మంత్రి శ్రీధర్‌బాబుకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న బ్యాడ్మింట్ కోచ్ గోపీచంద్
క్వాంటం కంప్యూటింగ్‌లో ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’
త్వరలో ఏఐ యూనివర్సిటీకి శంకుస్థాపన: మంత్రి శ్రీధర్‌బాబు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ(Telangan) లో బ్లాక్ చైన్ సిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు(Sridhar Babu) వెల్లడించారు. ఈ సిటీని ఎక్కడ.. ఎంత విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలనే అంశంపై ఇప్పటికే సంబంధిత పరిశ్రమలు, నిపుణులతో సంప్రదింపులు ప్రారంభించామని చెప్పారు. డ్రోన్ టెక్నాలజీ, రొబోటిక్స్ రంగంలో సుమారు 1,800 మందికి ఉపాధి కల్పిస్తున్న ‘సెంటిలియన్ నెట్‌వర్క్స్ అండ్ హెచ్‌సీ రొబోటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్’నూతన క్యాంపస్‌ను మంత్రి శుక్రవారం మాదాపూర్‌లో ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన సాంకేతికత ఆవిష్కరణలో తెలంగాణను నంబర్ వన్‌గా నిలిపేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామని చెప్పారు. ఫ్యూచర్ సిటీలో నిర్మించ తలపెట్టిన ఏఐ యూనివర్సిటీకి త్వరలో శంకుస్థాపన చేస్తామని తెలిపారు. ప్రత్యేకంగా క్వాంటం కంప్యూటింగ్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ప్రారంభించబోతున్నామని వెల్లడించారు. దేశంలో ఫ్రాంటియర్ టెక్నాలజీ హబ్‌ను ఏర్పాటు చేసే యోచనలో కేంద్రం ఉందని, దానిని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. డ్రోన్ టెక్నాలజీపై తెలంగాణ యువతకు ప్రత్యేకంగా శిక్షణనిచి్చ.. ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కసరత్తు చేస్తున్నామని చెప్పారు.
బ్యాడ్మింటన్ అధ్యక్షుడిగా శ్రీధర్‌బాబు
తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం కొత్త అధ్యక్షుడిగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Sridhar Babu) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో శ్రీధర్‌బాబును భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఘనంగా సన్మానించారు. గోపీచంద్ అకాడమీలో జరుగుతున్న ఆలిండియా జూనియర్ ర్యాంకింగ్ (అండర్–19) టోర్నమెంట్ పోస్టర్‌ను కూడా మంత్రి విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment