టవర్‌సర్కిల్, న్యూస్‌లైన్ :
సర్పంచ్ పదవి పెద్ద బాధ్యత అని సర్పం చులంతా పల్లెల అభివృద్ధికి పాటుపడాలని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. కాంగ్రెస్ పా ర్టీ ఆధ్వర్యంలో కొత్తగా ఎన్నికైన సర్పంచులు, సహకార సంఘాల చైర్మన్లను సోమవారం ఇంది రాభవన్‌లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రకటన చేసినందుకు సోని యాగాంధీకి కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ స ర్పంచులకే స్వతహాగా చెక్ పవర్ వచ్చేలా సం బంధిత మంత్రి, ప్రభుత్వంతో మాట్లాడతానన్నారు. నిధులు లేనప్పుడు బీఆర్‌జీఎఫ్, జెడ్పీ నిధులు మళ్లించుకునేలా ప్రయత్నిస్తామన్నారు. చిన్నచిన్న పనులకు డబ్బులు పెట్టి తర్వాత తీ ర్మానం చేసి తీసుకోవాలని సూచించారు. జిల్లా కేంద్రంలో సర్పంచుల భవన నిర్మాణానికి ఎంపీ ల నిధుల నుంచి రూ. 10 లక్షల చొప్పున, ఇన్‌చార్జి మంత్రి నిధుల నుంచి రూ. 5 లక్షల చొప్పు న కేటాయించేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఈ నెల 19నుంచి ప్రభుత్వపరంగా సర్పంచులకు శిక్షణ ఇస్తారని, అనంతరం కాంగ్రెస్ నుంచి కూ డా శిక్షణ ఇప్పించేందుకు కృషిచేస్తామన్నారు.
ఎంపీ పొన్నం మాట్లాడుతూ.. ఈ నెల 15 నుంచి 22వ వరకు ఊరూరా కాంగ్రెస్ జెండా సోనియాకు అండ నినాదంతో కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. గ్రామ కమిటీలు ఏర్పాటు చేసుకుని పార్టీ కార్యక్రమాలు విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. మాజీ మంత్రి జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏ సంక్షే మ కార్యక్రమం చేపట్టినా ప్రచార బాధ్యతలు సర్పంచులే చూసుకోవాలన్నారు. సర్పంచులు సరిగ్గా పనిచేస్తేనే రానున్న ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశముంటుందన్నారు. డీసీసీ అధ్యక్షుడు కొండూరి రవీందర్‌రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రవీ ణ్‌రెడ్డి, ఎమ్మెల్సీలు సంతోష్‌కుమార్, భానుప్రసాద్‌రావు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు వుచ్చిడి మోహన్‌రెడ్డి, కోడూరి సత్యనారాయణగౌడ్, నా యకులు హర్కర వేణుగోపాల్‌రావు, పనకంటి చంద్రశేఖర్, సురేందర్‌రెడ్డి, చేతి ధర్మ య్య, డి.శంకర్, ఆకారపు భాస్కర్‌రెడ్డి, సునీల్‌రావు, బొమ్మ శ్రీరాం, కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, చల్మె డ లక్ష్మీనరసింహరావు, కర్ర రాజశేఖర్, కృష్ణారావు, అన్నయ్యగౌడ్, నేరెళ్ల శారద, కన్నక ృ ష్ణ, సరోజన, రమ, జయశ్రీ, గణేష్, అంజనీప్రసా ద్, మంజుల పాల్గొన్నారు.
పల్లెల అభివృద్ధికి పాటుపడాలి
Published Tue, Sep 17 2013 4:03 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement