క్రేజీ అప్‌డేట్‌.. ఆ రోజు నుంచే ‘పుష్ప-2’ రెగ్యులర్‌ షూటింగ్‌! | Allu Arjun And Sukumar Pushpa Part 2 Shooting Starts From October 1st | Sakshi
Sakshi News home page

Allu Arjun-Pushpa 2: క్రేజీ అప్‌డేట్‌.. ఆ రోజు నుంచే ‘పుష్ప-2’ రెగ్యులర్‌ షూటింగ్‌!

Published Mon, Sep 26 2022 8:34 AM | Last Updated on Mon, Sep 26 2022 8:54 AM

Allu Arjun And Sukumar Pushpa Part 2 Shooting Starts From October 1st - Sakshi

పుష్పరాజ్‌ మళ్లీ సెట్స్‌లోకి అడుగుపెట్టే సమయం ఆసన్నమైంది. హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప: ది రైజ్‌’ గత ఏడాది డిసెంబరులో విడుదలై అద్భుత విజయం సాధించింది. ఇందులో పుష్పరాజ్‌ పాత్రలో నటించారు అల్లు అర్జున్‌. తాజాగా రెండో భాగం ‘పుష్ప: ది రూల్‌’కు రంగం సిద్ధం చేశారు సుకుమార్‌ అండ్‌ కో. ఇటీవలే ‘పుష్ప: ది రైజ్‌’ పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ అక్టోబరు 1 నుంచి ప్రారంభం కానుందని టాక్‌. 

చదవండి: అలనాటి హీరోయిన్‌ గౌతమి కూతురిని చూశారా? త్వరలో హీరోయిన్‌గా ఎంట్రీ!

ఈ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలను ప్లాన్‌ చేశారు చిత్రయూనిట్‌. కొందరు హాలీవుడ్‌ టెక్నీషియన్స్‌ కూడా ఈ సినిమాకు వర్క్‌ చేస్తున్నారట. మైత్రీమూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. తొలిభాగంలో అల్లు అర్జున్‌తో జోడీ కట్టిన రష్మికా మందన్నానే రెండో భాగంలోనూ హీరోయిన్‌. ఫాహద్‌ ఫాజిల్, సునీల్, అనసూయ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. కాగా ‘పుష్ప: ది రూల్‌’ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement