
Amul Pushpak The Slice Poster: ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తోంది. తెలుగులో వరుస పెట్టి పాన్ ఇండియా చిత్రాలు తీస్తున్న సమయంలో పుష్ప దేశవ్యాప్తంగా రిలీజై భారీ హిట్ అందుకుంది. పాన్ ఇండియా సినిమా విజయాన్ని అందుకుంటే ఎలా ఉంటుందో రుచి చూపించాడు బన్నీ. నార్త్, సౌత్ అన్న తేడా లేకుండా అంతటా ఈ సినిమా మార్మోగిపోతోంది. ఇలాంటి సమయంలో ఈ క్రేజ్‌ను తనకు అనుకూలంగా మలుచుకుంది అమూల్.
అదెలాగంటారా? సాధారణంగా అమూల్ వ్యాపార వాణిజ్య ప్రకటనలో చిన్నపిల్లలు ఉంటారు. అయితే తాజాగా అమూల్ రిలీజ్ చేసిన పోస్టర్‌లో పుష్పరాజ్, శ్రీవల్లి ఉన్నారు. 'పుష్పక్ ది స్లైస్.. అమూల్ హావ్ సమ్ అమ్ములు, అర్జున్..' అంటూ కార్టూన్‌ను షేర్ చేసింది. దీనికి బన్నీ రిప్లై ఇస్తూ 'అల్లు టు మల్లు టు అమ్ములు అర్జున్' అని కామెంట్ చేశాడు. బ్రాండ్ ప్రమోషన్ కోసం పుష్ప క్యారెక్టర్లను బాగానే వాడుకుంటున్నారంటూ అమూల్‌ను మెచ్చుకుంటున్నారు నెటిజన్లు. కాగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ డిసెంబర్ 17న థియేటర్లలో విడుదలైంది. దీనికి సీక్వెల్‌గా పుష్ప: ద రూల్ తెరకెక్కనుండగా ఇది ఈ ఏడాది చివరికి రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment