సుధీర్‌ డ్యాన్స్‌ స్టెప్పులకు టైగర్‌ ఫిదా | Tiger Shroff Likes Telugu Hero Sudheer Babu Dance Moments | Sakshi
Sakshi News home page

సుధీర్‌ డ్యాన్స్‌ స్టెప్పులకు టైగర్‌ ఫిదా

Published Sat, Apr 18 2020 12:03 PM | Last Updated on Sat, Apr 18 2020 1:35 PM

Tiger Shroff Likes Telugu Hero Sudheer Babu Dance Moments - Sakshi

విలక్షణమైన పాత్రలను, కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు హీరో సుధీర్‌ బాబు. ఫిట్‌నెస్‌, డ్యాన్స్‌ విషయంలో ఏ మాత్రం రాజీపడని విషయం తెలిసిందే. తన ఫిట్‌నెస్‌కు సంబంధించి విడుదల చేసిన ఫోటోలు, వీడియోలు చూసి ఫ్యాన్స్‌ షాక్‌ అయిన సందర్భాలు అనేకం. తాజాగా సుధీర్‌ డ్యాన్స్‌కు బాలీవుడ్‌ హీరో టైగర్‌ ష్రాఫ్‌ ఫిదా అయ్యాడు. అంతేకాకుండా సుధీర్‌ డ్యాన్స్‌ మూమెంట్స్‌ను మెచ్చుకుంటూ ట్వీట్‌ చేశాడు. తన డ్యాన్స్‌కు కాంప్లిమెంట్‌ ఇచ్చిన టైగర్‌కు సుధీర్‌ ధన్యవాదాలు తెలిపాడు. 

ఇంతకీ విషయం ఏంటంటే?
సుధీర్‌ సినిమాలలోని బెస్ట్‌ డ్యాన్స్‌ మూమెంట్స్‌కు సంబంధించి ఓ వీడియోను సుధీర్‌ బాబు ప్రొడక్షన్స్‌ రూపొందించింది. అంతేకాకుండా ఆ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ఈ వీడియోపై స్పందించిన సుధీర్‌ బాబు మీకు నచ్చిన బెస్ట్‌ డ్యాన్స్‌ మూమెంట్‌ ఏంటో చెప్పండి అంటూ ఫ్యాన్స్‌ను కోరాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

చదవండి:
10 కోట్ల వ్యూస్‌.. సంబరంలో మహేశ్‌ ఫ్యాన్స్‌
పుష్ప కోసం హోమ్‌వర్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement