
రోడ్ కం రైల్ వాహనం పరుగులు
ఖమ్మం రాపర్తినగర్/చింతకాని: పట్టాలు ఉన్నంత వరకు రైలు చక్రాలకు ఉండే యాక్సిల్‌తో.. పట్టాలు ముగియగానే సాధారణ టైర్లతో రోడ్డుపైనా పరుగులు తీయగల వాహనాన్ని రైల్వే అధికారులు వినియోగిస్తున్నారు. పట్టాలపై పగుళ్లను గుర్తించేందుకు యూఎఫ్‌ఎస్‌డీ యంత్రాన్ని అమర్చిన కారులో అధికారులు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నుంచి ఖమ్మం జిల్లా పందిళ్లపల్లి రైల్వేస్టేషన్ వరకు గురువారం పరిశీలించారు.
ఈ కారు రామకృష్ణాపురం రైల్వే గేట్ (107) వద్ద ఆగింది. అందులో ఉన్న ఎస్‌ఎస్‌ఈటీవే కృష్ణకుమార్ కిందకు దిగడంతో.. స్థానికులు ఆయనతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గతంలో పట్టాలపై పగుళ్లను గుర్తించేందుకు సిబ్బంది కాలినడకన వెళ్లే వారని తెలిపారు.
ప్రస్తుతం ప్రత్యేక యంత్రం అమర్చిన ఈ కారుకు రైలు చక్రాలకు ఉండే యాక్సిల్ ఉండటంతో పట్టాలపై వెళ్తుందని ఎస్‌ఎస్‌ఈటీవే కృష్ణకుమార్ వివరించారు. పట్టాలపై వెళ్లేటప్పుడు యాక్సిల్ కిందకు వచ్చి వాహనం కాస్త పైకి లేస్తుందని చెప్పారు. మళ్లీ కిందకు దింపితే రోడ్డుపై సాధారణ టైర్లతో వెళ్లొచ్చని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment