
పుష్ప సినిమా విడుదలై నెల రోజులు కావస్తున్నా దాని క్రేజ్ మాత్రం ఇంచు కూడా తగ్గలేదు. ఇప్పటికీ పుష్ప డైలాగులు, పాటలు మార్మోగుతూనే ఉన్నాయి. బాక్సాఫీస్‌ను దడదడలాడించిన ఈ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో కూడా రఫ్ఫాడిస్తోంది. తాజాగా పుష్ప చిత్రాన్ని లోకనాయకుడు కమల్ హాసన్ వీక్షించాడు. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్‌తో కలిసి చూశారు. ఈ విషయాన్ని రాక్‌స్టార్ ట్విటర్‌లో అభిమానులతో పంచుకున్నాడు.
'ప్రియమైన కమల్ హాసన్ సర్, మీరు సమయం తీసుకుని పుష్ప సినిమాను వీక్షించినందుకు ధన్యవాదాలు. మా పనితీరుపై ప్రశంసలు కురిపించిన మీకు కృతజ్ఞతలు' అని చెప్తూ కమల్‌తో దిగిన ఫొటోను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్‌గా మారింది. ఇది చూసిన అల్లు అర్జున్ తమ సినిమా చూసిన కమల్‌కు ధన్యవాదాలు తెలిపాడు. పుష్ప: ద రైజ్‌ను తెరకెక్కించిన సుకుమార్ రెండో భాగాన్ని ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు. వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్ మొదలవుతుండగా డిసెంబర్‌కల్లా రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.
Thank you for watching #Pushpa @ikamalhaasan garu . Humbled 🙏🏼
— Allu Arjun (@alluarjun) January 15, 2022
Comments
Please login to add a commentAdd a comment