Manish Shah Says Pushpa 2 Will Break Baahubali Box Office Records, Deets Inside - Sakshi
Sakshi News home page

Pushpa 2: అదే నిజమైతే బన్ని ఫ్యాన్స్ మరో ఏడాది వెయిట్‌ చేయాల్సిందే!

Published Tue, Jan 25 2022 12:27 PM | Last Updated on Tue, Jan 25 2022 1:30 PM

Pushpa 2 Will Break Baahubali 2 Recoreds Manish Shah Says - Sakshi

పుష్పకు ముందు అల్లు అర్జున్‌ పేరు టాలీవుడ్ , మాలీవుడ్ లోనే రిపీటెడ్ గా వినిపించేది. కాని పార్ట్ 1 రిలీజైన తర్వాత బన్ని ఇప్పుడు బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోగా మారాడు. పుష్ప పార్ట్ 2 కోసం బీటౌన్ ఆడియెన్స్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. రెండో భాగం రిలీజ్ చేస్తే బాహుబలి 2 అంత పెద్ద హిట్ చేసి పెడతాం అంటున్నారట.

బహుబలి 2 హిందీ వర్షన్‌ రూ.500 కోట్లకు పైగా కొల్లగొట్టింది. ఇప్పటికీ ఈ రికార్డ్ పదిలంగా ఉంది. బాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్స్ సల్మాన్, షారుఖ్, ఆమిర్, అజయ్ ,అక్షయ్, హృతిక్, రణభీర్,రణవీర్,ఎవరూ కూడా ఈ మార్క్ ను టచ్ చేయలేదు. అయితే ఈ రికార్డ్‌ ను బన్ని బద్దలు కొడతాడని చెబుతున్నాడు పుష్ప పార్ట్ 2 హిందీ రైట్స్ కొనుగోలు చేసిన మనీష్ షా.

పుష్ప 2 కోసం బాలీవుడ్ ఆడియెన్స్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారని, ఈ సినిమా సీక్వెల్ హిందీ వర్షన్ సూపర్బ్ రెస్పాన్స్ అందుకుంటుందని అన్ని కుదిరితే బాహుబలి 2 నెలకొల్పిన 500 కోట్ల వసూళ్లను కూడా అధిగమిస్తుందని తెలిపాడు మనీష్ షా. అంతే కాదు ఈ పుష్ప 2 ఈ ఏడాది విడుదల కాదు అంటున్నాడు.

పుష్ప2 స్టోరీని పాన్‌ ఇండియా ఆడియెన్స్ కు నచ్చే విధంగా సుకుమార్ రీరైట్ చేస్తున్నాడట. పుష్పరాజ్ క్యారెక్టర్ ను మరింత పవర్ ఫుల్ గా డిజైన్ చేస్తున్నాడట సుకుమార్. ఈ ఏడాది మార్చి నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతున్నట్లు తెలుస్తోంది.  దాదాపు 250 రోజుల పాటు చిత్రీకరణ జరపుకుంటుందట. భారీ బడ్జెట్ తో సీక్వెల్ ను తెరకెక్కించబోతున్నారట. అందుకే 2022లో కాకుండా 2023లో పుష్ప2ను విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు ప్రయత్నిస్తున్నారట. అదే నిజమైతే బన్ని ఫ్యాన్స్ పుష్ప2 కోసం మరో ఏడాది వెయిట్ చేయాల్సిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement