మరోసారి ఆ పని చేయబోను: షారుక్ | I cannot attempt to sing a song again: Shah Rukh | Sakshi
Sakshi News home page

మరోసారి ఆ పని చేయబోను: షారుక్

Published Thu, Apr 14 2016 7:14 PM | Last Updated on Sun, Sep 3 2017 9:55 PM

మరోసారి ఆ పని చేయబోను: షారుక్

మరోసారి ఆ పని చేయబోను: షారుక్

ముంబై: ఇటీవలి కాలంలో తమ సినిమాల కోసం కథానాయకులే గొంతు సవరించుకొని పాటలు పాడుకుంటున్న సందర్భాలు పెరిగిపోతున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్లు సైతం హీరోలతో పాటలు పాడించి అభిమానులను అలరించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ మాత్రం అభిమానులకు షాకిచ్చే వార్త చెప్పాడు. తన 25 ఏళ్ల యాక్టింగ్ కెరీర్లో జోష్ సినిమాకు గాను 'అపున్ బోలా తు మేరి లైలా' సాంగ్ కోసం ఒకే ఒకసారి గొంతు సవరించుకున్న ఈ హీరో.. మరోసారి ఆ ప్రయత్నం చేయబోనని తేల్చి చెప్పాడు.

ఓ టీవీ చానల్ నిర్వహించిన మ్యూజికల్ రియాలిటీ షోలో పాల్గొన్న షారుక్‌ ఖాన్.. కార్యక్రమంలో పాల్గొన్న గాయకుల గాత్రానికి ముగ్ధుడైపోయాడు. గాయకులు చక్కగా పాడుతున్నారని కితాబిచ్చిన షారుక్.. తాను మాత్రం మరోసారి పాడే సాహసం చేయబోనన్నాడు. తన సినిమాలకు మంచి పాటలు పాడిన గాయకులందరికీ ఈ సందర్భంగా షారుక్ ధన్యవాదాలు తెలిపాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement