పదో తరగతి పరీక్ష రాయడానికి కొన్ని గంటల ముందే ముగ్గురు బాలికలు ఆత్మహత్య యత్నం చేశారు.
తిరువనంతపురం:
పదో తరగతి పరీక్ష రాయడానికి కొన్ని గంటల ముందే ముగ్గురు బాలికలు ఆత్మహత్య యత్నం చేశారు. ఈ సంఘటన కేరళలోని తిరువనంతపురంలో సోమవారం చోటు చేసుకుంది. పదో తరగతి చదువుతున్న ముగ్గురు బాలికలు బ్రిడ్జ్ పై నుంచి నీటిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గమనించిన స్థానికులు వాళ్లను కాపాడి ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.
'ప్రాథమిక సమాచారం ప్రకారం ఆ ముగ్గురు బాలికలకు మధ్యహ్నం పదో తరగతి పరీక్ష ఉంది. దీనికి ముందే ముగ్గురు ఒకే సారి ఆత్మహత్య యత్నం చేశారు' అని పోలీసులు తెలిపారు.