తిరుపతి: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని ఓ హోంగార్డు మోసగించాడంటూ ఒక యువతి శ్రీవారి ప్రధాన ఆలయం వద్ద గురువారం రాత్రి ఆత్మహత్యకు యత్నించింది. యోగి అనే హోంగార్డు తనను మోసం చేశాడని ఆరోపిస్తూ ఓ యువతి ఆలయం వద్ద గాజుపెంకులు మింగింది. వెంటనే అప్రమత్తమైన భద్రతాసిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.