 12 గ్రామాల్లో 8 గ్రా మాలకు పునరావాస కాలనీలు పూర్తి చేసినట్లు తెలిపారు. మధ్యమానేరు ప్రాజెక్ట్ నిర్మాణం 2015లోగా పూర్తి చేస్తామని, రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. ముంపునకు గురైన 17 గ్రామాల ఇళ్లకు రూ.280 కోట్ల పరిహారం చెల్లించామన్నారు. లోవోల్టేజీ నివారణకు ప్రభుత్వం 35 సబ్స్టేషన్లు మం జూరు చేసిందని చెప్పారు. నీలం తుఫాన్‌తో పంట నష్టపోయిన 33 వేల మంది రైతులకు పరిహారాన్ని వారి ఖాతాలకు జమచేసినట్లు వివరించారు. ఈ సీజన్లో రైతులకు రూ.1500 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించడమే లక్ష్యంగా నిర్ణయించామన్నారు. జిల్లాలో ఎరువుల కొరత రాకుండా చూస్తున్నామని తెలిపారు. ‘బంగారుతల్లి’కి బాసట ఆడపిల్లలు ఇంటికి మహాలక్ష్మి కావాలనే లక్ష్యంతో ప్రభుత్వం బంగారుతల్లి పథకం ప్రవేశపెట్టిందని శ్రీధర్‌బాబు చెప్పారు. తెల్లరేషన్‌కార్డు కలిగి 2013, మే 1 తర్వాత పుట్టిన ఆడబిడ్డలకు ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. డిగ్రీ పూర్తయ్యే వరకు ప్రభుత్వం వివిధ దశల్లో మొత్తం రూ.2.16 లక్షల ఆర్థికసాయం అందిస్తుందని పేర్కొన్నారు. మహిళా సంఘాలకు లింకేజీ కింద రూ.599 కోట్ల 87లక్షలు లక్ష్యం కాగా, ఇప్పటివరకు రూ.63 కోట్ల రుణాలు మంజూరు చేశామన్నారు. అన్ని డివిజన్లలో జన ఔషధ నిలయాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. మనమే ముందు... రబీ సీజన్లో ఐకేపీ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా 473 కొనుగోలు కేద్రాలు ఏర్పాటు చేసి 2లక్షల 69వేల 335 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి జిల్లా రాష్ట్రంలోనే మొదటిస్థానం నిలిచిందన్నారు. 20 సూత్రాల కార్యక్రమం అమలులో 2012-13లో రెండోసారి జిల్లా రాష్ట్రంలో ఉత్తమంగా నిలిచిందన్నారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కింద జిల్లాలో రూ.17 కోట్ల 99 లక్షలతో 19 రోడ్ల నిర్మాణ పనులు మంజూరు చేసినట్లు తెలిపారు. నాబార్డు ద్వారా రూ.20.61 కోట్లతో 43.78 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణ పనులు మంజూరు చేసినట్లు స్పష్టం చేశారు. గ్రామీణ తాగునీటి సరఫరాకు ఈ ఏడాది రూ.40.16 కోట్లతో 404 పనులు మంజూరు చేశామని తెలిపారు. నిర్మల్ భారత్ అభియాన్ కింద జిల్లాలో 2 లక్షల 70 వేల వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేశామన్నారు. రెండో విడత రచ్చబండలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి మరో 93,183 కార్డులు జారీ చేయనున్నట్లు చెప్పారు. కలెక్టర్ వీరబ్రహ్మయ్య, ఎస్పీ రవీందర్, ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్, హుస్నాబాద్ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ అరుణ్‌కుమార్, డీఆర్వో కృష్ణారెడ్డి, శాతవాహన యూనివర్సిటీ వీసీ వీరారెడ్డి, కేడీసీసీబీ చైర్మన్ కొండూరి రవీందర్రావు, ఆఫ్కాఫ్ చైర్మన్ చేతి ధర్మయ్య పాల్గొన్నారు.