Ravi Ashwin Dancing For Allu Arjun Pushpa Srivalli Song Step, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Ravi Ashwin- Pushpa: ఇదేందయ్యా.. ఇది మేము చూడలా... శ్రీవల్లి స్టెప్పులు.. అశూ వేరే లెవల్‌! వైరల్‌..

Published Sat, Jan 29 2022 5:04 PM | Last Updated on Sat, Jan 29 2022 7:30 PM

Ravi Ashwin Performs Famous Allu Arjun Puspha Srivalli Hook Step Goes Viral - Sakshi

క్రికెట్‌ ప్రపంచాన్ని ‘పుష్ప’ ఫీవర్‌ వెంటాడుతోంది. ఇప్పటికే టీమిండియా క్రికెటర్లు రవీంద్ర జడేజా, శిఖర్‌ ధావన్‌, సురేశ్‌ రైనా, హార్దిక్‌ పాండ్యా తదితరులు ఈ సినిమాలోని పలు పాటలకు స్టెప్పులేయగా.. ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ రోజుకో వీడియోతో అలరిస్తున్నాడు. తాజాగా టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ కూడా ఈ జాబితాలో చేరిపోయాడు. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటించిన పుష్పలోని శ్రీవల్లి పాటకు తనదైన శైలిలో స్టెప్పులేశాడు.

అందరిలా బన్నీని అనుకరిస్తూ కాకుండా బ్యాట్‌ చేతబట్టి వెరైటీగా కాలుకదిపాడు. ఈ క్రమంలో స్లిప్పర్‌ ఊడిపోయినా సరే.. ఏకాగ్రత కోల్పోకుండా చాలా శ్రద్ధగా స్టెప్పు పూర్తి చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీనిపై స్పందించిన భారత ఫీల్డింగ్‌ మాజీ కోచ్‌ ఆర్‌ శ్రీధర్‌ తగ్గేది లేదు అంటూ కామెంట్‌ చేశాడు. ఇక మరికొంత మంది ఫ్యాన్స్‌ మాత్రం... ‘‘ఇదేందయ్యా ఇది మేము చూడలా... ఏదేమైనా అందరిలా అల్లు అర్జున్‌ను కాపీ కొట్టకుండా ఓ క్రికెటర్‌లా నీదైన శైలిలో స్టెప్పులేశావు... బాగుంది అశూ’’ అంటూ సరదాగా ట్రోల్‌ చేస్తున్నారు. 

కాగా ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా టెస్టు, వన్డే సిరీస్‌లో పాల్గొన్న అశ్విన్‌కు పెద్దగా కలిసిరాలేదు. టెస్టు సిరీస్‌లో కేవలం మూడు వికెట్లు తీసిన అశూ... రెండు వన్డేల్లో కలిపి కేవలం ఒకే వికెట్‌ తీయగలిగాడు. ఈ క్రమంలో వెస్టిండీస్‌తో స్వదేశంలో జరుగనున్న పరిమిత ఓవర్ల సిరీస్‌ ఆడనున్న జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.

చదవండి: IND vs WI: టీమిండియా వైస్ కెప్టెన్‌గా రిష‌భ్‌ పంత్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement