సికింద్రాబాద్: తనను ప్రేమించి పెళ్లి చేసుకోలేదన్న కోపంతో మాజీ ప్రియుడిపై శుక్రవారం రాత్రి కత్తితో దాడి చేసి హత్యాయత్నం చేసిన మహిళ ఉదంతమిది. చిలకలగూడ ఇన్‌స్పెక్టర్ కావేటి శ్రీనివాసులు కథనం ప్రకారం...సికింద్రాబాద్ వారాసిగూడకు చెందిన ఖలీమ్ (40) చికెన్ సెంటర్ వ్యాపారి. మలక్‌పేట్‌కు చెందిన క్లబ్ డ్యాన్సర్ గులాబీ అలియాస్ సుల్తానా మోనా (42) అనే మహిళతో కొద్ది సంవత్సరాల క్రితం పరిచయం ఏర్పడింది. నాలుగేళ్లు ప్రేమించుకుని విడిపోయూరు. ఇటీవల ప్రవూదంలో గాయుపడి చికిత్స పొందుతున్న ఖలీమ్‌ను పరావుర్శించేందుకు వచ్చింది. ఈ క్రవుంలో వారివుధ్య మళ్లీ మాటలు కలిశాయి. పెళ్లి చేసుకుందామని సుల్తానా, ఖలీమ్‌పై ఒత్తిడి తెచ్చింది. ఇదివరకే తనకు వివాహమైనందున కుదరదని తిరస్కరించాడు.
ఈ విషయుంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ఆమె ఫిర్యాదును తిస్కరించారు. తనను తిరస్కరించిన ఖలీమ్‌ను హతమార్చాలని సుల్తానా నిర్ణయించుకుంది. పథకం ప్రకారం శుక్రవారం రాత్రి సుల్తానా అంబర్‌నగర్‌లోని టైలర్‌షాపు ముందు నిల్చున్న ఖలీమ్‌పై కత్తితో దాడి చేసింది. పోలీసులు గాయుపడ్డ ఖలీమ్‌ను ఆస్పత్రికి తరలించారు. నిందితురాలి కోసం గాలిస్తున్నారు.
పెళ్లి చేసుకోలేదని మాజీ ప్రియుడిపై హత్యాయత్నం
Published Fri, May 8 2015 11:45 PM | Last Updated on Sun, Sep 3 2017 1:40 AM
Advertisement
Advertisement