పలు రైళ్ల దారి మళ్లింపు | Diversion of multiple trains | Sakshi
Sakshi News home page

పలు రైళ్ల దారి మళ్లింపు

Published Sun, Aug 11 2024 5:41 AM | Last Updated on Sun, Aug 11 2024 5:41 AM

Diversion of multiple trains

రైల్వేస్టేషన్‌(విజయవాడ పశ్చిమ):  గుంటూరు డివిజన్‌లోని కొండ్రపోలు–విష్ణుపురం సెక్షన్‌లలో జరుగుతున్న ట్రాఫిక్‌ బ్లాక్‌ పనుల కారణంగా పలు రైళ్లను దారి మళ్లించి నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. 

సికింద్రాబాద్‌–సంత్రగచ్చి (07221) ఎక్స్‌ప్రెస్‌ నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు మీదుగా నడవాల్సిన ఈ రైలును ఈ నెల 13న వయా కాజీపేట, వరంగల్, విజయవాడ మీదుగా దారి మళ్లించారు. అదే విధంగా భువనేశ్వర్‌–పూణే (22882) ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 13న నల్గొండ, గుంటూరుకు బదులుగా వయా విజయవాడ, వరంగల్, కాజీపేట, సికింద్రాబాద్‌ మీదుగా ప్రయాణించనుంది. 

పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు పొడిగింపు 
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఇప్పటికే ప్రకటించిన పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను పొడిగించినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. నర్సాపూర్‌–బెంగళూరు (07153) ఈ నెల 16 నుంచి సెపె్టంబర్‌ 27 వరకు, బెంగళూరు–నర్సాపూర్‌ (07154) ఈ నెల 17 నుంచి సెపె్టంబర్‌ 28 వరకు, ధనాపూర్‌–బెంగళూరు (03245) ఈ నెల 14న, బెంగళూరు–ధనాపూర్‌ (03246) ఈ నెల 16న, ధనాపూర్‌–బెంగళూరు (03251) ఈ నెల 11, 12 తేదీలలోను, బెంగళూరు–ధనాపూర్‌ (03252) ఈ నెల 13, 14 తేదీలలోను, ధనాపూర్‌–బెంగళూరు (03259) ఈ నెల 13న, బెంగళూరు–ధనాపూర్‌ (03260) ఈ నెల 15న, ధనాపూర్‌–బెంగళూరు (03247) ఈ నెల 15న, బెంగళూరు–ధనాపూర్‌ (03248) ఈ నెల 17న, ధనాపూర్‌–బెంగళూరు (03241) ఈ నెల 16న, బెంగళూరు–ధనాపూర్‌ (03242) ఈ నెల  18న రైళ్లను నడవనున్నట్లు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement