'పుష్ప: ది రైజ్’ మూవీ గతేడాది క్రిస్మిస్‌కు విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకురామ్-అల్లు అర్జున్ కాంబోలో పాన్ ఇండియా చిత్రంగా పుష్ప తెరకెక్కింది. ఈ మూవీ సీక్వెల్‌గా పుష్ప: ది రూలర్ పార్ట్ 2 ప్రస్తుతం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండే పార్ట్ 1 విడుదలకు ముందే పాటలు, ట్రైలర్‌తో సన్సెషన్ క్రియేట్ చేసింది. ఇందులోని రారా సామీ, సమంత స్పెషల్ సాంగ్ ఊ అంటావా మావా ఊఊ అంటావా పాటలు ఏ రెంజ్‌లో విజయం సాధించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ఊ అంటావా పాట అయితే రికార్డు సృష్టించింది. ఈ పాటను వివాదాలు చూట్టుముట్టినప్పటికీ, వ్యూస్ పరంగా ట్రెండింగ్‌లో దూసుకుపోయింది.
చదవండి: ఫుడ్ డెలివరి బాయ్‌గా మారిన స్టార్ కమెడియన్, ఫొటో వైరల్
ఇక అదే రెంజ్‌లో పార్ట్ 2కి కూడా సుక్కు-దేవిశ్రీ ఓ మాస్ మసాలా స్పెషల్ సాంగ్‌కు ప్లాన్ చేస్తున్నాడట. పార్ట్ 1లో సమంత అదరగొట్టగా.. పార్ట్ 2 కోసం బాలీవుడ్ బ్యూటీని సంప్రదించినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీతో ఈ సారి మాస్ స్టెప్పులు వేయించేందుకు సుక్కు ప్లాన్ చేస్తున్నాడట. త్వరలోనే దిశాతో చర్చలు కూడా జరపనున్నారని వార్తలు వినిపిస్తుండగా.. ఇప్పటికే ఆమెను సంప్రదించారని, దీనికి దిశా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ ఫిలిం దూనియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాలి.
చదవండి: ‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీపై ప్రకాశ్ రాజ్ షాకింగ్ కామెంట్స్, ట్వీట్ వైరల్
Comments
Please login to add a commentAdd a comment