పుష్ప పార్ట్‌ 2 షూటింగ్‌ను నార్త్‌లో ప్లాన్‌ చేస్తున్న సుక్కు? బాలీవుడ్‌ హీరోకు కీ రోల్‌! | Is Sukumar Plans Pushpa Movie Part 2 Shooting In North India | Sakshi
Sakshi News home page

Pushpa Movie: పుష్ప పార్ట్‌ 2 షూటింగ్‌ను నార్త్‌లో ప్లాన్‌ చేస్తున్న సుక్కు?

Published Fri, Feb 25 2022 5:59 PM | Last Updated on Fri, Feb 25 2022 6:37 PM

Is Sukumar Plans Pushpa Movie Part 2 Shooting In North India - Sakshi

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌-సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'పుష్ప: ది రైజ్‌' ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డిసెంబర్‌17న విడుదలైన ఈ చిత్రం ఈ ఏడాది బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. బాలీవుడ్‌లోనూ మంచి వసూళ్లను సాధించింది. ఇప్పటికే  ప్రపంచ వ్యాప్తంగా రూ. 300కోట్ల ట్రేడ్‌ మార్క్‌ను దాటేసిన పుష్ప.. త్వరలోనే పార్ట్‌ 2 షూటింగ్‌ను మొదల పెట్టనుంది. అయితే సేమ్‌ లొకేషన్స్‌లోనే కదా పార్ట్‌ 2 ఉండేది.. షూటింగ్‌ శరవేగంగా జరిగపోతుందిలే అని అంతా అనుకున్నారు.

చదవండి: ఆ బడా నిర్మాత కొడుకుతో ‘గని’ మూవీ హీరోయిన్‌ ప్రేమయాణం..

కానీ సుకుమార్‌ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ పార్ట్‌ 2 కోసం కొత్త లొకేషన్స్‌ చూస్తున్నాడట. అయితే పార్ట్‌ 2ను సౌత్‌లో కాకుండా నార్త్‌లో ఎక్కువగా చిత్రీకరించాలని భావిస్తున్నాడట మన లెక్కల డైరెక్టర్‌. ఎందుకంటే బాలీవుడ్‌ పుష్ప రూ. 100 కోట్లపైనే వసూలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో హిందీ ప్రేక్షకులను ఓన్‌ చేసుకునేందుకు సుక్కు అక్కడి లోకేషన్స్‌లోనే  పుష్ప 2ను షూటింగ్‌ జరపాలనుకుంటున్నాడట. అంతేకాదు మంచి హైప్‌ ఇచ్చేందుకు బాలీవుడ్ స్టార్ హీరోను కూడా కీలకమైన పాత్ర కోసం తీసుకుంటున్నారని అంటున్నారు.

చదవండి: ఛీఛీ ఇలాంటి చెత్త వీడియోలో నటించడమేంటి, కాస్తా చూసుకో: కీర్తిపై దారుణమైన ట్రోల్స్‌

కాగా పార్ట్‌ 1లో ఎర్ర చందనం స్మగ్లర్‌గా కనిపించిన బన్నీ చివరిలో స్మగ్లింగ్‌ దందాను హెడ్‌గా కనిపిస్తాడు. ఇలా అందరిని శాసించే స్థాయికి ఎదిగిన పుష్పరాజ్‌ ఆ తర్వాత ఏసీపీ దరావత్‌ సింగ్‌ను చుక్కలు చూపిస్తాడట. ఈ క్రమంలో ఇద్దరి మధ్య చోటు చేసుకునే సన్నివేశాలు చాలా ఆసక్తిగా ఉండనున్నాయట. ఇక పుష్పరాజ్‌ భార్యగా రష్మిక కనిపించనుండగా అందుకు తగ్గట్టే పాటలు, ఫైట్‌ సీన్స్‌ ఉండనున్నాయి. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ‘పుష్ప’ పార్ట్‌ 2 అతిత్వరలోనే సెట్స్‌పై రానుందని సమాచారం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement