బన్ని చిత్రంలో దిశా.. సుక్కు మాస్టర్‌ ప్లాన్‌ | Allu Arjun Sukumar Pushpa Telugu Movie Latest Update Viral | Sakshi
Sakshi News home page

బన్ని చిత్రంలో దిశా.. సుక్కు మాస్టర్‌ ప్లాన్‌

Published Thu, Apr 30 2020 8:40 PM | Last Updated on Thu, Apr 30 2020 8:46 PM

Allu Arjun Sukumar Pushpa Telugu Movie Latest Update Viral - Sakshi

టాలీవుడ్‌ స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్‌ నిర్మిస్తోంది. బన్ని బర్త్‌డే కానుకగా విడుదలైన టైటిల్‌ పోస్టర్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి మరో అప్‌డేట్‌ను లీకువీరులు అందించారు. సుకుమార్‌ తన ప్రతీ సినిమాలో ఐటమ్‌/స్పెషల్‌ సాంగ్‌కు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చే విషయం తెలిసిందే. ఈ లెక్కల మాస్టరు గత సినిమాలను పరిశీలిస్తే ఇదే స్పష్టమవుతుంది. 

తాజాగా ఈ సినిమాలో కూడా ఓ భారీ స్పెషల్‌ సాంగ్‌కు సుక్కు ప్లాన్‌ చేస్తున్నారట. ఈ పాట కోసం బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ దిశా పటానీని ఎంపిక చేశాడని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే దిశాతో చిత్రబృందం సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ప్యాన్‌ ఇండియాగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో నార్త్‌, సౌత్‌ ఆర్టిస్టులను ఎంపిక చేస్తూ ఈ సినిమాపై ​అందరిలోనూ ఆసక్తిని పెంచే ప్రయత్నం చేస్తున్నాడు సుకుమార్‌. ఇక డేట్స్‌ అడ్జస్ట్‌ కాకపోవడంతో ఈ చిత్రం నుంచి విజయ్‌ సేతుపతి తప్పుకోవడంతో బాబీ సింహాను చిత్రబృందం ఎంపిక చేశారని సమాచారం. దేవిశ్రీప్రసాద్‌ సంగీతమందిస్తున్నాడు. 

చదవండి:
వార్నర్‌కు థ్యాంక్స్‌ చెప్పిన అల్లు అర్జున్‌
అమ్మకి అమ్లెట్‌ వేసిన దేవిశ్రీ..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement