రంగారెడ్డి జిల్లా: తమ ప్రేమను పెద్దలు ఒప్పుకోకపోవడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. రంగారెడ్డి జిల్లా జవహర్‌నగర్‌లోని బీజేఆర్ నగర్‌లో ఆదివారం ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బీజేఆర్ నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ రమేష్ (23) అదే ప్రాంతానికి చెందిన డిగ్రీ విద్యార్థినితో కొంతకాలంగా ప్రేమలో ఉన్నాడు.
పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ, అందుకు ఆమోదం లభించలేదు. మనస్తాపం చెందిన రమేష్ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో తన ఇంట్లో పురుగుల ముందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు అతడ్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.