చీరాల: ఇంటి పెరట్లోను.. మిద్దెలపైన మొక్కలు పెంచటం సహజం. అందుకు భిన్నంగా తన బతుకు బండి అయిన ఆటో రిక్షాను హరితవనంగా మార్చాడు ఈ ఆటోవాలా. ‘నే ఆటోవాణ్ణి.. ఆటోవాణ్ణి.. పచ్చదనం రూటువాణ్ణి’ అంటూ ప్రయాణికుల్ని ఎక్కించుకుని రయ్యిన దూసుకుపోతున్నాడు ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం పందిళ్లపల్లికి చెందిన సీహెచ్ జక్రయ్య. మొక్కల పెంపకానికి అనువైన స్థలం లేకపోవడంతో జక్రయ్య తన ఆటోలోని ముందు భాగంలో ప్రత్యేకంగా ట్రే ఏర్పాటు చేసుకున్నాడు. అందులో మొక్కలు పెంచేందుకు అనువుగా మట్టి, రాళ్లు వేసి గార్డెన్‌లా తయారు చేశాడు. మొక్కలకు పోసే నీరు కిందికి వెళ్లేలా ఓ పైపును అమర్చాడు.
చదవండి:
‘జగనన్న స్మార్ట్ టౌన్’కు దరఖాస్తు చేసుకోండి
ఓపీఎం వెనుక డ్రగ్ మాఫియా!
‘నే ఆటోవాణ్ణి.. పచ్చదనం రూటువాణ్ణి!’
Published Tue, Apr 6 2021 11:25 AM | Last Updated on Tue, Apr 6 2021 12:35 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment