
తమిళ చిత్రం సుల్తాన్‌లో కార్తీతో జోడీ కట్టనుంది పుష్ప బ్యూటీ రష్మిక. తెలుగు, తమిళ భాషల్లో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న పుష్ప చిత్రంలో నటించి రష్మిక మందన్నా అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఎక్కడకు వెళ్లిన తన క్యూట్ స్మైల్‌తో అభిమానులను ఫిదా చేస్తోంది. ప్రస్తుతం విజయ్ సరసన శ్రీవల్లి అనే చిత్రంలో నటిస్తోంది ఈ అమ్మడు. మరోపక్క హిందీ సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా గడుపుతోంది.
ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ ‘విజయ్ సరసన నటించాలనేది నా కలల్లో ఒకటి. అది కూడా పూర్తయిందని ఓ ఇంటర్య్వూలో చెప్పింది. నటీనటులు తమ సినిమాలు బాగా ఆడాలని కోరుకోవడం సహజం. కానీ సినిమా ఇండస్ట్రీకి వచ్చాక అన్ని భాషల్లో విడుదలయ్యే సినిమాల్లో నటించి ఇండియన్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకోవాలని అనుకుంటోందట రష్మిక. అది ‘పుష్ప’ చిత్రంతో తన కోరిక తీరిందని, ఇప్పుడు హిందీ చిత్రం గుడ్ బై చిత్ర షూటింగ్ సమయంలో అమితాబ్ బచ్చన్‌తో కలిసి పుట్టినరోజు జరుపుకున్నానని, ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి అంటోంది ఈ అమ్మడు.
Comments
Please login to add a commentAdd a comment