సాక్షి, కరీంనగర్: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రచ్చబండ కార్యక్రమాన్ని తలపెట్టింది. గత రచ్చబండలో వచ్చిన అర్జీలను పరిష్కరించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశం కనిపిస్తోంది.
జిల్లాలో మూడో విడత రచ్చబండ సభలు సోమవారం నుంచి ఈ నెల 26 వరకు నిర్వహించనున్నారు. మూడవ విడత రచ్చబండ కార్యక్రమాన్ని మంత్రి శ్రీధర్‌బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న మంథని నియోజకవర్గ పరిధిలోని మహాముత్తారంలో ప్రారంభిస్తారని మొదట ప్రకటించిన అధికారులు ఆదివా రం సాయంత్రం షెడ్యూలు మార్చారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఎల్కతుర్తిలో సోమవారం శ్రీధర్‌బాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మంత్రి తన సొంత నియోజకవర్గం నుంచి రచ్చబండను ప్రారంభించకపోవడం వెనుక ఉన్న కారణాలేమిటన్న చర్చ జరుగుతోంది.
ఆది వారం రాత్రి వరకు కూడా మంథని నియోజకవర్గపరిధిలోని ఇతర మండలాల షెడ్యూలు ఖరారు కాలేదు. జిల్లాలో అన్ని పార్టీల ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో రచ్చబండ నిర్వహించేందుకు తేదీలు ఇచ్చా రు. రెండేళ్లుగా వ్యక్తిగత లబ్ధికోసం ఎదురుచూస్తున్న పేదలకు సత్వరమే సా యమందాలన్న ఉద్దేశంతో వారు షె డ్యూలు ఖరారు చేశారు. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో ఈ కార్యక్రమంలో పాల్గొనే మంత్రి తన మండలాలను పెండింగ్‌లో పెట్టడం ఎందుకో అంతుబట్టడంలేదు. మంత్రి నియోజకవర్గం లో రచ్చబండ కార్యక్రమం జరుగుతుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రెండేళ్ల తర్వాత..
2011 ఫిబ్రవరి 10న మల్హర్ మం డలం వల్లెంకుంటలో జరిగిన రచ్చబండ సభకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హాజరయ్యారు. ఆ తర్వాత జరుగుతున్న రచ్చబండ ఇదే. రెండేళ్ల తర్వాత ప్రజల్లోకి వెళ్లేందుకు అవకాశం రావడంతో అధికార పార్టీ ప్రజాప్రతినిధు లు, నాయకులు రచ్చబండపై భారీ ఆశలు పెట్టుకున్నారు. కాంగ్రెస్ నాయ కులే ముందుండి నడిపించేలా ప్రభుత్వం రూపకల్పన చేసింది.
గతంలో నిర్వహించిన రెండు విడతల్లో అధికారులే కీలకపాత్ర పోషిం చారు. ఈసా రి రచ్చబండ నిర్వహణ కో సమంటూ వేస్తున్న కమిటీలలో కాంగ్రెస్ పార్టీ నేతలను నియమించడం విమర్శలకు తావిస్తోంది. మండలస్థాయిలో ప్ర జాప్రతినిధులు లేని నేపథ్యంలో రాజకీయలబ్ధి పొందేందుకే అధికారపార్టీ వారి కి చోటు కల్పిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రెండో విడత రచ్చబండలో దరఖాస్తు చేసుకున్న వారిని, ప్రజావాణిలో రేషన్‌కార్డు, ఇందిరమ్మ ఇల్లు, పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిని ప్రస్తుత రచ్చబండకు తీసుకొచ్చి వారి సమస్య అక్కడికక్కడే పరిష్కారమయ్యేలా చూడాలని కాంగ్రెస్ నాయకులకు ప్రభుత్వం సూచించింది.
మొక్కుబడిగా..
రచ్చబండ కార్యక్రమం మొక్కుబడి వ్యవహారంగా మారనుంది. జనం ముంగిట్లోకి వెళ్లి వారి సమస్యలు, అ వసరాలను అక్కడికక్కడే పరిష్కరిం చాలన్న ఉద్దేశంతో ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని మండల కేంద్రాలకే ప రిమితం చేయడం ద్వారా గ్రామీణ ప్ర జలు తమ అవసరాలను అధికారుల దృష్టికి తేలేని పరిస్థితి కల్పిస్తోంది. వ్యక్తిగత అవసరాల కోసం మండల కేంద్రానికి రావడం పల్లెజనానికి తల కు మించిన భారంగా మారనుంది.
తాయిలాల రచ్చబండ
Published Mon, Nov 11 2013 3:08 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement
Advertisement