ఎస్సైపై దాడికి యత్నం
Published Sat, Feb 25 2017 4:38 PM | Last Updated on Tue, Oct 9 2018 5:27 PM
మంచిర్యాల: బందోబస్తుకు వెళ్లిన మంచిర్యాల ఎస్సైపై ఓ తాగుబోతు దాడికి యత్నించాడు. సిబ్బంది అతడిని పట్టుకుని, విచారణ చేస్తున్నారు. ఈ ఘటన జిల్లా కేంద్రంలోని జైపూర్ మండలంలో జరిగింది. మండలంలో జరుగుతున్న వేలాల జాతరలో బందోబస్తుకు మంచిర్యాల ఎస్సై వేణుగోపాల్ శనివారం ఉదయం వెళ్లారు.
మధ్యాహ్నం సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మద్యం మత్తులో కారులో వచ్చాడు. జాతరలో ఉన్న ఎస్సై వద్దకు చేరుకుని దుర్బాషలాడుతూ ఆయన్ను కొట్టబోయాడు. అతనిని సిబ్బంది, స్థానికులు నిలువరించారు. ఆ అగంతకుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
Advertisement
Advertisement