ఏంది పుష్పా ఇది? ఇంకా షూటింగే కాలే.. అప్పుడే వెయ్యి కోట్లా? | Pushpa 2 Movie Pre Release Business including All Rights 1000 cr | Sakshi
Sakshi News home page

Pushpa Movie: పుష్పరాజ్‌ దెబ్బ.. సెకండ్‌ పార్ట్‌కు రూ.1000 కోట్ల డీల్‌..!

Published Mon, Sep 4 2023 3:37 PM | Last Updated on Mon, Sep 4 2023 4:29 PM

Pushpa 2 Movie Pre Release Business including All Rights 1000 cr - Sakshi

పుష్ప.. పుష్పరాజ్‌.. అప్పుడే వేట మొదలుపెట్టాడు. పుష్ప సినిమాకు కలెక్షన్స్‌ మాత్రమే కాదు అవార్డులు సైతం వచ్చాయి. 69 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న జాతీయ ఉత్తమ నటుడి అవార్డును పుష్పరాజ్‌ తన వశం చేసుకున్నాడు. ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డుల్లో అల్లు అర్జున్‌కు ఉత్తమ నటుడి పురస్కారం వరించింది. దీనిపై యావత్‌ తెలుగు ప్రజలు సంబరాలు చేసుకున్నారు. ఈ అవార్డుతో తన రేంజ్‌ ఏంటో మరోసారి చూపించాడు పుష్పరాజ్‌.

ఇకపోతే ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే! మొదటిదాన్ని మించిపోయేలా రెండో పార్ట్‌  తీయాలని ప్రయత్నిస్తున్నాడు సుకుమార్‌. మేకింగ్‌ దశలోనే పుష్ప 2కి అదిరిపోయే ఆఫర్స్‌ వస్తున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ ఏకంగా రూ.1000 కోట్లు ఆఫర్‌ చేసినట్లు టాక్‌! పుష్ప 2 సినిమాకు సంబంధించిన అన్ని రకాల హక్కులను తమకు సొంతం చేయాలని, అలాగైతే వెయ్యి కోట్లు ఇస్తామని ముందుకు వచ్చినట్లు ప్రచారం నడుస్తోంది.  మరి ఈ ఆఫర్‌కు పుష్ప మేకర్స్‌ ఎలా స్పందించారు? అసలు ఈ ప్రచారంలో నిజమెంత? అన్నది తెలియాల్సి ఉంది.

చదవండి: మొదటి వారం నామినేషన్స్‌లో 8 మంది.. ఎవరెవరంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement