కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ప్రకృతి వైపరీత్యాలతో పంటలు కోల్పో యి నిండా మునిగిన రైతులకు సర్కారు సా యం అందుతున్న భరోసా లేకుండా పోయిం ది. అధికారులు, ప్రజాప్రతినిధులతోపాటు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నీటిమీద రాతలే అవుతున్నాయి. దీంతో రైతన్నలు పాత అప్పులు తీర్చలేక, కొత్త నష్టాలను భరించలేక దిక్కుతోచని స్థితిలో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. పెట్టుబడుల కోసం బ్యాంకులతోపాటు వడ్డీలకు తెచ్చిన అప్పులు మీదపడడంతో అన్నదాతల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి.
గత రెండు రోజుల్లోనే జిల్లాలో ఐదుగురు రైతులు ఆత్మహత్య చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నెలలో దాదాపు పది మంది రైతులు పంటలు కోల్పోయి ప్రాణాలు తీసుకున్నారంటే పరిస్థితి ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది జూన్, జూలైలో కురిసిన కుండపోత వర్షాలతో జిల్లావ్యాప్తంగా వేలాది ఎకరాల్లో పంటలు దె బ్బతిన్నాయి. చేన్లు, పొలాల్లో ఇసుకమేటలు వేసి సాగుకు పనికిరాకుండా పోయాయి. పంట చేన్లలో నీరు నిలిచి పత్తి, మొక్కజొన్నతోపాటు ఇతర ఆరుతడి పంటలు ఎర్రబారాయి. భారీ వర్షాలతో రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూశారు.
ఈ నేపథ్యంలో కీలకంగా వ్యవహరించాల్సిన వ్యవసాయ శాఖ అధికారులు మొక్కుబడిగా నివేదికలు తయారు చేశారు. జిల్లావ్యాప్తంగా 31 మండలాల్లోని 359 గ్రామాల్లో 14వేల హెక్టార్లలో పంటలు నీట మునిగాయని ప్రాథమికంగా అంచనా వేసి చేతులు దులుపుకున్నారు. ఇంతవరకు పూర్తిస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేయలేపోయారు. 477 హెక్టార్లలో వరి, 3,515.80 హెక్టార్లలో పత్తి దెబ్బతినగా, 340.80 హెక్టార్లలో ఇసుకమేటలతో నష్టం జరిగిందని నిర్ధారించారు. ఈ మాత్రం నష్టం కూడా మంథని, సిరిసిల్ల డివిజన్లతోపాటు హుస్నాబాద్ ప్రాంతంలో జరిగిందని పేర్కొన్నారు. జగిత్యాల, కరీంనగర్ డివిజన్లలో పంట నష్టమే లేదంటున్నారు. పూర్తిస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేసి, పరిహారం అందిస్తారనే నమ్మకం లేకపోవడం తో అన్నదాతలు ఆత్మస్థైర్యం కోల్పోతున్నారు.
మాటలకేనా..?
మూడేళ్లుగా వరుస విపత్తులతో పంటలు కోల్పోయి రైతులు కుదేలవుతున్నారు. 2013 ఫిబ్రవరి 19న, ఏప్రిల్ 27న జిల్లాలో రెండుసార్లు పర్యటించిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్వయంగా నష్టపోయిన పంటలను పరిశీలించారు. రైతులకు త్వరలోనే పంట నష్టపరిహారం అందించి ఆదుకుంటామని హామీ ఇచ్చినా ఇంతవరకు నెరవేరలేదు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మంథని నియోజకవర్గంలోనే అత్యధికంగా పంట నష్టపోయినట్లు తెలుస్తున్నప్పటికీ అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి శ్రీధర్‌బాబు రైతుల గోడును పట్టించుకోవడం లేదు. భారీ వర్షాల సమయంలో పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎలాంటి హామీ ఇవ్వలేమని, తర్వాత రైతులను అన్నివిధాలా ఆదుకుంటామని ప్రకటించినా ఇంతవరకు దిక్కులేదు.
‘నీలం’తో సరి..
మార్చి 2011 నుంచి ఏప్రిల్ 2013 వరకు వడగండ్లు, నీలం తుఫాన్ వల్ల జిల్లాలో పెద్ద ఎత్తున పంటలు దెబ్బతిన్నాయి. సీజన్ల వారీగా జరిగిన పంట నష్టం అంచనాలను వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఈ మధ్యకాలంలో 40,555 హెక్టార్లలో ఆహార పంటలను 75,311 మంది రైతులు నష్టపోయారు. ఇందుకోసం రూ.31.13 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ మంజూరు చేయాలని ప్రతిపాదించారు. ఉద్యానపంటలలో 26,300 హెక్టార్లలో మామిడితోటలు దెబ్బతినగా, 52,400 మంది రైతులు నష్టపోయారు. వీరికోసం రూ.34.72 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీకి ప్రతిపాదించినా ఇంతవరకు మోక్షం లేదు. గతేడాది నవంబరులో నీలం తుఫాన్ జిల్లాను అతలాకుతలం చేసింది.
16 వేల హెక్టార్లలో పంటలు భారీగా దెబ్బతిన్నాయి. 34 వేల మంది రైతులకు సంబంధించి రూ.16 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీకి ప్రతిపాదించగా.. ప్రభుత్వం ఇటీవలే రైతుల ఖాతాల్లో జమ చేసి సరిపెట్టింది. మిగతా రూ.15.13 కోట్లు మంజూరు చేయడంలో జాప్యం చేస్తోంది. నష్టపోయిన పంటలలో 50 శాతానికిపైగా పంట దెబ్బతింటేనే రైతులు పరిహారానికి అర్హులని నిబంధన పెట్టారు. దీంతో చాలా మంది రైతులు పంట నష్ట పరిహారానికి నోచుకోవడం లేదు. రెండు రోజుల్లో ప్రాథమిక అంచనా వేసిన తర్వాత తిరిగి నెలల పాటు రీ సర్వే పేరిట పరిశీలించడంతో నష్టం అంచనా తప్పుతోంది.
అన్నదాతల మత్యుఘోష
Published Wed, Aug 28 2013 3:35 AM | Last Updated on Fri, Sep 1 2017 10:10 PM
Advertisement
Advertisement