ఒంగోలులోని స్థానిక రెండవ పోలీస్‌స్టేషన్‌లో హోమ్‌గార్డుగా పనిచేస్తున్న జ్యోతి బుధవారం మధ్యాహ్నం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ వెనుక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
ఒంగోలు: ఒంగోలులోని స్థానిక రెండవ పోలీస్‌స్టేషన్‌లో హోమ్‌గార్డుగా పనిచేస్తున్న జ్యోతి బుధవారం మధ్యాహ్నం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ వెనుక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో పనిచేసే దేవేంద్ర అనే కానిస్టేబుల్‌కు జ్యోతి నాలుగు లక్షల రూపాయల అప్పు ఇచ్చింది. డబ్బు ఇమ్మని ఎన్నిసార్లు అడిగినా దేవేంద్ర ఇవ్వకపోవడంతో విసుగుచెందిన జ్యోతి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ వద్దకు వెళ్లి పురుగుల మందు సేవించింది. గమనించిన పోలీసులు వెంటనే ఆమెను రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అమె ఆస్పత్రిలో కోలుకుంటోంది.