శంషాబాద్(రంగారెడ్డి జిల్లా): మూగ బాలికపై ఓ బాలుడు అత్యాచారయత్నం చేశాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. మండల కేంద్రంలోని మొహిన్‌మహల్లా సమీపంలోని శివాజీ కాలనీలో ఉండే మూగబాలిక(10)పై స్థానికంగా ఉండే ఓ బాలుడు (14) మంగళవారం అత్యాచార యత్నం చేశాడు. భయాందోళనకు గురైన బాలిక ఏడ్వడంతో ఆమె తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్నారు. బాలుడిని ఆర్‌జీఐఏ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి పోలీసులకు అప్పగించి ఘటనపై ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ జరుపుతున్నారు.