ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి.. మైనర్‌ బాలికపై.. | Man Molestation Attempt On Minor Girl Warangal | Sakshi
Sakshi News home page

ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి.. మైనర్‌ బాలికపై..

Published Thu, Dec 2 2021 7:39 AM | Last Updated on Thu, Dec 2 2021 7:57 AM

Man Molestation Attempt On Minor Girl Warangal - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి,నల్లబెల్లి( హనుమకొండ): మండలంలోని కొండాపూర్‌లో ఓ మైనర్‌ బాలిక(14)పై అత్యాచారయత్నం జరిగింది. స్థానిక ఎస్సై రేగ అశోక్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మైనర్‌ బాలిక నల్లబెల్లి కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ఇటీవల ఆమె తన ఇంటికి వెళ్లింది. ఆదివారం రోజున కుటుంబ సభ్యులు వ్యవసాయ పనులకు వెళ్లడంతో బాలిక ఇంటి వద్ద ఉంది.

అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి విషయాన్ని గమనించి ఇంట్లోకి ప్రవేశించి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాలిక అరవడంతో చుట్టుపక్కలవారు అక్కడికి చేరుకోవడంతో అతడు అక్కడి నుంచి పారిపోయాడు. వ్యవసాయపనులకు వెళ్లివచ్చిన తల్లిదండ్రులకు జరిగిన ఘటనను బాలిక తెలియజేసింది. ఈ మేరకు బాలిక తండ్రి మంగళవారం రాత్రి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.

చదవండి: వివాహేతర సంబంధం అంటూ కోడలిపై అసత్య ప్రచారం.. తట్టుకోలేక రాత్రి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement